ఇంటర్వ్యూ : చైతన్ భరద్వాజ్ – “మహా సముద్రం” సినిమా చాలా ఇంటెన్స్ గా ఉంటుంది

ఇంటర్వ్యూ : చైతన్ భరద్వాజ్ – “మహా సముద్రం” సినిమా చాలా ఇంటెన్స్ గా ఉంటుంది

Published on Oct 6, 2021 2:00 PM IST

ఈ దసరా కానుకగా రిలీజ్ కి రెడీ అవుతున్న పలు ఇంట్రెస్టింగ్ చిత్రాల్లో శర్వానంద్ మరియు సిద్ధార్థ్ లు కలిసి నటించిన చిత్రం “మహా సముద్రం” కూడా ఒకటి. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ క్రమంలో సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ లేటెస్ట్ ఇంటర్వ్యూ ఒకటి ఇవ్వడం జరిగింది. మరి దీనిలో ఈ సినిమాపై ఎలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడో చూద్దాం రండి.

మీకు అజయ్ భూపతి గారితో రెండో సినిమా ఎలా వచ్చింది?

ఖచ్చితంగా ఈ సినిమా చూసి ఆడియెన్స్ అంతా సైలెంట్ గా వెళ్తారు ఎందుకంటే అజయ్ ఒక ఎమోషన్ ని ఒక కొత్త కోణం లో చూపించారు. లాస్ట్ అరగంట అయితే అంతా చాలా సైలెంట్ గా చూస్తారు. అంత ఇంటెన్స్ గా ఎమోషన్స్ తో ఉంటుంది. ఆ టైం లో నా మ్యూజిక్ కి ఒక ఛాలెంజ్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా సినిమా అయితే అందరికీ నచ్చుతుంది అని చెప్పగలను.

మీ మ్యూజిక్ హీరో ఇమేజ్ కి ఆధారంగా ఇస్తారా లేక కథ మీదనా?

కథ మీదనే, దానిమీద ఇవ్వడానికే ఎక్కువ ఇష్టపడతా. కథ బాగుంటేనే కదా హీరో అయినా హీరోయిన్ అయినా బాగా కనిపించేది. అందుకే కథని దృష్టిలో పెట్టుకొనే సినిమా చెయ్యడానికి ఇష్టపడతా..

ఈ సినిమాలో సాంగ్స్ లో మీకు బాగా నచ్చింది ఏంటి?

ఇందులో అయితే చెప్పకే చెప్పకే సాంగ్ ఇష్టం నాకు.. సినిమాలో మంచి మూమెంట్ లో వస్తుంది. చాలా ఎమోషనల్ గా మంచి టైమింగ్ లో ఈ సాంగ్ వస్తుంది.. అందుకే అది బాగా కనెక్ట్ అయ్యింది.

అజయ్ భూపతి గారు కొన్ని విషయాల్లో కాస్త కోపంగా ఉంటారు అంటారు, మీకు అలాంటి అనుభవం ఏమన్నా ఎదురైందా?

లేదు అలాంటివి ఏం లేవు. నా మ్యూజిక్ పరంగా నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చేస్తారు.. ఏ డైరెక్ట్ దగ్గర అయినా డిటైల్డ్ ఎమోషన్స్ తెలుసుకుంటాను అలానే అజయ్ దగ్గర కూడా కనుక్కుంటా. అందుకే మా నుంచి ప్రతీ అటెంప్ట్ కూడా పాజిటివ్ గానే తీసుకుంటారు. అందుకే లక్కీగా ఫీల్ అవుతా. సీరియస్ నెస్ అయితే నాతో ఎప్పుడు లేదు కూల్ గానే ఉండేవారు.

మీరు మీ టెక్నీకల్ టీమ్ ముందే చూసి ఉంటారు, యాక్టర్స్ పెర్ఫామెన్స్ లు ఎలా వచ్చాయి?

చాలా ఇంటెన్స్ గా అనిపించాయి. ఇప్పుడు ఎగ్జైట్మెంట్ లో ఎక్కువ చెప్పేస్తానేమో అనిపిస్తుంది కానీ నిజానికి ప్రతీ ఒక్కరి నుంచి పీక్స్ లో ఉంటుంది. ఈ మధ్య కాలంలో అయితే ఇంత ఇంటెన్స్ పెర్ఫామెన్స్ లను ఆడియెన్స్ అయితే ఎప్పుడూ చూసి ఉండరు ఇది వంద శాతం గ్యారంటీ.

ఈ సినిమాకి మీకు ఏ వర్క్ చాలా కష్టంగా అనిపించింది?

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది దానికి ఎక్కువ కష్టపడ్డా. అలాగే సాంగ్స్ పరంగా కూడా కొన్నిటిని ఇంతకు ముందు ఎప్పుడు టచ్ చెయ్యని కలర్ లో ట్రై చేశా అవి కూడా చాలా బాగా వచ్చాయి.

మ్యూజిక్ కాకుండా మీకు వేరే ఇంట్రెస్ట్ ఏంటి? ఇతర భాషల నుంచి ఏమన్నా ఆఫర్స్ వచ్చాయా?

మ్యూజిక్ కాకుండా అయితే టెక్నాలజీ లో ఇష్టం నాకు అందులో కూడా కొన్ని మ్యూజిక్ ప్లగ్ ఇన్స్ చేస్తుంటాను. బేసిక్ గా సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను రావడం వల్ల అలా కుదిరింది. ఇంకా వేరే భాషల నుంచి అయితే ఏ ఆఫర్స్ ఇంకా రాలేదు.

ఫైనల్ గా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?

ఒక కొత్త డైరెక్టర్ తో ఓ సినిమా ఉంది. ఇంకా అనౌన్స్మెంట్స్ రాలేదు దానిపై. ఆనంద దేవరకొండ తో ఉంటుంది ఆ సినిమా. ప్రస్తుతానికి అయితే అదే ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు