ఇంటర్వ్యూ : బాబీ – జై లవ కుశ చిత్రానికి ఎన్టీఆర్ తప్ప మరే హీరో సరిపోడు
Published on Sep 23, 2017 4:36 pm IST


జై లవ కుశ చిత్రం విడుదలై పాజిటివ్ టాక్ తో విజయవంతంగా రన్ అవుతోంది. ఈ సందర్భంగా జరిపిన ఇంటర్వ్యూ లో దర్శకుడు బాబీ పలు విషయాలని వెల్లడించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

ప్ర) మీరు కథని ఎన్టీఆర్ కు వివరించినపుడు ఆయన ఎలా స్పందించారు ?

జ) నేను ఎన్టీఆర్ కు అరగంట పాటు కథని నేరేట్ చేశాను. ఎన్టీఆర్ ఇంకేమి మాట్లాడలేదు. మనం ఒక వారం తరువాత కలుద్దాం అని చెప్పారు. కథ విన్నాక ఆయన కళ్లలో పాజిటివ్ రియాక్షన్ కనిపించింది. తిరికి పిలుస్తారని ఖచ్చితంగా భవించాను. సరిగ్గా వారం తరువాత ఎన్టీఆర్ నుంచి పిలుపండింది. అంతే చిత్రం పట్టాలెక్కేసింది.

ప్ర) ఎన్టీఆర్ ని నెగిటివ్ పాత్రలో చూపించడం రిస్క్ అనిపించలేదా ?

జ) ఒక్క శాతం కూడా అనిపించలేదు. నెగిటివ్ పాత్ర, నత్తిగా మాట్లాడడం వంటి అంశాలు కథలో ఉన్నాయి. మిగిలిన రెండు పత్రాలు కూడా ఎన్టీఆర్ చేసినవే. కాబట్టి నెగిటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రలో ఎన్టీఆర్ ని చూపింకెహ్డం రిస్క్ అనిపించలేదు.

ప్ర) చివర్లో జై మరణిస్తాడు.. దీనిపై ఎలాంటి స్పందన వస్తోంది ?

జ) చిత్ర ముగింపుకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పైగా అది బాగాలేదని ఎవరూ చెప్పలేదు. ఒకవేళ జై మరణించకుండా ఉంటె కథ రొటీన్ గా మారిపోయేది.

ప్ర) ఎన్టీఆర్ తో కలసి పనిచేయడం ఎలా అనిపించింది ?

జ) ఎన్టీఆర్ లాగా డెడికేషన్ తో పనిచేసే నటుడిని చూడలేదు. మూడు పాత్రల కోసం కొన్ని ప్రత్యేకమైన గ్రాఫిక్ విధానాన్ని ఫాలో అవుదామని అనుకున్నాం. కానీ ఎన్టీఆర్ ఇచ్చిన హావ భావాలతో ఆ అవసరం లేకుండా పోయింది. అలాంటి కఠినమైన పాత్రలు ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమని అనిపించింది.

ప్ర) ఈ చిత్రానికి మీకు అందిన ఉత్తమ ప్రశంస ఏంటి ?

జ) చిత్రం విడుదలయ్యాక ప్రేక్షుకుల నుంచి వచ్చిన స్పందన చాలా సంతోషంగా అనిపించింది. రాజమౌళి గారిని ఎన్టీఆర్ ఇంట్లో కలిశాను. మా చిత్రాన్ని ఆయన ప్రశంసించారు. కథని తెరపై మలచిన విధానానికి నన్ను అభినందించారు.

ప్ర) జై లవ కుశ సక్సెస్ మీకు ఎలా అనిపిస్తోంది ?

జ) ఈ చిత్ర విజయం నాకో విషయాన్ని నేర్పింది. మన కథలో బలం ఉంటే ఎంత పెద్ద స్టార్ లు అయినా నాలాంటి కొత్త దర్శకులతో సినిమా చేయడానికి అగీకరిస్తారు. అదే ధైర్యంతో మరి కొంత మంది దర్శకులకు నా కథలు వినిపిస్తాను.

ప్ర) కళ్యాణ్ రామ్ వంటి నిర్మాతతో పనిచేయడం ఎలా అనిపించింది ?

జ) చిత్ర విజయంపై పూర్తి నమ్మకంతో ఆయన ఉన్నారు. రీ రికార్డింగ్ పూర్తి కాకముందే ఈ చిత్రం తమ బ్యానర్ లో అతిపెద్ద విజయం సాధిస్తుందని తేల్చేసారు. ఏ పనినైనా చిరునవ్వుతో చేయడం ఆయనకు అలవాటు.

 
Like us on Facebook