ఇంటర్వ్యూ : ఇప్పట్లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించను – హన్సిక

Published on Jan 25, 2017 5:58 pm IST


చాలా రోజుల తరువాత హన్సిక ‘లక్కున్నోడు’ చిత్రంతో తెలుగు తెర పై మెరవడానికి సిద్ధమవుతోంది. రేపు ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూ లో హన్సిక పలు విషయాలను వెల్లడించింది. ఆ విశేషాలను చూద్దాం..

ప్ర) పవర్ చిత్రం తరువాత అంత గ్యాప్ ఎందుకు వచ్చింది ?

జ) అవును గ్యాప్ వచ్చింది. నేను తమిళంలో 6 చిత్రాలతో బిజీగా ఉండడడం వల్ల అలా జరిగింది.

ప్ర ) విష్ణుతో కలసి పనిచేయడం ఎలా అనిపించింది ?

జ ) విష్ణు మా కుటుంబంలోని వ్యక్తి లాంటివాడే. మా ఇద్దరి కలయికలో వస్తున్నా 3 వ చిత్రం ఇది. మాది సక్సెస్ ఫుల్ కాంబినేషన్.

ప్ర ) మీరు బరువు తగ్గడం వెనుక రహస్యం ?

జ ) నేను స్క్వాష్ ఆడడం ప్రారంభించాను. యోగా కూడా చేస్తాను. దాని వల్లే 13 కిలోల బరువు తగ్గాను.

ప్ర ) చిన్నపిల్లలను దత్తత తీసుకోవడం గురించి చెప్పండి ?

జ ) నేను ఇప్పటివరకు 31 మంది చిన్నపిల్లలను దత్తత తీసుకున్నాను. నాకు ఓ అనాథ శరణాలయం నిర్మించాలని ఉంది. దానికోసం ఇప్పటికే ముంబై లో ల్యాండ్ కూడా తీసుకున్నాను. రెండేళ్లలో అంతా సిద్ధం చేస్తాను.

ప్ర ) గోపీచంద్ తో చిత్రంలో మీ రోల్ ఏంటి..?

జ ) ఓ బస్తి అమ్మాయిగా ఆ చిత్రంలో కనిపిస్తాను.సంపత్ నంది చిత్రాన్ని ఆసక్తి కరంగా తెరకెక్కిస్తున్నారు.చిత్ర అవుట్ ఫుట్ కూడా బాగా వస్తోంది.

ప్ర ) డైరెక్టర్ రవికిరణ్ తో కలసి పనిచేయడం ఎలా అనిపించింది ?

జ ) నేను చూసిన వాళ్లలో అతను చాలా వేగవంతమైన డైరెక్టర్. రెండు గంటల ముందుగానే వర్క్ ని పూర్తి చేసేవారు. కేవలం 50 రోజుల్లోనే చిత్రీకరణ మొత్తం పూర్తయింది.

ప్ర ) మీ తదుపరి చిత్రాలు ఏమిటి ?

జ ) జయం రవితో బోగన్ చిత్రంలో నటిస్తున్నాను. మరో 3 తమిళ చిత్రాలకు సంతకం చేశాను.

ప్ర ) లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో ఎప్పుడు కనిపిస్తారు ?

జ ) నేను ఇంకా యంగ్ గానే ఉన్నాను.ఇప్పట్లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించను.

సంబంధిత సమాచారం :

X
More