ఇంటర్వ్యూ : రాధాకృష్ణ – “రాధే శ్యామ్” లో ఆ ఐడియా ప్రభాస్ దే..

ఇంటర్వ్యూ : రాధాకృష్ణ – “రాధే శ్యామ్” లో ఆ ఐడియా ప్రభాస్ దే..

Published on Feb 26, 2022 5:17 PM IST

 

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన చిత్రం “రాధే శ్యామ్”. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కి రెడీగా ఉండగా దర్శకుడు చిన్న చిట్ చాట్ నిర్వహించడం జరిగింది. మరి ఈ ఇంటర్వ్యూ లో తాను ఎలాంటి విషయాలు చెప్పారో చూద్దాం.

 

చెప్పండి ఈ సినిమాకి ప్రభాస్ గారిని ఎలా ఒప్పించారు? తనకి నచ్చిన అంశం ఏమిటి?

రాధేశ్యామ్ స్టోరీ చెప్పిన వెంట‌నే అందులో ఉన్న మెయిన్ పాయింట్ కి ప్ర‌భాస్ గారు చాలా ఎక్సైట్ అయ్యారు, త‌న పోషిస్తున్న విక్ర‌మాదిత్య పాత్ర‌లో ఉన్న విభిన్న షేడ్స్ విష‌యంలో ప్ర‌భాస్ గారు చాలా ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించి న‌టించారు

 

ఈ సినిమాని ముందు నుంచి ఇటలీ బ్యాక్ డ్రాప్ లోనే అనుకున్నారా?

లేదు రాధేశ్యామ్ స్టోరీని నేను ముందు ఇండియాలోని ఓ హిల్ స్టేష‌న్ బ్యాక్ డ్రాప్ లో చేద్దామ‌నుకున్నా కానీ ప్ర‌భాస్ గారు ఇచ్చిన సూచ‌న‌ల‌తో ఇట‌లీ బ్యాక్ డ్రాప్ కి మార్చాను, అదే ఇప్పుడు ఈ సినిమాకు మెయిన్ విజువ‌ల్ ఎస్సెట్ గా మారింది

 

సినిమాలో భారీ సెట్టింగ్స్ కూడా వేశారని విన్నాము దానికోసం చెప్పండి?

కోవిడ్ కి ముందు ఇట‌లీ, ఇత‌ర యూర‌ప్ దేశాల్లో షూట్ చేశాము, కోవిడ్ కార‌ణంగా వ‌చ్చిన ఆంక్ష‌లు కార‌ణంగా ఇట‌లీని హైద‌రాబాద్ కి షిఫ్ట్ చేశామనేతంగా భారీ సెట్స్ మ‌ధ్య రాధేశ్యామ్ షూటింగ్ జ‌రిగింది

 

ఈ సినిమాలో జ్యోతిష్యం కోసం ఎంతవరకు చెప్పారు?

జోతిష్యం, హ‌స్త‌సాముద్రికం త‌దిత‌ర అంశాల‌కు సంబంధించి చాలా హ‌నెస్ట్ గా ఓ విష‌యాన్ని చెప్పాము, అదే ఈ చిత్రానికి మెయిన్ కంక్లూజ‌న్

 

ప్రభాస్ గారి పాత్ర ఎలా ఉండబోతుందో చెప్పండి.?

రాజులు, యువ‌రాజులు, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిష్ట‌ర్ వంటి పెద్ద పెద్ద వారికి పల్మ‌నాల‌జీ చెప్పే ప‌ల్మనిస్ట్ క్యారెక్టర్ లో ప్ర‌భాస్ న‌టించారు, ప్ర‌పంచ‌లోనే తొలిసారిగా ఈ నేప‌థ్యంలో వ‌స్తున్న చిత్రం రాధేశ్యామ్

 

లాస్ట్ మినిట్ లో థమన్ ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి తీసుకొచ్చారు తన వర్క్ కోసం చెప్పండి?

రాధేశ్యామ్ ని థ‌మ‌న్ త‌న అద్భుత‌మైన రీరాక్డింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో నెక్ట్స్ లెవ‌ల్ కి తీసుకెళ్లారు

 

ప్రభాస్, పూజా హెగ్డేల కెమిస్ట్రీ ఎలా ఉంటుంది?

సినిమాలో ఇద్దరు ప్ర‌భాస్, పూజా హెగ్దేల జంట చాలా చూడ‌ముచ్చ‌ట‌గా, రొమాంటిక్ గా అనిపిస్తుంది.

 

రాధే శ్యామ్ గ్రాఫిక్స్ వర్క్ కోసం చెప్పండి?

రాధేశ్యామ్ లో మెజార్టీ విఎఫ్ ఎక్స్ వ‌ర్క్స్ ఉక్రేయిన్ లోనే చేయించాము, అన్ని స‌కాలంలోనే పూర్తి చేశాము

సంబంధిత సమాచారం

తాజా వార్తలు