ఇంటర్వ్యూ : నాగ చైతన్య – ‘లవ్ స్టోరీ’ కంటెంట్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్స్ కి మళ్ళీ వస్తారు

Published on Sep 23, 2021 1:16 pm IST


ఇప్పుడు టాలీవుడ్ అంతా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా “లవ్ స్టోరీ” చిత్రం ఎట్టకేలకు రేపు భారీ ఎత్తున రిలీజ్ కి రెడీ అవుతుంది. నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రం విడుదల అవుతున్న క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా చైతూ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మరి ఈ ఇంటర్వ్యూ ద్వారా తాను మరిన్ని ఎలాంటి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడో చూద్దాం.

చెప్పండి చాలా అడ్డంకులు తర్వాత ఫైనల్ గా సినిమా రిలీజ్ అవుతుంది ఎలా అనిపిస్తుంది?

సినిమా పరంగా నేను చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నాను ఇక ఆడియెన్స్ ఎలా తీసుకుంటారు అన్నదానిపై కాస్త టెన్షన్ గా ఉన్నాను. ఈ మూడు రోజులు బుకింగ్స్ చాలా బాగా అయ్యాయి. తర్వాత ఎలా ఉంటుందో చూడాలి.

ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా వస్తారు అనుకుంటున్నారా?

అంటే బయట అయితే ఫ్యామిలీస్ అంతా బాగానే తిరుగుతున్నారు కానీ సినిమా థియేటర్స్ వరకు వస్తున్నారు అనేది ఇంకా కనిపించలేదు. కానీ మంచి కంటెంట్ ఇస్తే వస్తారు అని నమ్మకం ఉంది. ఫస్ట్ వేవ్ తర్వాత కూడా అదే జరిగింది అలాగే ఈ సినిమా విషయంలో కూడా జరుగుతుంది అని అనుకుంటున్నాను.

సినిమాకి రెండు క్లైమాక్స్ లు తీశారంట నిజమేనా.?

సినిమాకి రెండు క్లైమాక్స్ లు ఏమీ తియ్యలేదు ఒకటే తీసాము.. కానీ ఆ ఒక క్లైమాక్స్ ని ఇంకా బెటర్ గా తీసే ప్రయత్నం చేసాం అంతే. రెండు వేరే వేరే క్లైమాక్స్ లు అయితే ఏం లేవు..

ప్రేమకథలు చాలానే వచ్చాయి ఈ ప్రేమకథ ఎలా ఉంటుంది మరి?

శేఖర్ గారు ఈ సినిమాలో రెండు బాగా సున్నితమైన విషయాలు టచ్ చేశారు. ఈ రెండు చాలా ఫ్రెష్ గా ఉంటాయి. సమాజంలో వీటికోసం మాట్లాడాలి అంటే చాలా వరకు ఇబ్బందిగా ఫీల్ అవుతారు కానీ వీటి కోసం చెప్పి ప్రతిఒక్కరినీ చైతన్యం చెయ్యాలి, నేను కూడా ఇలాంటి వాటిపై చాలా సార్లు కథనాలు విన్నాను నాకు కూడా అనిపించేది వీటికోసం చెప్పాలని కానీ దానిని సినిమా ద్వారా చేస్తే ఇంకా రీచ్ ఉంటుంది అనిపించింది. అప్పుడు శేఖర్ గారు ఈ స్క్రిప్ట్ ఇచ్చాక చాలా బాగా అనిపించింది. అంతేకాకుండా ఈ సినిమా చాలా రియలిస్టిక్ గా కనిపించే లవ్ స్టోరీ ఎక్కడా సినిమాటిక్ గా అనిపించదు.

కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కోసం కూడా స్పెషల్ గా చెప్పొచ్చు అనుకుంటా?

అవును ఖచ్చితంగా చెప్పాలి, తనతో నేను శైలజ రెడ్డి అల్లుడు నుంచి వర్క్ చేస్తున్నా అప్పుడు నుంచి ఇప్పుడు వరకు కూడా నా డాన్స్ పరంగా చాలా నేర్పించారు. ఇంతకు ముందు నాకు డాన్స్ సాంగ్స్ అంటే కొంచెం భయం ఉండేది కానీ శేఖర్ గారు దాన్ని పోగొట్టారు. ఇంకా తనకి చాలా ఓపిక ఎక్కువ ఒక మూమెంట్ సరిగా చెయ్యకపోయినా పర్లేదు బాగా వచ్చే వరకు చెయ్యమని దగ్గరవుండి చెప్పేవారు.

నాగార్జున గారు సినిమా చూసారా? ఎలా ఉంది అన్నారు?

నాన్న గారు సినిమా చూసారు చాలా బాగుంది అన్నారు. తాత గారి సినిమాతో పోల్చడం అనేది జస్ట్ రిలీజ్ డేట్ వరకు మాత్రమే.. నేను అయితే నా సినిమాల్లో అన్నిటికీ చెప్పలేను ఈ సినిమాకి మీరు వెళ్ళండి చూడండి అని కానీ ఈ సినిమాకి చెప్పగలను సినిమా చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుంది అని ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు ఈ సినిమా విషయంలో ఉంది.

మీ గత సినిమాలతో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్ గా ఉంది అసలు మీరు ఈ సినిమా చెయ్యడానికి కారణం ఏంటి?

ఫస్ట్ అయితే డైరెక్టర్ ఖచ్చితంగా రెండోది కంటెంట్. దానికి కనెక్ట్ అయితే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎంత దూరం అయినా వెళ్ళాలి అనిపిస్తుంది. ఇంకా శేఖర్ గారిని చూసినా కానీ మొన్న ప్రీ రిలీజ్ లో మాట్లాడినపుడు తన నిజాయితీ ఇవన్నీ అనిపిస్తాయి పర్లేదు ఈ సినిమా ఇన్ని రోజులు ఆగినా కూడా అని.

అమీర్ ఖాన్ గారితో వర్క్ చేశారు, ఏం నేర్చుకున్నారు ఆయన నుంచి?

చాలానే నేర్చుకున్నాను ఈ పన్నెండేళ్లలో ఏదైతే నేర్చుకున్నానో అక్కడ ఆయనతో ఈ 45 రోజుల్లో అంత కన్నా ఎక్కువ నేర్చుకున్నాను.. ఆయనతో జర్నీ చెయ్యడంలో మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా.

శేఖర్ కమ్ముల గారితో ఎంతవరకు అయినా జర్నీ చేస్తా అని చెప్పారు, ఆయన మిమ్మల్ని అంతలా ప్రభావితం చేసారా?

ఇందాక చెప్పినట్టుగానే ఆయన చాలా సింపుల్ గా ఉంటారు, నిజాయితీగా అందరినీ ఒకేలా చూస్తారు. ఎక్కడా తాను ఇలా కావాలని ఉంటున్నారని ఉండదు. సెట్స్ లో కూడా లైట్ బాయ్ నుంచి అందరి ఆర్టిస్టుల వరకు ఒకేలా చూస్తారు. మంచి విలువలతో కూడా ఉంటారు. అందుకే అలాంటి మనుషులని చూసినప్పుడు వారితోనే ఉండాలి అనిపిస్తుంది. అందుకే అలా అన్నాను.

నాన్న గారితో సినిమా చేస్తున్నారు కదా అది ఎలా ఒప్పుకున్నారు కేవలం నాగ్ చేస్తున్నారనా? ఎలా ఉండబోతుంది?

నాన్న చేస్తున్నారనే కాదు కంటెంట్ కూడా నచ్చే చేస్తున్నాను. ఇంకా ఆ సోగ్గాడే చిన్నినాయన సినిమా అంటే కూడా చాలా ఇష్టం నాకు. ఆ ఫ్రాంచైజ్ ని అలా కొనసాగించాలని అనిపిస్తుంది. ఎక్కువగా రివీల్ చెయ్యకూడదు కానీ పత్రాలు అయితే అవే ఉంటాయి కానీ కథ కంప్లీట్ ఫా వేరే ఉంటుంది.

ఈ సినిమా చుట్టూ కూడా ఓటిటి వార్తలు తిరిగాయి దీనిపై మీ ఏంటో చెప్పండి..

గత రెండేళ్లు చూసుకున్నట్టయతే చాలా మారిపోయాయి. ఇక్కడ తప్పు ఎవరిదీ కూడా కాదు ఎవరికీ వాళ్ళు ఉన్న ఇబ్బందులతో కొన్ని సినిమాలు ఓటీటీకి ఇచ్చేసారు మరికొంత మంది హోల్డ్ చేశారు. అలాగే మా సినిమా విషయంలో కూడా ప్రొడ్యూసర్స్ మొదట నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉండి థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని చెప్పారు. అదే ఇప్పుడు చాలా ప్లస్ అయ్యింది నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను.

మ్యూజిక్ డైరెక్టర్ పవన్ కోసం చెప్పండి..

తప్పకుండ పవన్ కి చాలా మంచి కెరీర్ ఉంటుంది, మా సినిమాని ఇంకో లెవెల్లో తన సాంగ్స్ తో నిలబెట్టాడు. అంతే కాకుండా తన దగ్గర చాలా సాంగ్స్ ఉన్నాయి వాటన్నిటినీ తన మ్యూజిక్ బ్యాంక్ దాచుకున్నాడు. తనకి మాత్రం డెఫినెట్ గా మంచి కెరీర్ ఉంటుంది. చాలా మంచిగా ఉంటాడు, తక్కువగా మాట్లాడుతాడు.

విక్రమ్ కుమార్ గారితో వెబ్ సిరీస్ కోసం చెప్పండి?

అది హారర్ సిరీస్ నే కానీ దయ్యం లాంటిది ఏమి ఉండదు ఒక సూపర్ నాచురల్ పవర్ లాంటిది ఉంటుంది. దానితో నడుస్తుంది.

మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం చెప్పండి?

ప్రస్తుతం అయితే విక్రమ్ తో థ్యాంక్ యూ ఒక పది రోజులు షూట్ బ్యాలన్స్ ఉంది. నాన్న గారితో ఓ సినిమా అమెజాన్ లో వెబ్ సిరీస్ కూడా ఉంది. వీటికి ఓకే చేశాను ఇంకా స్క్రిప్ట్స్ కూడా వింటున్నాను.

సంబంధిత సమాచారం :