ఇంటర్వ్యూ : మెహ్రీన్ పిర్జాదా – “మంచి రోజులొచ్చాయి” లో నా రోల్ మెచ్యూర్డ్ గా ఉంటుంది

ఇంటర్వ్యూ : మెహ్రీన్ పిర్జాదా – “మంచి రోజులొచ్చాయి” లో నా రోల్ మెచ్యూర్డ్ గా ఉంటుంది

Published on Oct 31, 2021 4:00 PM IST

యంగ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా గ్లామరస్ హీరోయిన్ మెహ్రీన్ హీరోయిన్ గా సక్సెస్ ఫుల్ దర్శకుడు మారుతీ తెరకెక్కించిన సినిమా “మంచి రోజులొచ్చాయి”. మరి రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మెహ్రీన్ ఇప్పుడు ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. మరి దీనిలో తాను ఎలాంటి విషయాలు పంచుకుందో చూద్దాం.

 

చెప్పండి ఈ రోల్ తో ఎలా అప్రోచ్ అయ్యారు?అవకాశం ఎలా వచ్చింది?

ఈ సినిమా జూన్ లో స్టార్ట్ అయ్యింది. నాకు మారుతీ గారు కాల్ చేసినప్పుడు నరేషన్ ఏమి అడగలేదు. తర్వాత సెట్స్ లో కలిసాక స్టోరీ ఇది అని చెప్పారు. మంచి సబ్జెక్ట్ ఇది. అలాగే ఆయన సినిమాలు నాకు ఇష్టమే. దీపావళికి ఈ సినిమా మంచి ప్రోడక్ట్ గా ఉంటుంది అనుకుంటున్నాను.

 

మీ పాత్ర కోసం చెప్పండి.?

నా రోల్ ఇందులో పద్మగా కనిపిస్తుంది. ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపిస్తుంది. చాలా మెచ్యూర్ గా కనిపిస్తుంది. అలాగే ఆమె తండ్రి బాగా ప్రొటెక్టీవ్ మరి అలాంటి తండ్రితో ఇలాంటి అమ్మాయి తన లవ్ స్టోరీ ఎలా ఉంటుంది అనేది మారుతీ గారు చెప్పడం నాకు నచ్చింది.

 

సంతోష్ శోభన్ తో వర్క్ ఎలా ఉంది?మీరు తనకన్నా సీనియర్ కదా దానికోసం చెప్పండి

తనతో వర్క్ వండర్ ఫుల్ గా ఉంది. చాలా డెడికేట్ గా ఉంటాడు. మంచి నటుడు. ఇద్దరం కూడా మా వర్క్ ని బాగా ఎంజాయ్ చేసాం. సీనియార్టీ అలాంటివి అనేం లేదు. నేనే ఇంకా తన దగ్గర నుంచి యాక్టింగ్ పరంగా చాలా నేర్చుకున్నా.

 

మీరు ఓ సినిమా ఓకే చెయ్యాలి అంటే ఏం కారణాలు చూస్తారు?

నేను అన్ని కారణాలు కూడా చూస్తాను. ఒక నోటెడ్ బ్యానర్ నుంచి కానీ మారుతీ లాంటి డైరెక్టర్ నుంచి కానీ కాల్ వస్తే నేను డెఫినెట్ గా ఓకే చేస్తాను ఎందుకంటే ఒక నమ్మకం వాళ్ళ దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది అని. అందుకే నేను ఫస్ట్ టైం ఈ సినిమాకి స్టోరీ వినకుండా ఓకే చేశాను. నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఇలాగే చేస్తున్నాను నేను.

 

సోషల్ మీడియాలో మీపై విమర్శలను ఎలా చూస్తారు?

అన్నిటినీ ఒకేలా చూస్తాను. పాజిటివిటి ఉంటుంది నెగిటివిటి ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే నన్ను నేనే ఎక్కువగా విమర్శించుకుంటా.. ఇంకా మిగతావాళ్ళు సంగతి అంటే అది వాళ్ళ ఆలోచన బట్టి ఉంటుంది.

 

బయోపిక్ సినిమాలు కానీ ఓటిటి నుంచి ఆఫర్స్ ఏమన్నా వచ్చాయా?

బయోపిక్స్ లాంటి మంచి సబ్జెక్ట్స్ ఇంకా రాలేదు నేను కూడా మంచి స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నా. ఓటిటి నుంచి కూడా ఏం ఆఫర్స్ ఇంకా రాలేదు.

 

ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?

ప్రస్తుతానికి చాలా సినిమాలు అయితే ఉన్నాయి కానీ నా ఫస్ట్ ప్రియారిటీ మాత్రం “ఎఫ్ 3” నే. దానిని ముందు కంప్లీట్ చెయ్యాలి అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ పెద్ద స్టార్స్, ఒక మూడు నెలలు అలా డేట్స్ ఇచ్చాను. అది అయ్యాక డిసెంబర్ నుంచి మిగతావి స్టార్ట్ చేస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు