ఇంటర్వ్యూ : నా జీవితంలో ప్రశాంతతని తీసుకొచ్చింది సమంతే – నాగ చైతన్య
Published on May 25, 2017 6:55 pm IST


అక్కినేని నాగ చైతన్య తన కెరీర్ లో తొలిసారి కుటుంబకథా చిత్రమైన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ తో రాబోతున్నాడు.శుక్రవారం ఈ చిత్రం విడుదల సందర్భంగా నాగ చైతన్యతో ఇంటర్వ్యూ విశేషాలను చూద్దాం.

ప్ర ) సినిమా విడుదల సందర్భంగా మీ పై ఎలాంటి ఒత్తిడి ఉంది ?

జ ) ఇప్పటికే నాపై చాలా ఒత్తిడి ఉంది.తొలి సారి కుటుంబ కథా చిత్రంతో రాబోతున్నాను. ఈ చిత్రంపై మానాన్న చాలా డబ్బు ఖర్చు చేశారు. నా పెర్ఫామెన్స్ కి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అనే ఆసక్తి నెలకొని ఉంది.

ప్ర ) మొదట ఈ చిత్రాన్ని చేయడానికి ఎందుకు సంకోచించారు ?

జ ) ఇలాంటి పాత్రకు నేను సరిపోతానా అనే సందేహం మొదట కలిగింది. ఈ చిత్రం సగటు ప్రేక్షకుడి పై చూపబోయే ప్రభావాన్ని మా నాన్న, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ వివరించారు.ఒకసారి కథ విన్న తరువాత ఇక వెనుదిరిగి చూడలేదు.

ప్ర )నిన్నే పెళ్లాడతా సినిమాతో ఈ చిత్రానికి ఏమైనా పోలికలు ఉన్నాయా ?

జ ) ఎమోషన్స్ పరంగా కొంత మేరకు పోలికలు ఉన్నాయి. కానీ మిగతా విషయాల్లో ఈ రెండూ విభిన్న చిత్రాలు.ప్రస్తుత రోజుల్లో కుటుంబ బంధాలు ఎలా మారుతున్నాయో ఈ చిత్రంలో ఉంటుంది.

ప్ర) నాగార్జున గారు ఈ చిత్ర విజయంపై కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తోంది ?

జ) అవును. నాన్న ఈ చిత్రాన్ని చాలా సార్లు చూశారు. చిత్రం విజయం సాధిస్తుందన్న గట్టి నమ్మకం ఆయనలో ఉంది. మా చిత్ర యూనిట్ మొత్తం అవుట్ పుట్ పై చాలా సంతోషంగా ఉంది.

ప్ర) ఈ చిత్రంలో అన్నిరకాల కోణాలను చూపించినట్లున్నారు ?

జ) అవును ! ఈ చిత్ర కథ చాలా బావుంటుంది.ప్రతి సన్నివేశం కలర్ ఫుల్ గా ఉంటుంది. ఈ చిత్రం నా సహజ సిద్ద ధోరణికి అనుకూలంగా ఉంది.

ప్ర ) రకుల్ ప్రీత్ సింగ్ లుక్స్, నటన గురించి ఏం చెబుతారు ?

జ) ఈ చిత్రంలో మీరు ఓ కొత్త రకుల్ ప్రీత్ ని చూస్తారు. నటన, లుక్స్ పరంగా ఆమె అద్భుతంగా చేసింది. రకుల్ నటనకు ఖచ్చితంగా ప్రశంసలు లభిస్తాయి.

ప్ర) అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అనే ట్యాగ్ లైన్ వివాదంగా మారింది. దీనిగురించి మీరేమంటారు ?

జ) అది కేవలం ట్రైలర్ ని కట్ చేసినప్పుడు మాత్రమే యాడ్ చేశాము. మీరు సినిమా మొత్తం చూస్తే దానిప్రభావం ఏమీ ఉండదు.

ప్ర ) దేవిశ్రీ ప్రసాద్ సంగీతం గురించి ?

జ) దేవిశ్రీ ప్రసాద్ అక్కినేని కుటుంబానికి మంచి హిట్స్ అందించాడు. ఈ చిత్రంలో కూడా మంచి సంగీతాన్ని అందించాడు. దేవిశ్రీ సంగీతం చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళుతుంది.

ప్ర) మీ తదుపరి ప్రాజెక్ట్స్ ?

జ) మా తరువాతి చిత్రం ఓ థ్రిల్లర్ కథతో రాబోతోంది. చందూ ముండేటితో కూడా ఓ చిత్రాన్ని ఓకే చేశాను.

ప్ర) చివరగా మీ పెళ్లిగురించి ?

జ) నా పర్సనల్ లైఫ్ సెట్ అయిపోయింది. సమంత తో నా కలయిక మరచిపోలేని విషయం. అక్టోబర్ మొదటి వారంలో హైదరాబాద్ లోనే మా వివాహం జరుగుతుంది.

 
Like us on Facebook