ఇంటర్వ్యూ : బెల్లంకొండ శ్రీనివాస్ – ‘సీత’ ట్రెండ్ సెట్టింగ్ స్టోరీ

బెల్లంకొండ శ్రీనివాస్ కాజల్ అగర్వాల్ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ “సీత”. మొదటిసారి శ్రీనివాస్ నటనకు ప్రాధాన్యం ఉన్న రోల్ లో నటిస్తున్నారు. అన్ని సన్నాహాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ నెల 24 విడుదలకు సిద్ధమైంది. ఈ సంధర్బంగా హీరో సాయి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఆ విషాలేంటో చూద్దాం.

మీకు ఈ సినిమాలో నటించే అవకాశం ఎలా వచ్చింది ?

నిజానికి నాతో సినిమా చేయాలనే ఆలోచనతో నాకు “సీత” కథను వినిపించారు తేజ గారు. కమర్షియల్ స్టోరీ వైపు మొగ్గు చూపినా, సీత స్రిప్ట్ లో నా పాత్ర గొప్పగా ఉండటంతో ఓకే చేశాను. ఇంత గొప్పగా నటించే అవకాశం ఇచ్చిన మూవీ ని వదులుకోకూడదు అనుకున్నాను.

తేజ తో పనిచేసిన అనుభవం ఎలా ఉంది?

చిత్రీకరణ మొదటి రోజు జరిగిన సంఘటన నాకు ఇప్పటికి స్పష్టంగా గుర్తుంది. తేజ గారు నాకొక పెద్ద డైలాగ్ ఉన్న పేపర్ చేతిలో పెట్టి రెడీ అవ్వు అనడంతో , ఏమిటీ ఈయన మొదటి రోజే నాకు ఇంత పెద్ద పరీక్ష పెట్టేశారు అని షాక్ కి గురయ్యాను. నా వ్యాన్ లోకి వెళ్ళి కొంత సేపు ప్రిపేరై వచ్చి సింగల్ టేక్ లో చేశాను, దానితో షాక్ తిన్న తేజ గారు నన్ను మెచ్చుకోవడంతో చాలా ఆనందం వేసింది.

హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న మూవీలో నటించడం కొంచెం ఇబ్బందిగా అనిపించలేదా?

నాకు మంచి నటుడిగా నిరూపించుకోవాలని ఉంది, కాబట్టి హీరోయిన్ పాత్ర పేరు టైటిల్ గా గల మూవీలో నటించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నాది మంచి పాత్ర అని నాకు పూర్తి నమ్మకం ఉంది. షూటింగ్ జరిగినన్నాళ్లు ఏనాడూ నేను ఇది కాజల్ కి ప్రాధాన్యం ఉన్న సినిమా అని ఫీల్ కాలేదు.

ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి ?

జీవితంలో ప్రతి ఒక్కరికి నిజాయితీగా ఉండాలని చెప్పే బాగా చదువుకున్న యువకునిగా నా పాత్ర ఉంటుంది. సీతకి ఎదురయ్యే సమస్యలలోకి ప్రశాంతగా సాగిపోతున్న నా పాత్ర ఎలా నెట్టబడింది అనేది అసలు కథ.

కాజల్ సరసన హీరో గా చేసిన అనుభవం ఎలా ఉంది ?

నేను స్క్రిప్ట్ విన్న మొదటి రోజునుండే సీతగా కాజల్ చేయబోతున్నారని తెలుసు. పెర్పామెన్స్ కి మంచి స్కోప్ ఉన్న ఈ మూవీకి కాజల్ పర్ఫెక్ట్ హీరొయిన్ .

“సీత”కి “నిజం” మూవీకి ఏమైనా పోలికలున్నాయా?

ఈ రూమర్ నేను విన్నాను, అందులో ఎటువంటి నిజం లేదు. ఇది పూర్తిగా వైవిధ్యమైన కథ. పాత కథలను అనుసరించి సినిమాలు తీసే అలవాటు తేజ గారికి లేదు. నా ఆభిప్రాయంలో ఇది ట్రెండ్ సెట్టింగ్ స్టోరీ.

Exit mobile version