ఇంటర్వ్యూ : లావణ్య త్రిపాఠి – ‘మిస్టర్’ పరాజయం నన్ను నిరుత్సాహాపరచలేదు

ఇంటర్వ్యూ : లావణ్య త్రిపాఠి – ‘మిస్టర్’ పరాజయం నన్ను నిరుత్సాహాపరచలేదు

Published on May 9, 2017 1:28 PM IST


ఈ మధ్యే ‘మిస్టర్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఈ శుక్రవారం ‘రాధ’ సినిమాతో సందడి చేయనున్నారు. ఈ సందర్బంగా ఆమె సినిమా గురించిన పలు విశేషాల్ని మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు మీ కోసం..

ప్ర) ఇంతకీ సినిమాలో ‘రాధ ఎవరు ?
జ) నాది, శర్వానంద్ ఇద్దరి పేర్లు రాధనే. కానీ మా క్యారెక్టర్లు చాలా భిన్నంగా ఉంటాయి. సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది.

ప్ర) మీ పాత్ర ఎలా ఉండబోతోంది ?
జ)ఇందులో నేనొక మాడరన్ కాలేజ్ అమ్మాయిగా కనిపిస్తాను. చాలా ఫన్నీగా కూడా ఉంటాను. కథలో చాలా కీలకమైన పాత్ర నాది.

ప్ర) ఇంతకీ సినిమా ఔట్ ఫుట్ ఎలా వచ్చింది ?
జ) సినిమా చాల బాగా వచ్చింది. కథలో చాలా సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉంటాయి. శర్వానంద్ చాలా బాగా చేశాడు. ఆయనకు నాకు మధ్య నడిచే రొమాంటిక్ ట్రాక్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది.

ప్ర) శర్వానంద్ తో వర్క్ చేయడం ఎలా ఉంది ?
జ) శర్వానంద్ తో పని చేయడం ఇదే ఫస్ట్ టైమ్. అతను చాలా డిఫరెంట్ పర్సన్. కెమెరా ముందుకెళ్లినప్పుడు తన సన్నివేశాల్ని ఇంకా బాగా ఇంప్రొవైజ్ చేయాలని ప్రయత్నిస్తుంటాడు. ఎక్కువగా మాట్లాడకపోయినా అతనితో వర్క్ చాలా బాగుంది.

ప్ర) ‘మిస్టర్’ పరాజయం మిమ్మల్ని నిరుత్సాహపరిచిందా ?
జ) లేదు. ఎలాంటి నిరుత్సాహం లేదు. నిజానికి నా క్యారెక్టర్ సినిమాలో చాలా బాగా వచ్చింది. అన్ని సినిమాలకు నేను ఒకేలా పని చేస్తాను. అందుకే హిట్, ఫ్లాపులను ఎక్కువగా పట్టించుకోను. అయినా రిజల్ట్ మన చేతిలో ఉండదు కదా.

ప్ర) డైరెక్టర్ చంద్ర మోహన్ తో పని చేయడం ఎలా ఉంది ?
జ) ఆయనతో కలిసి వర్క్ చేయడం మంచి అనుభవం. ఆయనకు నా నుండి ఏం కావాలో బాగా తెలుసు. నా ఉద్దేశ్యంలో నటులు దర్శకులకు అనుగుణంగా పనిచేస్తూ వాళ్లకు ఏం కావాలో అది ఇవ్వాలి.

ప్ర) మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి ?
జ) ప్రస్తుతం నాగ చైతన్యతో ఒక సినిమా చేస్తున్నాను. ఆ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తైపోయింది. సినిమా చాలా బాగా వస్తోంది.

ప్ర) నాగ చైతన్య, నాగార్జున ఇద్దరితో పని చేయడం ఎలా ఉంది ?
జ) తండ్రితో, కొడుకుతో పనిచేయడమనేది ఒక అరుదైన అవకాశం. నాగార్జునగారితో వర్క్ చేయడం చాలా బాగుంటుంది. ఆయనొక మెంటర్ లా ఉంటారు. ఇక చైతన్య విషయానికొస్తే అతని గురించి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు