ఇంటర్వ్యూ : కళ్యాణ్ దేవ్ – ‘విజేత’ కోసం నా సతీమణి ఆసక్తిగా ఎదురుచూస్తుంది. !

మెగా స్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ ‘విజేత’ చిత్రం తో తెలుగు తెరకు పరచియం కాబోతున్నాడు. ఈ చిత్రం రేపు విడుదలవుతున్న సంధర్బంగా ఆయన మీడియా తో ముచ్చటించారు. ఇప్పుడు ఆ విశేషాలు మీ కోసం..

మీరు సినిమాల్లోకి రాకముందు ఏం చేశేవారు ?
నేను ఇంజినీరింగ్ పూర్తి చేశాక మా కుటుంబానికి సంభందించిన వ్యాపారాన్ని చూసుకోవాలనుకున్నాను . ఆ సమయంలోనే సినిమాల్లోకి వెళ్లాలని నేను నటుడు అవ్వాలని నిర్ణయించుకున్న ప్రయత్నాల్లో భాగంగా బాలీవుడ్ నుండి ఒక అవకాశం కూడా వచ్చింది. కానీ ఎందుకో అది వర్క్ అవుట్ కాలేదు. బహుశా విజేత చిత్రంమే నా మొదటి సినిమా కావాలని రాసిపెట్టిఉందేమో.

మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది ?
నేను సత్యానంద్ ఇనిస్ట్యూట్ లో నటనలో శిక్షణ తీసుకున్న తరువాత రాకేష్ ఈ స్క్రిప్ట్ తో నా దగ్గరికి వచ్చాడు వెంటనే సినిమా స్టార్ట్ చేశాం .
మీకు ఏ ఏ అంశాలు నచ్చి ఈ స్క్రిప్ట్ కు ఓకే చెప్పారు ?
కథ విన్నపుడు అనిపించింది తండ్రి ,కొడుకుల మధ్య ఉండే ఎమోషనల్ చిత్రమైతే అన్ని వర్గాల వారికి నచ్చుతుందని అందుకే ఈ చిత్రానికి సైన్ చేశాను. అలాని కొత్త రకం చిత్రాలు చేయొద్దని కాదు.

చిరంజీవి ఈ చిత్రానికి ఏరకంగా సహకరించారు ?
ఈ స్క్రిప్ట్ ను చిరంజీవి గారి దగ్గరికి తీసుకవెళ్లినప్పుడు ఆయన కథ విని కొన్ని మార్పులు చేయమన్నారు. అలాగే ఈ చిత్రంలో తండ్రి పాత్రకు మురళి శర్మఅయితే భాగుంటుందని అన్నారు.

ఈ చిత్రం లో మీ పాత్ర గురించి ?
నేను ఈ చిత్రంలో ఎలాంటి బాధ్యత లేకుండా అల్లరి చిల్లరగా తిరిగే యువకుడి పాత్రలో నటించాను. ఈ రకంగా ఉండడం వల్ల నా తండ్రి కొన్ని సమస్యలను ఎదురుకోవాల్సి వస్తుంది. ఆ సమస్యలు ఏంటి వాటిని నేను ఎలా పరిష్కరించాను అనేదే మిగతా కథ.

మీ సతీమణి ఈ చిత్రాన్ని చూశారా ?
లేదు . చిరంజీవి గారి తో కలిసి కొన్ని రషెస్ చూసింది. ఆమె ఎక్కువగా సినిమాలు చూడదు. కానీ నా ఈ తొలి చిత్రం కోసం ఛాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంది.

వారాహి ప్రొడక్షన్స్ గురించి ?
సాయి గారు నేను ఇనిస్ట్యూట్ లో ఉన్నప్పటి ఫొటోలను చూసి నా గురించి ఆరా తీశారు . ఆ తరువాత తెలిసింది నేను చిరంజీవి గారి అల్లుడు అని ఈ చిత్ర డైరెక్టర్ తో కలిసి నన్ను సంప్రదించారు. వెంటనే సినిమా స్టార్ట్ చేశాం.

Exit mobile version