ఇంటర్వూ : గోపీచంద్ – గౌతమ్ నంద మరల నా కెరియర్ కి బౌన్స్ బ్యాక్ అవుతుంది!
Published on Jul 22, 2017 2:54 pm IST


యాక్షన్ హీరో గోపీచంద్ త్వరలో తన కొత్త చిత్రం గౌతమ్ నంద తో చాలా గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. ఎ సందర్భంగా ఆయన చిత్ర విశేషాలు, ప్రయాణం గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

మీ కెరియర్ కి ఈ చిత్రం ఎ విధంగా కీలకంగా మారనుంది?
నా చివరి చిత్రం వచ్చి ఏడాదికి పైగా దాటిపోతుంది. అయితే ఈ చిత్రం విషయంలో నేను చాలా నమ్మకంగా ఉన్నా. ఈ చిత్రం మరల నాకు మంచి విజయం అందించడంతో పాటు కెరియర్ కి బూస్ట్ ఇస్తుంది.

ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
ఈ సినిమాలో నా పాత్ర పేరు ఘట్టమనేని గౌతమ్. అయితే ఓ మామూలు గౌతమ్, గౌతమ్ నందగా ఎందుకు మారాడు అనే విషయం కథలో తెలుస్తుంది. అయితే ఈ చిత్రంలో ఇప్పటి వరకు లేని విధంగా సరికొత్త స్టైలిష్ లుక్ లో కనిపిస్తాను. ఇప్పటికె నా లుక్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఇక ఈ లుక్ నా తరువాతి సినిమాలకి కూడా భాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నా.

సంపత్ నందితో మీ కాంబినేషన్ ఎలా ఉంది?
సంపత్ నంది సెట్ లో చాలా క్లియర్ గా ఉంటాడు. అతనికి ఎలాంటి వేరియేషన్స్ కావాలో అడిగి మరి చేయించుకుంటాడు. అతను నాకు కథ చెప్పిన దానికంటే చాలా గొప్పగా ఇందులో అతని ప్రెజెంటేషన్ ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలతో పోలిస్తే గౌతమ్ నందా అతని కెరియర్ లో బెస్ట్ సినిమా అవుతుంది.

ఈ సినిమా బడ్జెట్ అనుకున్నదానికంటే ఎక్కువ కావడంపై మీ అభిప్రాయం ఏమిటి?
ఈ సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే మించిపోయింది అని వస్తున్న వార్తల్లో అస్సలు నిజం లేదు. రిలీజ్ కి ముందే నిర్మాతలకి టేబుల్ ప్రాఫిట్ రూపంలో అంతా వచ్చేసింది. ఇక ఈ సినిమా పంపిణీ దారులకి కూడా లాభాలు తెచ్చిపెడుతుందని అనుకుంటున్న. ఈ సినిమాని అందరు ఆదరించాలని కోరుకుంటున్న.

మీ కెరియర్ అనుకున్నంత వేగంగా అయితే వెళ్ళడం లేదు. మరి దీనికి కారణం ఏమిటని మీరు అనుకుంటున్నారు?
కెరియర్ విషయంలో సినిమాల ఎంపికలో కొన్ని రాంగ్ స్టెప్స్ వేసిన మాట వాస్తవమే. అయితే కొన్ని సందర్భాల్లో కెరియర్ మన చేతుల్లో ఉండదు. వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్ళడమే. మళ్ళీ ప్రేక్షకుల ముందుకి రావడానికి ఓక సవత్సరం ఎదురుచూడాల్సి వచ్చింది. అయితే ఇలాంటి అన్నింటికీ గౌతమ్ నందా సినిమా సమాధానం చెబుతుంది.

మీరు యాక్షన్ నేపధ్యం లేకుండా సినిమాలు చేసే అవకాశం ఉందా?
లేదు. నేను ప్రేమ కథ చేసిన అందులో కచ్చితంగా నా మార్క్ యాక్షన్ ఉండే విధంగా చూసుకుంటా. నా సినిమా చూడటానికి వచ్చే ప్రేక్షకులు కోరుకునే అంశాల్లో యాక్షన్ ఎక్కువ భాగం ఉంటుంది. అదే నా బలం కూడా. అందుకే నా సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు కచ్చితంగా ఉండాల్సిందే.

ఇటీవల బయటపడ్డ డ్రగ్స్ కల్చర్ గురించి మీ అభిప్రాయం?
యువత డ్రగ్స్ కి బానిస అయిన విషయం తెలుసుకొని అందరి లాగే నేను కూడా చాలా బాధపడ్డ. అయితే సినిమా ఇండస్ట్రీ మీద అందరు ఎక్కువ ఫోకస్ పెట్టడం కరెక్ట్ కాదనిపిస్తుంది. అసలు ఈ డ్రగ్స్ ర్యాకెట్ ని మూలాల నుంచి పెకలించడానికి పాఠశాలల మీద కూడా ప్రభుత్వం ద్రుష్టి పెడుతుందని అనుకుంటున్నా.

కొత్త ప్రాజెక్టులు సంగతి ఏంటి?
ప్రస్తుతానికి అయితే ఎలాంటి ప్రాజెక్ట్స్ సంతకం చేయలేదు. కథలైతే వింటున్న. అయితే గతంలో మాదిరి విలన్ పాత్రలు, సహాయక పాత్రలు చేసేసి కెరియర్ పాడుచేసుకునే ఉద్దేశ్యం అయితే నాకు లేదు. మంచి పాత్రలు ఎంచుకొని జాగ్రత్తగా కెరియర్ ప్లాన్ చేసుకుంటా.

 
Like us on Facebook