ఇంటర్వ్యూ : మురుగదాస్ – ‘స్పైడర్’ లో కొత్త మహేష్ ని చూడొచ్చు !

26th, September 2017 - 01:54:36 PM

మహేష్ బాబు నూతన చిత్రం ‘స్పైడర్’ ఎన్నో అంచనాలు నడుమ రేపే భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ప్రమోషన్ల వేగం పెంచింది. ఆ ప్రమోషన్లలో భాగంగానే చిత్ర దర్శకుడు ఏ.ఆర్ మురుగదాస్ ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఆ వాయిసేశాలు మీకోసం..

ప్ర) సినిమా కథ గురించి చెప్పండి ?
జ) ఈరోజుల్లో ఏ విషయాన్ని కూడా రహస్యంగా ఉంచడం కుదరదు. ప్రభుత్వం తలచుకుంటే ఒక సాధారణ మనిషి నుండి కూడా ఎన్నో విషయాల్ని తెలుసుకోగలదు. అలాంటి పరిస్థితిని అనుకూలంగా చేసుకున్న ఒక ఇన్విజిబుల్ టెర్రరిస్ట్ ఎలాంటి సమస్యల్ని సృష్టించాడు. అతన్ని పోలీసులు ఎలా ఎదురుకున్నారు అనేదే సినిమా. ఈ కథకి మహేష్ అయితే సరిపోతాడని ఆయన్ను హీరోగా తీసుకోవడం జరిగింది.

ప్ర) ఇందులో ఎస్.జె సూర్యను హీరోగా తీసుకోవాలని ఎందుకనిపించింది ?
జ) నా సినిమాల్లో విలన్ అంటే మానసికంగానే బలంగా ఉంటాడు, ఫిజికల్ గా కాదు. అందుకే రెండు భాషల్లోనూ కొంచెం తక్కువగా తెలిసిన నటుడైతే బాగుంటుందని ఆయన్ను తీసుకున్నాను. ఆరంభం నుండి హీరోకి, విలన్ కి మధ్య ఫైటింగ్ జరుగుతూనే వుంటుంది. కానీ క్లైమాక్స్ లోనే ఇద్దరూ ఎదురుపడతారు.

ప్ర) రెండు భాషల్లో షూట్ చేసేప్పుడు ఎలా అనిపించింది ?
జ) మహేష్ తమిళ్ బాగా మాట్లాడతాడని ఈ సినిమాని రెండు భాషల్లోనూ తీయాలని అనుకున్నాను. సినిమాలోని ప్రతి విజువల్ ని, ప్రతి ఫ్రేమ్ ని రీ షూట్ చేశాం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా రెండు భాషలకి వేరు వేరుగా ఉండి మహేష్ పాపులారిటీని పెంచేదిగా ఉంటుంది.

ప్ర) కమర్షియల్ సినిమా ద్వారా మెసేజ్ ఇవ్వడంలో ఎలాంటి కష్టం ఉంటుంది ?
జ) చెప్పాలంటే అది చాలా సులభం. ఆడియన్స్ ఎక్కువ సంఖ్యలో దానికి కనెక్ట్ అవుతారు. చాలా సింపుల్ గా మెసేజ్ ను చెప్తే దాని ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది.

ప్ర) సినిమాలో హైలెట్స్ ఏంటి ?
జ) 2000మంది జూనియర్ ఆర్టిస్టులతో తీసిన ఒక సన్నివేశం సినిమాకు చాలా కీలకంగా ఉంటుంది. సెకండాఫ్లో వచ్చే ఫ్యామిలీ ఎపిసోడ్స్ బాగుంటాయి. సినిమా వేగం కూడా ఆకట్టుకుంటుంది.

ప్ర) మహేష్ బాబుతో పనిచేయడం ఎలా ఉంది ?
జ) మహేష్, నేను చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఒకరితో ఒకరం అభిప్రాయాల్ని కూడా షేర్ చేసుకుంటాం. ఈ సినిమాలో ఆయన చాలా భిన్నంగా కనిపిస్తారు. ఒక పాత్రలనే ఉంటారు. బాడీ లాంగ్వేజ్ కూడా కొత్తగా ఉంటుంది.

ప్ర) మీ గత సినిమాలకి దీనికి తేడా ఏంటి ?
జ) ‘స్పైడర్’ సహజంగా ఉండే హెవీ యాక్షన్ ఎంటర్టైనర్. ఇందులో ఏదీ కూడా అనవసరంగా, బలవంతంగా అనిపించదు. ప్రతి సన్నివేశం ఒకదానికెతో మరొకటి లింక్ అయి ఉంటాయి.

ప్ర) సినిమాలో తమిళ ఫ్లేవర్ కాస్త ఎక్కువగా ఉన్నట్టుంది ?
జ) అవును. నేను తమిళ్ కాబట్టి అక్కడక్కడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయినా మానవ సంబంధమైన భావోద్వేగాలకి నేటివిటీ అదూరాదనేది నా అభిప్రాయం.

ప్ర) ఈ కథని ముందుగా ప్రభాస్ కి చెప్పారని వార్తలొచ్చాయి ?
జ) (నవ్వుతూ) నేను కూడా ఈ వార్తను విన్నాను. కానీ అబందులో నిజం లేదు. ఈ మధ్య కాలంలో ప్రభాస్ ను అస్సలు కలవలేదు.

ప్ర) రజనీతో సినిమా చేస్తానన్నారు. దాని సంగతేమిటి ?
జ) రజనీ గారికి కథ చెప్పాను. ఆయనకు కూడా నచ్చింది. వచ్చే ఏడాది వరకు ఆయన డేట్స్ ఖాళీ లేవు. అందుకే కొంత సమయం పడుతుంది.