ఇంటర్వ్యూ : రాజమౌళి ‘మహాభారతం’ లో నటించాలని ఉంది – ఎన్టీఆర్

ఇంటర్వ్యూ : రాజమౌళి ‘మహాభారతం’ లో నటించాలని ఉంది – ఎన్టీఆర్

Published on Sep 19, 2017 7:35 PM IST

జై లవ కుశ చిత్ర విడుదల సందర్భంగా ఎన్టీఆర్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా గడుపుతున్నారు. ఎన్టీఆర్ తో జరిగిపిన తాజా ఇంటర్వ్యూ లో జై లవ కుశ చిత్రం గురించి అనేక విశేషాలు వెల్లడించారు. వాటిని ఇప్పుడు చూద్దాం..

ప్ర) ‘జై లవ కుశ’ వంటి చిత్రంలో నటించిన తరువాత ఎలా ఫీలవుతున్నారు ?

జ) 100 చిత్రాలకు పనిచేసినట్లుగా అనిపిస్తోంది. తొలిసారి మూడు పాత్రల్లో నటించాల్సి ఉండడంతో నాపై చాలా ఒత్తిడి ఉండేది. కానీ చిత్రం చాలా బాగా వచ్చింది.

ప్ర) నెగిటివ్ రోల్ లో నటించడానికి ముందుగా ప్రిపేర్ అయ్యారా ?

జ) తొలిసారి ఈ చిత్రం లో నటించడానికి చాలా కష్టపడ్డాను. రావణుణ్ణి ఇష్టపడే వ్యక్తి జై. పైగా నత్తి ఉన్న పాత్ర కావడంతో నటించడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. చివరకు దానిని సమర్థవంతంగా పూర్తి చేశాను.

ప్ర) జై లవ కుశ ఎంత పెద్ద విజయం సాధిస్తుందని భావిస్తున్నారు ?

జ) ఎంత కలెక్షన్స్ వచ్చాయనేది ముఖ్యం కాదు. ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందనేది ముఖ్యం. ఈ చిత్రం చూసిన అభిమానులు నిరుత్సాహపడరు. ఆ విధంగా ఈ చిత్రం నిర్మించబడింది. నేను ఈ చిత్రం కోసం పడిన శ్రమకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తుందని అనుకుంటున్నాను.

ప్ర) జై లవ కుశ చిత్రంలో ఉన్న ప్రత్యేక ఏంటి ?

జ) ఇది ముగ్గురు అన్నదమ్ముల కథ. చిత్రం మొత్తం జై కోణంలో జరుగుతుంది. జై పాత్రలో నటించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మూడు పాత్రల్లో గుణాలు నిజజీవితంలో నాలో కూడా ఉన్నాయి.

ప్ర) ఈ చిత్రంలో మీరు చేసిన డాన్స్ గురించి ?

జ) మూడు పాత్రలకు విభిన్నమైన డాన్స్ చేశాను. అందులో వ్యత్యాసం మీకు స్క్రీన్ పై తెలుస్తుంది. ముఖ్యంగా జై రోల్ లో ‘స్వింగ్ జరా’ సాంగ్ లో అయితే శివతాండవం చేశాను.

ప్ర) ఇక నుంచి మీరు ఎలాంటి కథలని ఎంపిక చేసుకుంటారు ?

జ) నటుడిగా మరింత ఛాలెంజ్ తీసుకోవాలనుకుంటున్నాను. ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పలేం. ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. నేను ఆరోగ్యంగా ఉన్నంత కాలం నటనకు ప్రాధాన్యం ఉన్న కథలని ఎంపిక చేసుకుంటాను.

ప్ర) ఈ చిత్రంకోసం మీ తాతగారి చిత్రాలని రెఫెరెన్స్ గా తీసుకున్నారా ?

జ) బాబీ ఈ చిత్రాన్ని నాకు వివరించినపుడు ఎలాంటి రెఫరెన్స్ లేదు. నటించడానికి నాకంటూ ఓ ఆధారం లేదు. త్రిపాత్రభినయం కావడంతో నాపై ఒత్తిడి పెరిగింది. అయినా కూడా నేనే దేనినీ రెఫరెన్స్ గా తీసుకోలేదు. నా స్టైల్ లోనే దీనిని పూర్తి చేశాను.

ప్ర ) మీ సొంత బ్యానర్ లోనే వర్క్ చేయడం గురించి ?

జ) నా సోదరుడుతో కలసి పనిచేయడం చాల బావుంది. అన్ని చిత్రాలకు వలె ఈ చిత్రం లో కూడా సొంతంగా కీలక నిర్ణయాలు తీసుకున్నాను. మరో సోదరుడు జానకిరామ్ ని మిస్సయ్యాను. ఆయన ఉంది ఉంటె ఈ చిత్రానికి మరో నిర్మాత గా ఉండేవారు.

ప్ర) బిగ్ బాస్ లో ఎవరు విజయం సాధిస్తారని అనుకుంటున్నారు ?

జ) నవ్వుతూ..ఈవిషయం లో నాకు కూడా చాల ఆసక్తి ఉంది. ఎవరు గెలుస్తారనే విషయంలో నాకూ ఓ అభిప్రాయం ఉంది. కానీ ఇప్పుడు చెప్పలేను. బిగ్ బాస్ షో ఆడియన్స్ కు బాగా చేరువైంది.

ప్ర) మీరు రాజమౌళి మహాభారతంలో నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి ?

జ) ఆ చిత్రం లో నటించాలని నేను కూడా ఆసక్తిగా ఉన్నాను. రాజమౌళి అందుకోసం నన్ను సంప్రదిస్తే తడుముకోకుండా ఓకె చెబుతాను. చిన్న పాత్ర లో నటించడానికైనా ఆలోచించను. నను ఎలాంటి పాత్ర కేటాయించాలో రాజమౌళికి తెలుసు. కానీ ఈ వార్త మాత్రం ఊహాజనితమే. ఈ చిత్రం గురించి రాజమౌళి మాత్రమే మాట్లాడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు