ఇంటర్వ్యూ : ఐశ్వర్య రాజేష్ – ‘రిపబ్లిక్’ లో సాయి తేజ్ ఒక 10 నిమిషాల సీన్ సింగిల్ టేక్ లో చేశారు

Published on Sep 26, 2021 5:02 pm IST

మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా విలక్షణ దర్శకుడు దేవా కట్ట కాంబోలో తెరకెక్కించిన చిత్రం “రిపబ్లిక్”. మంచి బజ్ లో ఉన్న ఈ చిత్రం వచ్చే 1న రిలీజ్ కానుండగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన యంగ్ అండ్ టాలెంటడ్ నటి ఐశ్వర్య రాజేష్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. మరి ఈ ఇంటర్వ్యూ ద్వారా తాను ఇంకా ఎలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుందో చూద్దాం రండి.

చెప్పండి ‘రిపబ్లిక్’ ఆఫర్ మీకు ఎలా వచ్చింది?

ఒక రోజు దేవా గారు ఫోన్ చేశారు. ఇలా ఒక రోల్ ఉంది మీరు చేస్తారా అని అడిగారు అది హీరోయిన్ అనా లేక వేరేనా అని ఏం చెప్పలేదు ఒక రోల్ ఉంది మీరు చేస్తారా అని అడిగారు. అప్పుడే ఫోన్ లో ఒక గంట పాటు కథను కూడా నరేట్ చేసారు. కోవిడ్ ఫస్ట్ వేవ్ ముగిసే టైం లో కాబట్టి నేను కూడా ఫోన్ లోనే వినాల్సి వచ్చింది. తర్వాత బయట దగ్గ్గర 5 గంటలు నరేట్ చేశారు. తన దగ్గర చాలా క్లారిటీ, డిటైలింగ్ ఉంటుంది. హీరో హీరోయిన్స్ కి ఉండే రొటీన్ లవ్ ఇందులో ఉండదు చాలా క్లియర్ గా మెచ్యూర్ గా ఉంటుంది. అలా వచ్చింది.

ఈ సినిమాలో మీ రోల్ కాకుండా బాగా నచ్చిన అంశం ఏమిటి?

ఈ సినిమాలో చాలా స్ట్రాంగ్ ప్లాట్ ఉంటుంది. నాకు తెలిసి రియల్ స్టోరీ ఇది.. అలాగే దీని ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది అందరికీ రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. మన ఊర్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయా అని అనిపిస్తుంది అంతే కాకుండా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ సినిమాలో ఉన్నాయి.

ఐశ్వర్య రాజేష్ ఇలాంటి రోల్స్ అయితేనే చేస్తుంది అని ఒక టాక్ ఉంది..

అవును ఖచ్చితంగా.. నేను అలా చెయ్యను సినిమాలో చిన్న రోల్ అయినా కూడా పర్లేదు నాకు కానీ గుర్తుండిపోయేలా ఉండాలి అనుకుంటాను. ఇది తమిళ్ సినిమాలో కూడా నేను ఫాలో అవుతా.

సాయి తేజ్ గారు లేకుండా ప్రమోషన్స్ చెయ్యాల్సి వస్తుంది, వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంది?

సాయి ధరమ్ తేజ్ ఒక జెమ్ లాంటి వ్యక్తి. నేను ఇప్పటి వరకు చాలా మందితో యాక్ట్ చేశాను కానీ సాయి తేజ్ ఈ సినిమాలో చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. తన రోల్ ని చాలా బాధ్యతతో చెయ్యాలి, అందుకు తగ్గట్టుగానే చాలా బాగా చేసాడు. అలాగే మేము సినిమా షూట్ కి ముందే టీం తో కలిసి వర్క్ చేసేటప్పుడు రోజు కూడా పొద్దున్నే స్కూల్ కి వెళ్లే పిల్లాడిలా ఒక బుక్ పెన్ పట్టుకొని డైలాగ్స్ అన్ని చాలా ప్రాక్టీస్ చేసేవారు. ఒక సీన్ ఉంటుంది కోర్ట్ లో పది నిమిషాలు అలా ఉంటుంది దాన్ని సింగిల్ టేక్ లో సాయి తేజ్ చెప్పాడు. అంటే ఎంత ఎఫర్ట్స్ పెడితే అలా వస్తుంది. ఆ సీన్ కి అంతా క్లాప్స్ కొట్టారు.

మీ రోల్ కి రిఫరెన్స్ ఏమన్నా తీసుకున్నారా?

రిఫరెన్స్ అంటే నాది ఒక ఎన్నారై రోల్ కాబట్టి అక్కడి తెలుగు లాంటి భాష మాట్లాడాల్సి వస్తుంది. మా డైరెక్టర్ కి చాదస్తం ఎక్కువ(నవ్వుతూ) చాలా సార్లు ఇద్దరికీ డబ్బింగ్ విషయంలో ఏదోకటి వచ్చేది. నేను వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించుకోమన్నా మళ్ళీ దేవా గారు కాల్ చేసి నన్నే చెప్పామన్నారు. ఈ డైలాగ్ ఇలా ఉంది అలా ఉంది. అక్కడ తగ్గితే బాగున్ను అని చాలా చెప్పేవారు.. ఆయన చాలా పర్ఫెక్ట్ గా మాత్రం ఉంటారు. నేను సినిమాలో యాక్ట్ చేసింది 22 రోజులు అయితే డబ్బింగ్ కి 15 రోజులు తీసుకున్నా దాన్ని బట్టి అర్ధం చేస్కోండి దేవా ఎంత పర్ఫెక్ట్ గా ఉంటారో.

భీమ్లా నాయక్ లో రోల్ చేస్తున్నారట నిజమేనా?

అది ఖచ్చితంగా చెప్పలేను.. ఇంకా టాక్ నడుస్తుంది. ఏమన్నా అయితే అప్పుడు కన్ఫర్మ్ చేస్తా..

ఇప్పుడున్న హీరోయిన్స్ లో మీ ఫేవరెట్ ఎవరు?

నాకు సమంతా గారు అంటే చాలా ఇష్టం. చాలా మంచి పెర్ఫామర్ తాను. ఎలాంటి రోల్ అయినా బాగా చేస్తారు. అలాగే అనుష్క కూడా. ఇంకా సౌందర్య గారు అంటే ఇంకా ఇష్టం..

రమ్య కృష్ణ గారితో వర్క్ ఎలా అనిపించింది?

ఆవిడతో వర్క్ అమేజింగ్.. చాలా బాగా చేస్తారు. ఆమె కట్ చెప్తే వేరే మనిషి యాక్షన్ చెప్తే వేరే మనిషి అలాగే కర్వాన్ లో ఒక మనిషిలా ఉంటారు. అస్సలు నమ్మలేం చాలా ఇనోసెంట్ గా ఉంటారు.

మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?

తెలుగులో అయితే ప్రస్తుతానికి ఇదే.. ఇంకో కథ విన్నాను చేసే ఆలోచన ఉంది. ఇంకా తమిళ్ లో అయితే చాలా ఉన్నాయి చేయాల్సినవి. రెండు కంప్లీట్ అయ్యినవి కూడా ఉన్నాయ్.. ఇంకా హిందీలో ఒక సినిమా చేశా. ఇంకా కొన్ని స్క్రిప్ట్స్ వింటున్నా.

ఫైనల్ గా ‘రిపబ్లిక్’ చూసే ఆడియెన్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు?

అందరూ ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా చూడొచ్చు. ముఖ్యంగా పిల్లలు కూడా చూడాలి చాలా నేర్చుకుంటారు. యూఎస్ లో అయితే చిన్నప్పటి నుంచే పాలిటిక్స్ కోసం నేర్పిస్తారు. ఇక్కడ కూడా పిల్లలని ఎడ్యుకేట్ చెయ్యాలి అలాంటి సినిమానే ఇది..

సంబంధిత సమాచారం :