ఇంటర్వ్యూ – నాగ చైతన్య – ‘యుద్ధం శరణం’ అద్భుతమైన మలుపులతో ఉంటుంది.

7th, September 2017 - 10:57:43 PM

అక్కినేని నాగ చైతన్య మూవీ ‘యుద్ధం శరణం’ రేపు విడుదల కానుంది. ఆ చిత్రం యొక్క విశేషాలను మాతో షేర్ చేసుకోవడం జరిగింది. ఆ విశేషాలు మీకోసం…..

ప్ర) ముందుగా ‘యుద్ధం శరణం’ గురించి చెప్పండి?

జ) మనం ఈ మధ్య చాల థ్రిల్లర్స్ చూస్తున్నాం. కాని ‘యుద్ధం శరణం’ లో థ్రిల్లర్ కి కుటుంబ కథతో పాటు ప్రేమకథని జోడించాం. వివిధ మలుపులతో సినిమా మొత్తం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

ప్ర) డైరెక్టర్ గా మీ స్నేహితున్నే ఎందుకు ఎంచుకున్నారు?

జ) కృష్ణ మరిముత్తు నాకు చిన్నప్పటి స్నేహితుడు. తను చాలా మంది దగ్గరకు వెళ్లి స్టోరీస్ వినిపించడం, వాళ్ళు ఒప్పుకోకపోవడం జరిగింది. తను ‘యుద్ధం శరణం’ గురించి చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. అందుకే ఈ చిత్రాన్ని ఒప్పుకొన్నాను. అతడు నా పాత్రను తెరకెక్కించిన విధానం నన్ను ఆకర్షించింది.

ప్ర) సాయి కొర్రపాటి గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?

జ) సాయి గారు ఎప్పుడూ కొత్తవాళ్ళకు అవకాశాలు ఇస్తూనే ఉంటారు. కొత్తవాళ్ళకు అవకాశాలు ఇవ్వడం అంటే రిస్క్ తో కూడుకున్న పని. కాని సాయి గారు చాలాసార్లు చాలామందికి అవకాశాలు ఇచ్చారు . ఈ విషయంలో ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి. కొత్తవాళ్ళని ప్రోత్సహించడానికి ఇండస్ట్రీలో ఇలాంటి ప్రొడ్యూసర్స్ చాల అవసరం.

ప్ర) శ్రీకాంత్ గారితో పని చేయడం ఎలా అనిపించింది?

జ) ఈ సినిమాకి ఆయన చాలా హెల్ప్ అయ్యారు. అసలు ఆయన నెగటివ్ రోల్ చేస్తారని ఊహించలేదు. ‘యుద్ధం శరణం’లో ఆయన పాత్ర అద్భుతంగా ఉండబోతోంది. డైరెక్టర్ కృష్ణ శ్రీకాంత్ గారి క్యారెక్టర్ ను చాల బాగా రాసుకున్నాడు. మా ఇద్దరి మధ్య వచ్చ్జే లాస్ట్ ఫైట్ సినిమాకి పెద్ద ప్లస్ అవుతుంది.

ప్ర) సినిమాలో మీ పాత్ర గురించి?

జ) నేను ఈ సినిమాలో డ్రోన్ కెమెరాలను తయారుచేసే వ్యక్తిగా కనిపిస్తాను. దీంట్లో కెమెరా పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. హీరో తన పగను తీర్చుకోడానికి టెక్నాలజీని ఎలా వాడుకున్నాడో రియలిస్టిక్ గా చూపించడం జరిగింది.

ప్ర) రేవతి, రావు రమేష్ మరియు మురళి శర్మలతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?

జ) రేవతి గారు, రావు రమేష్ గారు నాకు తల్లిదండ్రులుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో వారి పాత్రలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అలాగే మురళి శర్మ గారి క్యారెక్టర్ హాస్యంతో కూడుకుని ఉంటుంది.

ప్ర) మీ పెళ్లి గురించి చాల ఎగ్జైటింగ్ గా ఉన్నారనుకుంటా?

జ) బాగా.., కొంచెం ఎగ్జైట్మెంట్ గా ఉంది. కేవలం మా కుటుంబ సభ్యులతో కలిసి వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నాం. అక్టోబర్ 6న తెలుగు సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిపించి, తరువాతి రోజు క్రిష్టియన్ వివాహంలో రింగులు మార్చుకుంటాం. రిసెప్షన్ మాత్రం హైదరాబాద్ లో ఉంటుంది. ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు.

ప్ర) వేరే ప్రాజెక్ట్స్ ఏమైనా కమిట్ అయ్యారా?

జ) చందు మొండేటి దర్సకత్వంలో ఒక సినిమా ఉంది. ఈ నెల 20న షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఇది మొత్తం కమర్షియల్ మూవీ. ఈ సినిమా చేయడం కోసం చాలా ఎదురు చూస్తున్నాను. మరియు మారుతి దర్శకత్వంలో ఒక మూవీ కమిట్ అయ్యాను. ప్రస్తుతం అది స్క్రిప్టింగ్ దశలో ఉంది.