ఇంటర్వ్యూ : డైరెక్టర్ శ్రీను గవిరెడ్డి – “అనుభవించు రాజా” చూసి బాగా నవ్వుకొని మంచి ఎమోషన్ తీసుకెళ్తారు

ఇంటర్వ్యూ : డైరెక్టర్ శ్రీను గవిరెడ్డి – “అనుభవించు రాజా” చూసి బాగా నవ్వుకొని మంచి ఎమోషన్ తీసుకెళ్తారు

Published on Nov 23, 2021 6:05 PM IST

యంగ్ అండ్ టాలెంటడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “అనుభవించు రాజా”. టీజర్ మరియు ట్రైలర్స్ తో మంచి బజ్ ను తెచ్చుకున్న ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించారు. మరి ఈ వారం థియేటర్స్ లో సందడి చేసేందుకు రెడీ అవుతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు లేటెస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి ఇందులో తాను ఎలాంటి విషయాలు పంచుకున్నారో చూద్దాం రండి.

చెప్పండి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు?

నాది వైజాగ్ లోని నర్సీపట్నం దగ్గర బయ్యవరం. పూరి జగన్నాథ్ గారిది కూడా అక్కడే ఆయన్ని ప్రేరణగా తీసుకొనే నేను కూడా ఇండస్ట్రీలోకి వచ్చాను. వచ్చాక 2016లో సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, మరో సినిమాకి కథ మాటలు అందించాను. ఆ రెండు సరిగా ఆడలేదు. మళ్ళీ ఓ కథ రాసుకోడానికి కొంచెం టైం పట్టింది అలా ఈ సినిమా స్టార్ట్ అయ్యింది.

ఈ సినిమా ప్లాట్ ఏంటి మరి?

బేసిక్ గా అందరిలోని అనుభవించు రాజా అని ఉంటుంది. కానీ దానిని ఎవరు ఎలా చేస్తున్నారు అనేది వాళ్ళ పర్శనల్ విషయం. చిన్న లైఫ్ లో ఎలా అయినా ఎంజాయ్ చేసేయ్యొచ్చు అనే దానిని అసలు నిజంగా అనుభవించడం ఏమిటి? అనే ఎమోషన్ నే ఈ సినిమా.

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో అవకాశం ఎలా వచ్చింది?

ఇది చాలా పెద్ద కథే. ఇంతకు ముందు అన్నపూర్ణ స్టూడియో బయట ఉండి లోపలికి వెళితే చాలు అనుకునేవాడిని. కానీ లోపలకి వెళ్ళాక వారు నన్ను ట్రీట్ చేసిన విధానం చాలా మార్చేసింది. అలాగే సుప్రియ గారు కథ విన్నపుడు చాలా ఎంజాయ్ చేశారు.

రాజ్ తరుణ్ తో సినిమా అనే కథను తీసుకెళ్లారా?

లేదు ముందు ఒక్క కథ మాత్రమే వెళ్ళింది. ముందు సుప్రియ గారు విని ఓకే అన్నారు. తర్వాత చైతన్య గారికి కూడా నచ్చింది. ఫైనల్ గా నాగార్జున విన్నారు. ఆయనకీ కూడా నచ్చడంతో సినిమా ఓకే అయ్యింది.

గోపి సుందర్ గారితో వర్క్ కోసం చెప్పండి.?

గోపి సుందర్ నా ఫస్ట్ సినిమాకి కూడా మ్యూజిక్ తానే ఇచ్చాడు. అప్పుడు నుంచీ మా ఇద్దరికీ మంచి ట్రావెలింగ్ ఉంది. నేను మళ్ళీ వెళ్లి ఒక చిన్న సినిమా చేస్తున్నాను అని చెప్పగానే డబ్బులు ఎంత ఇస్తారు అలాంటివి ఏమీ అడగకుండానే నాకు సినిమా చేస్తాను అని చెప్పాడు. కేవలం నా కోసం ఈ సినిమా తాను చేసాడు.

రాజ్ తరుణ్ స్క్రిప్ట్ విన్నాక ఏమన్నాడు? ఎలా ప్రిపేర్ అయ్యాడు?

కథ విన్నాక రాజ్ తరుణ్ వెంటనే ఓకే చెప్పసాడు. టచ్ చెయ్యని కథ అని ఓకే చెప్పాడు. ఇంకా సినిమాలో సెక్యూరిటీ గార్డ్స్ పడే కష్టాలు ఎలా ఉంటాయో చూపించాము వారు పడే స్ట్రగుల్స్ ని రాజ్ తరుణ్ చేసాడు. కొంతమంది ఆర్టిస్ట్స్ తప్ప నిజమైన సెక్యూరిటీ గార్డ్స్ తోనే సినిమా షూటింగ్ చేసాం. ఇంకా విలేజ్ బ్యాక్ డ్రాప్ కి వచ్చి అక్కడ ఉండే యూత్ ఎలా ఉంటారో అనే దానికి రాజ్ తరుణ్ ఏజ్ గ్రూప్ బాగా సెట్టవుతుంది అని తాను కరెక్ట్ గా సెట్టవుతాడని తీసుకున్నాం.

ఫైనల్ కాపీ నాగార్జున గారు చూసారా మరి?

నాగ చైతన్య చూసారు. నాగార్జున గారు ఇంకా చూడలేదు. కానీ చైతన్య గారికి మాత్రం సినిమా విపరీతంగా నచ్చేసింది. నన్ను మెచ్చుకున్నారు. అది నేను మర్చిపోలేని విషయం.

మరి పూరీ జగన్నాథ్ గారి ప్రభావం ఏమన్నా ఉంటుందా ఈ సినిమాలో?

ఈ సినిమాలో ఆయన ప్రభావం ఏమీ ఉండదు కానీ నాలో మాత్రం ఎప్పుడూ ఉంటుంది. ఈ సినిమా మంచ కామెడీ, ఎమోషన్ తో ఉంటుంది. ఫ్యామిలీ అంతా చూడదగ్గ సినిమా ఇది.

ఇక ఫైనల్ గా సినిమా కోసం ఏం చెప్తారు? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?

ఫైనల్ గా అయితే ఫ్యామిలీ అంతా వచ్చి బాగా నవ్వుకొని ఒక మంచి ఎమోషన్ ని తీసుకెళ్తారు. ఇది మాత్రం కాన్ఫిడెంట్ గా చెప్పగలను. ఇక ఓ మంచి బ్యానర్ లో ఒక సినిమా ఓకే అయ్యింది. దీనిని త్వరలోనే అనౌన్స్ చేస్తాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు