ఇంటర్వ్యూ : శివ నిర్వాణ – చైతన్య అద్భుతంగా నటించాడు !

సమంత, నాగ చైతన్య హీరోహీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం మజిలీ. కాగా ఈ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా దర్శకుడు శివ నిర్వాణ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…

మీ ఈ ‘మజిలీ’ ఎలా మొదలైంది ?

నా ఫస్ట్ ఫిల్మ్ ‘నిన్నుకోరి’ సక్సెస్ అవ్వడంతో అందరూ బాగుంది అన్నారు. ఆ తరువాత ఎలాంటి సినిమా తీద్దాం అనుకున్న టైంలో.. బేసిక్ గా నాకు ఒకే జోనర్‌ లో సినిమాలు చేయాలని ఉండదు. ఇక మజిలీ మొదలవ్వడానికి కారణం నాగ చైతన్యగారే… ఆయన నాకు కాల్ చేసి నీ ‘నిన్నుకోరి’ నాకు బాగా నచ్చింది. నా సూట్ అయ్యే కథ ఉంటే తీసుకురా అన్నారు. ఆ తరువాత కొన్ని రోజులకు నాకు మజిలీ ఐడియా ఫ్లాష్‌ అయింది. అలా మజిలీకి బీజం పడింది.

మజిలీ టైటిల్‌ కి సినిమాలో జస్టిఫికేషన్‌ ఏమిటి ?

మన జీవన ప్రయాణంలో ఎన్నో ఎమోషన్స్ మధ్యలో మన జర్నీ సాగుతుంది. ఆ జర్నీలో ముఖ్యమైన ఘట్టంలో ఎన్నో మజిలీలు ఉంటాయి. కథలో కూడా అలంటి మజిలీలు ఉన్నాయి. అందుకే మజిలీ టైటిల్‌ పెట్టడం జరిగింది.

మీరిప్పటి వరకూ తీసిన రెండు చిత్రాల కథలు లవ్‌ ఫెయిల్యూర్‌ గురించే కథలే. మీ జీవితంలో కూడా అలాంటి ప్రేమ అనుభవాలు ఏమైనా ఉన్నాయా ?

నా జీవితంలో అలాంటి అనుభవాలు ఏమి లేవు అండి. అందరిలాగే కాలేజీ డేస్‌ లో చిన్న చిన్న క్రష్‌ లు ఉన్నాయి కానీ.. నిన్నుకోరి, మజిలీ లాంటి లవ్‌ ఫెయిల్యూర్స్‌ అయితే లేవు. అయినా ఏదైనా బలమైన కథను సినిమాగా తియ్యాలంటే.. ఆ కథ మన జీవితంలో జరగ అక్కర్లదు అండి.

ఈ సినిమాలో సెకెండ్ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్‌ క్యారెక్టర్‌ గురించి చెప్పండి ?

కథలో భాగంగా (చైతు) పూర్ణ లైఫ్ లో ఒక లవ్‌ స్టోరీ ఉంటే బాగుటుంది అనిపించింది, అయితే అది కొంచెం విభిన్నంగా ఉండాలనే ఉద్దేశ్యంతో రాసిందే. దివ్యాంశ కౌశిక్‌ క్యారెక్టర్‌. ప్రస్తుత యువతను దృష్టిలో పెట్టుకొని చైతు దివ్యాంశ కౌశిక్‌ మధ్య లవ్ స్టోరీ పెట్టడం జరిగింది.

ఈ సినిమాలో సమంత, నాగ చైతన్య ల నటన గురించి చెప్పండి?

సమంతగారు ఎప్పుడూ బాగా చేస్తారు అండి. అయితే ఈ సినిమాలో చైతుగారు కూడా అద్భుతంగా నటించారు. మజిలీ నుంచి చైతన్య కూడా ఎక్స్‌ ట్రార్డినరీగా నటించగలడని మీరు ఫీల్ అవుతారు.

మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి ?

మూడు కథలు అయితే ఉన్నాయి. అయితే ఏ కథ చెయ్యాలి, ఎవరితో చెయ్యాలి అనేది మజిలీ సినిమా విడుదల తరువాతే నిర్ణయించుకుంటాను. కానీ ఖచ్చితంగా అన్ని రకాల జోనర్స్ లో సినిమాలు చెయ్యాలని ఉంది. చెయ్యటానికి ప్రయత్నిస్తాను.

Exit mobile version