ఇంట్రెస్టింగ్..ఈ 3 సంక్రాంతి సినిమాలు ఒకే రన్ టైం తో.?

ఇంట్రెస్టింగ్..ఈ 3 సంక్రాంతి సినిమాలు ఒకే రన్ టైం తో.?

Published on Dec 29, 2022 1:00 PM IST

మరికొన్ని రోజుల్లో సౌత్ సినిమా దగ్గర భారీ బాక్సాఫీస్ క్లాష్ అయితే జరగడానికి సిద్ధంగా ఉంది. సంక్రాంతి బరిలో తెలుగు సహా తమిళ్ లో కూడా బిగ్గెస్ట్ స్టార్స్ తాలూకా చిత్రాలు రిలీజ్ కి రెడీగా ఉండగా వాటిలో నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం “వీరసింహా రెడ్డి” ఒకటి కాగా మరో చిత్రాలు అజిత్ నటించిన తునివు అలాగే విజయ్ నటించిన వారిసు చిత్రాలు ఉన్నాయి.

మరి ఈ మూడు చిత్రాలు కూడా దాదాపు ఒకే రన్ టైం లో వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రాలను అయితే ఓవర్సీస్ లో సినీ మార్క్ సినిమాస్ లో రిలీజ్ అవుతుండగా వారు అయితే ఈ మూడు సినిమాలు కూడా 2 గంటల 40 నిమిషాల నిడివి తోనే వస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే వీటిపై మన నుంచి ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే ఈ చిత్రాల్లో వీరసింహా రెడ్డి, వారిసు చిత్రాలు జనవరి 11న యూఎస్ లో ప్రీమియర్స్ పడనుండగా మన దగ్గర అయితే 12న రిలీజ్ కాబోతున్నాయి. అలాగే అజిత్ సినిమా జనవరి 10 నే ప్రీమియర్స్ తో స్టార్ట్ కానున్నట్టుగా టాక్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు