ఇంటర్వ్యూ : బెల్లంకొండ శ్రీనివాస్ – నాన్న మంచితనం వలనే పెద్ద దర్శకులతో వర్క్ చేయగలిగాను

‘అల్లుడు శ్రీను’ తో తెలుగు తెరకు హీరోగా పరిచయం అయిన బెల్లంకొండ శ్రీనివాస్ ‘జయ జానకి నాయక’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుని త్వరలో ‘సాక్ష్యం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రేపు తన పుట్టినరోజు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ‘సాక్ష్యం’ సినిమా గురించి చెప్పండి?

జ)కథ పరంగా నేను ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ‘సాక్ష్యం’ బెస్ట్ సినిమా అవుతుంది. సినిమాలో 5 యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. పీటర్ హెయిన్స్ మాస్టర్ ఛాలెంజింగ్ గా తీసుకొని వాటిని కంపోజ్ చేశారు.

ప్ర) సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి ?

జ)దర్శకుడు శ్రీవాస్ నా పాత్రను చాలా బాగా డిజైన్ చేశారు. నేను వీడియో గేమ్ డిజైనర్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నాను.

ప్ర) ‘సాక్ష్యం’ సినిమా షూటింగ్ విశేషాలేంటి ?
జ) మూడు పాటలు, క్లైమాక్స్ మినహా సినిమా మొత్తం పూర్తయ్యింది. త్వరలోనే న్యూయార్క్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభంకానుంది.

ప్ర) ‘సాక్ష్యం’ అనే టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి ?

జ)మా సినిమా ప్రకృతి చుట్టూ తిరుగుతుంది. అందుకే ఆ టైటిల్ అయితే బాగుంటుందని పెట్టాం.

ప్ర) డైరెక్టర్ శ్రీవాస్ గురించి చెప్పండి ?

జ)కష్టపడే తత్త్వం ఉన్న దర్శకుల్లో శ్రీవాస్ ఒకరు. ఈ సినిమాతో ఆయన మరో ఎత్తుకు ఎదుగుతాడు. ఈ సినిమాకు మంచి స్క్రీన్ ప్లే అందించారాయన.

ప్ర)మీరు వినాయక్, బోయపాటి శ్రీను వంటి టాప్ దర్శకులతో పనిచేశారు. దాని గురించి ?

జ)నాన్న మంచితనం వలన నాకు పెద్ద దర్శకులతో పనిచేసే అవకాశం ఇచ్చింది. వారి దగ్గర చాలా నేర్చుకున్నాను. కెరీర్ మొదట్లోనే వారితో వర్క్ చెయ్యడం అదృష్టంగా భావిస్తున్నాను.

ప్ర)మీ సినిమాలకు విమర్శకులు ఎవరు ?
జ)నా స్నేహితులు మరియు కుటుంభ సభ్యులే నా విమర్శకులు. నేను ఎక్కువ బయట తిరగను కాబట్టి వారి సలహాలు సూచనలే పాటిస్తాను.

ప్ర) ‘సాక్ష్యం’ ఎప్పుడు విడుదల కానుంది ?

జ)ఈ ఏడాది వేసవిలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మే నెలలో రిలీజ్ అవ్వొచ్చు.

ప్ర)మీ తదుపరి సినిమాలు ?

జ)ప్రస్తుతం నేను ‘సాక్ష్యం’ సినిమాపైనే ఫోకస్ చేస్తున్నాను. కొత్త సినిమా ఒప్పుకుంటే అధికారికంగా తెలియజేస్తాను.