ఇంటర్నేషనల్ మూవీ గా సైలెన్స్ !

Anushka

స్టార్ హీరోయిన్ అనుష్క ,మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించనున్నచిత్రం సైలెన్స్. హేమంత్ మధుకర్ తెరకెక్కించనున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఈ నెలలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రంలో సుబ్బరాజు , అంజలి , షాలిని పాండే తో పాటు ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగు , తమిళంతో పాటు ఇంగ్లీష్ లోనూ ఒకే సారి తెరకెక్కించనున్నారు.

గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. కోన ఫిలిం కార్పొరేషన్ ,పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించనున్న ఈచిత్రం ఈ ఏడాది చివర్లో విడుదలకానుంది.

Exit mobile version