ఇంటర్వ్యూ : ‘వైశాఖం’ లాంటి సినిమాతో లాంచ్ అవుతున్నందుకు లక్కీగా ఫీలవుతున్నాను – హరీష్
Published on Jul 18, 2017 1:55 pm IST


దర్శకురాలు జయ.బి డైరెక్ట్ చేసిన తాజా చిత్రం ‘వైశాఖం’ ఈ శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్బంగా చిత్ర హీరో హరీష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం..

ప్ర) మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పండి ?
జ) మాది భీమవరం. నాకు చిన్నప్పటి నుండి సినిమాలంటే చాలా ఇష్టం. ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండటం వలన ఇలా సినిమాల్లోకి రాగలిగాను.

ప్ర) ఈ సినిమాలో నటించే అవకాశం ఎలా వచ్చింది ?
జ) ప్రయత్నాల్లో భాగంగా చాలా ఆఫీసులు తిరుగుతూ ఉండేవాడిని. ఆలా తిరుగుతున్నప్పుడు నా ఫ్రెండ్ ఒకరు జయగారిని కలవమని చెప్పారు. నేను వెళ్లి ఆమెను కలవగానే ఒక ఆడిషన్ చేసి నన్ను హీరోగా సెలెక్ట్ చేశారు.

ప్ర) ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది ?
జ) ఒక సాధారణ కుర్రడిలా ఉండే పాత్ర నాది. ప్రతి ఒక్కరు ఈజీగా కనెక్టవుతారు. నా పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయి.

ప్ర) మీరు ఈ సినిమా చేయడానికి కారణం ?
జ) ‘వైశాఖం’ అనే టైటిల్ వినగానే బాగా నచ్చేసింది. ఎందుకంటే ఆ టైటిల్ లో పాజిటివిటీ ఉంది. ఆ తరవాత కథ విన్నాక నా పాత్రకు పూర్తిగా కనెక్టైపోయాను. ఆడియన్స్ కూడా అలానే కనెక్టవుతారని ఆశిస్తున్నాను.

ప్ర) ఈ సినిమాలో మ్యూజిక్ ఎలా ఉంటుంది ?
జ) పాటలు చాలా బాగా వచ్చాయి. విన్నవారంతా బాగున్నాయని మెచ్చుకుంటున్నారు. ఈ రోజుల్లో ఇలాంటి పాటలు రావడం అరుదైన విషయమని మెచ్చుకుంటున్నారు. ఈ క్రెడిట్ అంతా సంగీత దర్శకుడు డీజే వసంత్ కు దక్కుతుంది..

ప్ర) మహేష్ బాబు మీ సినిమా ఆడియోను లాంచ్ చేశారు కదా ఎలా ఫీలవుతున్నారు ?
జ) నా కల నిజమైంది. చాలా సంతోషంగా ఉంది. మహేష్ బాబుగారు చాలా సింపుల్ గా ఉంటారు. ఆయన నా ఆడియో కార్యక్రమానికి వచ్చి పాటలు విడుదల చేసినందుకు మరోసారి ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాను.

ప్ర) మీ నిర్మాత బిఏ రాజుగారి గురించి చెప్పండి ?
జ) రాజుగారు చాలా కూల్ గా ఉంటారు. సినిమాలాంటే ఆయనకు చాలా ఇష్టం. కేవలం స్క్రిప్ట్ ను నమ్మి సినిమా కోసం చాలా ఖర్చు చేశారు.

ప్ర) సాయి కుమార్ లాంటి సీనియర్ నటులతో పని చేయడం ఎలా ఉంది ?
జ) ఆయన చాలా ఫ్రెండ్లీగా, సపోర్టివ్ గా ఉంటారు. చాలా మంది సీనియర్ నటులతో నాకు కాంబినేషన్స్ ఉంటాయి. అందరూ నాకు సపోర్ట్ చేసి సౌకర్యంగా ఫీలయ్యేలా చేశారు.

ప్ర) మీ తర్వాత ఏయే సినిమాలు చేస్తున్నారు ?
జ) నెక్స్ట్ సినిమాల్ని ఇంకా ఫైనల్ చేయలేదు. కానీ సెప్టెంబర్ నుండి ఇదే బ్యానర్లో ఒక సినిమా చేస్తాను. త్వరలోనే ఆ వివరాలు తెలియజేస్తాను.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook