ఇంటర్వ్యూ : రవీంద్ర – బంగ్లా బ్యాక్ డ్రాప్లో జరిగే సీన్లు సినిమాకే హైలెట్ అవుతాయి !

లేడీ సూపర్ స్టార్ అనుష్క నటించిన ‘భాగమతి’ చిత్రం ఈ నెల 26న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఏ సినిమాకు అద్భుతమైన సెట్స్ వేసిన ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) సినిమా కోసం వేసిన బంగ్లా సెట్ గురించి చెప్పండి ?
జ) కథ పరంగా సినిమాకు 300 ఏళ్ల క్రితంనాటి బంగ్లా కావాలి. దాని కోసం ఎంతో రీసెర్చ్ చేసి కొత్త టెక్నాలజీని ఉపయోగించి డిజైన్ తయారుచేసి కేవలం 29 రోజుల్లో బంగ్లా సెట్ ను వేశాం.

ప్ర) వర్క్ మొత్తం పూర్తయ్యాక దాన్ని చూసి టీమ్ ఎలా రియాక్ట్ అయ్యింది ?
జ) సెట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నిజానికి సెట్ యొక్క భారీతనం, లుక్ ఇంకాస్త ఎక్కువ కష్టపడి బెటర్ ఔట్ ఫుట్ ఇచ్చేలా దోహదపడింది.

ప్ర) బంగ్లా బ్యాక్ డ్రాప్లో జరిగే హర్రర్ సినిమాల్ని ఇదివరకే చూశాం. మరి ‘భాగమతి’లో కొత్తగా ఏముంటుంది ?
జ) ‘భాగమతి’ పూర్తిస్థాయి హారర్ చిత్రం కాదు. హర్రర్ కంటెంట్ కొంత మాత్రమే ఉంటుంది. ఇతర సినిమాలకి దీనికి పోలిక ఉండదు. సుమారు 45 రోజుల పాటు బంగ్లాలో షూటింగ్ జరిపాం. అక్కడ షూట్ చేసిన సన్నివేశాలకు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి.

ప్ర) పరిశ్రమలోనే ఇదొక కాస్ట్లీ సెట్ అనే టాక్ ఉంది. దానికి మీ కామెంట్ ?
జ) అవును నిజమే. ఈ సెట్ మీద ఎక్కువే ఖర్చు చేశాం. పెట్టిన ప్రతి పైసా స్క్రీన్ మీద కనబడుతుంది. ఇప్పటివరకు నేను చేసిన వర్క్స్ లో ఇదే బెస్ట్ అని చెప్పగలను.

ప్ర) ఇంతకీ సినిమా ఎలా ఉండబోతోంది ?
జ) అందరూ మంచి సినిమా చేశామని అంటున్నారు. కానీ మా వరకు మేము ఒక సిన్సియర్ ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నం అందరినీ మెప్పిస్తుందని నా నమ్మకం.

ప్ర) వర్క్ మొదలుపెట్టే ముందే మొత్తం స్క్రిప్ట్ విన్నారా ?
జ) అవును విన్నాను. ఏ సినిమాకైనా అలాగే వింటాను. అప్పుడే సినిమా యొక్క కాన్సెప్ట్ అర్థమై ఎలాంటి సెట్స్ కావాలో అలాంటివే ఇవ్వగలం.

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి ?
జ) ప్రస్తుతం మారుతి, నాగ చైతన్యల సినిమా, మోహన్ కృష్ణ ఇంద్రగంటి చిత్రం చేస్తున్నాను. ఈ మధ్యే సుధీర్ వర్మ ప్రాజెక్ట్ ఒప్పుకున్నాను. ఇవి కాకుండా ఒక తమిళ సినిమా కూడా చేస్తున్నాను.