ఇంటర్వ్యూ : రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ కి రమ్మన్నాడు. నేనే వెళ్ళలేదు – నాగార్జున

14th, September 2016 - 09:34:09 PM

nagarjuna
కొంత కాలంగా అక్కినేని నాగార్జున గారు సరికొత్త కథలతో, కొత్త దానం ఉన్న పాత్రల్లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే బాటలో ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రాన్ని చేశారు. ఈ సందర్బంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం…

ప్ర) ఊపిరి డిఫరెంట్ సినిమా. మనం తరువాత ఈ సినిమా చేయడానికి చాలా టైమ్ తీసుకున్నారు. ఎందుకు?

జ) ఈ ఫ్రెంచ్ సినిమాని లాంగ్ బ్యాక్ చాలా రోజుల క్రితమే చూశాను. అప్పుడే అనుకున్న అలాంటి సినిమా చేయాలని అనుకున్నా. అందరూ కుర్చీలో కూర్చుని, అవిటివాడి పాత్ర చేయడమేమిటి అన్నారు. కానీ సక్సెస్ అవుతుందని అనిపించింది.

ప్ర) మనం నుండి డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు. ఎక్కడ ఫెయిల్ అవలేదు. మీకెలా అనిపిస్తోంది?

జ) నాకు కూడా భయమేసింది. కానీ మనం, ఊపిరి, సోగ్గాడే చిన్ని నాయనా, నిర్మలా కాన్వెంట్ సినిమాలు ఖచ్చితంగా చేయాల్సిన సినిమాలు. అందుకే ఆ పాత్రలోకి ఇన్వాల్వ్ అయి చేశా. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో బంగార్రాజు కొడుకు పాత్రను ఎవరితో చేయించాలని నెలరోజులు ఆలోచించి చివరికి నేనే చేశా. సక్సెస్ అయింది.

ప్ర) నిర్మలా కాన్వెంట్ చేయడానికి మిమ్మల్ని ఆకర్షించిన అంశాలేమిటి ?

జ) ముందు చెప్పినట్టు సపోర్టింగ్ రోల్స్ చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. పైగా కథ వినగానే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అనిపించింది. నా పాత్ర కూడా చివరి వరకూ ఆసక్తికరంగా ఉంటుంది. అందుకే చేశా.

ప్ర) ఇలాంటి పాత్రలు చేయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది?

జ) నేని అమితాబ్ కి పెద్ద ఫ్యాన్ ని. కొన్నేళ్లుగా ఆయన చేసే పాత్రలు చూస్తే సపోర్టింగ్ రోల్స్ అయినా హీరోలానే ఉండేవి. అప్పుడే అనుకున్న ఆయనలా అర్థవంతమైన పాత్రలు, అర్థవంతమైన సినిమాలు చేయాలని.

ప్ర) సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది ?

జ) ఇందులో హీరోని తన ప్రేమ్ అతను గెలుచుకోవడానికి ప్రోత్సహించే పాత్ర నాది. నేనే అతనికి ఆటంకాలు క్రియేట్ చేసి ప్రేమను గెలుచుకోమని ఎంకరేజ్ చేస్తుంటా.

ప్ర) ఇందులో మీరు పాట పాడటానికి ప్రేరేపించిన అంశాలు ?

జ) ఇందులో ఏఆర్. రెహమాన్ కొడుకు అమీన్ పాట పాడాడు. బాగా నచ్చింది. ఎప్పుడూ దాన్ని హమ్ చేస్తూ ఉండేవాడిని. ఒకసారి రోషన్ మీరే పాట పాడొచ్చు కదా అన్నాడు. చాలా హ్యాపీగా ఫీలై పాడాను.

ప్ర) శ్రీకాంత్ గారి కొడుకుతో పని చేయడం ఎలా ఉంది ?

జ) ఇప్పటి జనరేషన్ తన పని పట్ల చాలా భాద్యతగా ఉన్నారు. రోషన్ మంచి ట్రైనింగ్ తీసుకుని బాగా నటించాడు. మంచి స్టార్ అవడానికి అతనిలో అన్ని లక్షణాలున్నాయి. అతని పేరేంట్స్ కూడా అలానే ప్రోత్సహిస్తున్నారు.

ప్ర) ఇప్పట్లో సినిమాకి పెద్ద స్థాయి ప్రమోషన్ అవసరమని మీరనుకుంటున్నారా ?

జ) ఖచ్చితంగా. ఇప్పట్లో జనాలు బిజీగా ఉన్నారు. వాళ్లకి మన సినిమా గురించి, దాని రిలీజ్ గురించి గుర్తు చేస్తూ ఉండాలి. అంతంత డబ్బు పెట్టి సినిమా తీసినప్పుడు ప్రమోట్ చేసుకోవడంలో తప్పులేదు. సినిమాలు తీసేవాళ్ళు ఇంకా కొత్త మార్గాల్లో ప్రమోషన్స్ చేయాలి.

ప్ర) హిందీ సినిమాలో ఎప్పుడు నటిస్తున్నారు ?

జ) మంచి పాత్రాలు వస్తే ఎప్పుడైనా చేస్తాను. నిజానికి వర్మ తను బాలీవుడ్ కి వెళ్ళేటప్పుడు నన్ను కూడా జాయిన్ అవమన్నాడు. కానీ నేను ఒప్పుకోలేదు. నా కుటుంబం ఉన్న దగ్గరే సినిమాలు చేయడం ఆనందమని ఆగిపోయా.

ప్ర) ఇక మీ అబ్బాయిల సినిమాలు గురించి చెప్తారా ?

జ) వాళ్ళ ఇద్దరి సినిమాల్ని నేనే నిర్మిస్తున్నాను. నిజానికి పూర్తి స్క్రిప్ట్ రేపు వినాలి. అది విని చివరి డెసిషన్ తీసుకుంటాను. పెద్ద బడ్జెట్ తో తీస్తున్నాను. అందుకే అన్నీ సరిగ్గా, అనుకున్న ప్రకారం జరగాలని కోరుకుంటున్నాను.