ఇంటర్వ్యూ : ఆకాష్ పూరి – ‘రొమాంటిక్’ కోసం ప్రభాస్ ఒకరోజు మాకిచ్చేసారు

ఇంటర్వ్యూ : ఆకాష్ పూరి – ‘రొమాంటిక్’ కోసం ప్రభాస్ ఒకరోజు మాకిచ్చేసారు

Published on Oct 26, 2021 3:00 PM IST

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “రొమాంటిక్”. రిలీజ్ కి సన్నద్ధం అవుతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ అయితే ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నాయి. మరి ఈ టైం లో ఆకాష్ ఈ సినిమాపై లేటెస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇక ఇందులో సినిమాలో ఎలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడో చూద్దాం రండి.

 

చెప్పండి ఈ ప్రాజెక్ట్ అసలు ఎలా స్టార్ట్ అయ్యింది?

నాన్నగారికి ఈ సినిమా డైరెక్టర్ అనీల్ కి ముందు నుంచి తెలుసు అంతే కాదు డాడీకి బెస్ట్ ఫ్రెండ్ కూడా కానీ డైరెక్టర్ అవుతారు అని ఎప్పుడూ అనుకోలేదు. ఓ రోజు సడెన్ గా ఓ కథ ఉంది డైరెక్షన్ చెయ్యమన్నారు. అంతే అంతా షాక్ అయ్యాం, అలా ఈ సినిమా కుదిరింది. తర్వాత ఒక రెండు రోజులు అనీల్ నేను ట్రావెల్ అయ్యాం ఇక అక్కడ నుంచి బాగా కనెక్ట్ అయ్యిపోయాం.

 

‘మెహబూబా’ తర్వాత గ్యాప్ ఎక్కువే వచ్చినట్టు ఉంది..

గ్యాప్ ఎలా వచ్చింది అంటే.. సినిమా స్టార్ట్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టింది. దాని తర్వాత ఒక 6 నెలలు పట్టింది. ఆ టైం లో ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యింది. దీనితో రొమాంటిక్ ఇంకా జాగ్రత్తగా చెయ్యాలని అన్ని కరెక్ట్ గా ప్లాన్ చేసి రిలీజ్ చేద్దాం అనేసరికి లాక్ డౌన్ అక్కడ నుంచి చాలా వెయిట్ చేసి ఇప్పుడు రిలీజ్ కి వచ్చింది.

 

మరి ఈ లాంగ్ వెయిటింగ్ లో టెన్షన్ పడ్డారా?

అవును చాలా టెన్షన్ పడ్డాను, మెయిన్ భయం ఏంటంటే సినిమా ఎక్కడ ఓటిటి కి వెళ్ళిపోతుంది, ఆన్ లైన్ లో స్ట్రీమ్ అవుతుందేమో అని ఎందుకంటే ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్స్ లో చూడాల్సింది అందరూ విజిల్స్ కొడుతూ చూసే సినిమా. ఫైనల్ గా అంతా బాగా జరిగి థియేటర్స్ కి వచ్చింది.

 

ఈ రొమాంటిక్ సినిమాలో లవ్ స్టోరీ కూడా ఉంటుందా.?

లవ్ స్టోరీ తో పాటు మంచి యాక్షన్, అన్నీ కూడా ఉంటాయి జస్ట్ ఒక్క యూత్ మాత్రమే కాదు అందరూ థియేటర్స్ కి వచ్చి చూడగలిగే సినిమా.

 

‘వాస్కోడిగామా’ ఏంటి? మీ రోల్ ఎలా ఉంటుంది?

మన దగ్గర అందరి పేర్లు ఎలా కామన్ గా ఉంటాయో అలాగే గోవాలో వాస్కోడిగామా అనే పేరు కూడా కామన్ గా ఉంటుంది. రోల్ అంతా గోవా లోనే ఉంటుంది. డాడీ రాసిన క్యారెక్టర్లు పండుగాడు, చంటి, బుజ్జిగాడు ఎలా గుర్తుండిపోతాయో అలాగే ఈ వాస్కోడిగామా కూడా అందరికీ గుర్తుంటుంది. అందుకే ఈ రోల్ విన్నాక ఛాలెంజింగ్ గా తీసుకొని బాగా చెయ్యాలని ఫిక్స్ అయ్యా.

 

పూరి గారి డైలాగ్స్ చాలా బాగుంటాయి ఈ సినిమాలో ఎలా ఉంటాయి?

ఈ సినిమాలో కూడా చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి. చిన్నప్పుడు నుంచి డాడీ డైలాగ్స్ చెప్తున్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యేవాడిని ఇప్పుడు ఆయన డైలాగ్స్ నేనే చెప్తుండడం చాలా హ్యాపీ గా అనిపించింది.

 

మరి డైరెక్టర్ అనీల్ తో వర్క్ ఎలా అనిపించింది?

అనీల్ ఈ సినిమాకి సూపర్ వర్క్ అందించాడు. ఒక కొత్త డైరెక్టర్ తో సినిమా చేస్తున్నట్టు అయితే నాకెప్పుడూ అనిపించలేదు. సినిమాకి మాత్రం చాలా కష్టపడ్డాడు. ఫ్యూచర్ లో అయితే ఇంకా పెద్ద ప్రాజెక్ట్స్ కూడా హ్యాండిల్ చేయగలుగుతాడు అనుకుంటున్నా.

 

రమ్య కృష్ణ గారితో వర్క్ ఎలా అనిపింది మరి?

రమ్య కృష్ణ గారితో వర్క్ మాత్రం కొంచెం కష్టం గానే అనిపించింది. కొన్ని సీన్స్ లో యాక్ట్ చేసేటప్పుడు చాలాసార్లు డైలాగ్స్ మర్చిపోయేవాడిని ఆ టైం లో రమ్య కృష్ణ గారు నాకు చాలా హెల్ప్ చేశారు. మా ఇద్దరి మధ్యలో ఉండే అన్ని సీన్స్ కూడా నువ్వా నేనా అన్నట్టు సూపర్ స్పెషల్ గానే ఉంటాయి.

 

ప్రభాస్ ఈ సినిమాకి ప్రమోటింగ్ చెయ్యడం ఎలా అనిపిస్తుంది?

ప్రభాస్ గారికి చిన్నప్పటి నుంచి నేను బాగా క్లోజ్.. మేము అడక్కుండానే సినిమా కోసం తానే ఫోన్ చేసి సినిమా ప్రమోట్ చేస్తానని చెప్పి ముంబై పిలిపించి తన సినిమా బిజీ షెడ్యూల్ లో ఒక రోజు అంతా గ్యాప్ మాకు ఇచ్చేసి ప్రమోట్ చేశారు. అందుకు చాలా థాంక్స్ ఆ రోజు మాత్రం ఎప్పటికీ నేను మర్చిపోలేను.

 

ఫైనల్ గా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?

నెక్స్ట్ ఇంకా ఏమి కమిట్ కాలేదు. చోర్ బజార్ అయితే ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యిపోయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఇంకో రెండు మూడు నెలల్లో రిలీజ్ అనుకుంటున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు