ఇంటర్వ్యూ : నాగ శౌర్య – బన్నీ అన్న మాటలు నాలో మరింత స్ఫూర్తినిచ్చాయి.

Published on Oct 28, 2021 2:00 pm IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య హీరోగా రీతూ వర్మ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “వరుడు కావలెను”. కొంచెం డిలే తర్వాత ఎట్టకేలకు రేపు శుక్రవారం థియేటర్స్ లో సందడి చేసేందుకు ఈ చిత్రం వస్తుంది. మరి ఈ సినిమాపై మరిన్ని ఆసక్తికర విషయాలు చెబుతూ శౌర్య ఇంటర్వ్యూ ఇచ్చాడు. అవేంటో చూద్దాం రండి..

 

చెప్పండి ఈ ఆకాష్ రోల్ ఎలా వచ్చింది? సినిమా ఎలా స్టార్ట్ అయ్యింది..

2018 లో ‘ఛలో’ సక్సెస్ టైం పార్టీలో మా అక్క(డైరెక్టర్) ని కలవడం జరిగింది అప్పుడు నాకు కంగ్రాట్స్ చెప్పి ఓ కథ ఉంది వింటావా అని అడిగారు. అప్పుడు స్టార్ట్ అయ్యింది మా జర్నీ. మధ్యలో గ్యాప్ ఇంత వచ్చింది.

 

ఆల్రెడీ మీరు ఇంకో లేడీ డైరెక్టర్ తో వర్క్ చేసారు ఇపుడు ఇంకో డైరెక్టర్. ఈ వర్క్ ఎలా అనిపిస్తుంది?

వారితో వర్క్ చెయ్యడం చాలా ప్రశాంతంగా ఉంటుంది అండి. లేడీ డైరెక్టర్ అయితే సినిమాకి అడ్వాంటేజ్ ఏంటి అంటే వారికి ఓపిక చాలా ఎక్కువ, ఏ సమయంలో రియాక్ట్ అవ్వాలో అప్పుడే రియాక్ట్ అవుతారు. అది వాళ్లలో ఉంటే సహజ లక్షణం.

 

మీ రోల్ కోసం చెప్పండి ఎలా ఉండబోతుంది?

ఒక పర్టిక్యులర్ ఏజ్ వచ్చాక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఇంట్లో పెళ్లి చేసుకో అనేటప్పుడు కాస్త ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి ఒక కోణంలో కథ చెప్పినప్పుడు నేను వెంటనే ఓకే చెప్పేసాను. అందరూ త్వరగా కనెక్ట్ అవుతారు? నా పర్సనల్ లైఫ్ కి ఒక 70, 80 పర్సెంట్ అలా దగ్గరగానే ఉంటుంది.

 

త్రివిక్రమ్ గారు కూడా ఒక సీన్ రాసారు అంట? అదెలా ఉండబోతుంది?

అవును, ఆయన చెప్పేసారు కానీ మేము సీక్రెట్ గానే ఉంచాం. ఆయన ఒక సీన్ ఈ సినిమాలో రాసారు. ఫ్లాష్ బ్యాక్ లో చాలా ఫ్రెష్ గా ఉంటుంది ఈ సీన్. ఆయన రాసిన ఈ సీన్, డైలాగ్స్ నేను చెప్పడం నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపించింది.

 

సినిమా స్టార్టింగ్ నుంచి కంప్లీట్ అయ్యాక చూసిన తర్వాత మీకేం అనిపించింది?

ముందు సినిమా కథ విన్నపుడు బాగుంది అనిపించింది. తర్వాత షూటింగ్ లో ఉన్నపుడు కాన్ఫిడెన్స్ గా అనిపించింది. కానీ ఫైనల్ గా సినిమా మిక్సింగ్ అంతా చూసిన తర్వాత సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అని అనిపించింది. ఈ సినిమా విషయంలో మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను.

 

మీకోసం బన్నీ గారు కూడా బాగానే చెప్పారు ఏమనిపించింది?

ముందుగా బన్నీ అన్నకి చాలా థాంక్స్. నాకోసం తాను చెప్పింది నిజమే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీకి వచ్చాను కానీ ఇక్కడ మంచి సపోర్ట్ నాకు దక్కింది. బన్నీ అన్న మాటల తర్వాత నాకు ఇంకా ఎక్కువ కష్టపడాలి అనే స్ఫూర్తిని ఇచ్చింది.

 

హీరోయిన్ రీతూ వర్మతో వర్క్ కోసం చెప్పండి.?

ఫస్ట్ టైం తనతో యాక్ట్ చేశా బహుశా త్వరలో ఇంకో సినిమా కూడా తనతో చెయ్యొచ్చు. ఆ అమ్మాయి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. తెలుగు మాట్లాడుతుంది, డబ్బింగ్ కూడా తానే చెప్పుకుంది. చాలా మంచి అమ్మాయ్ తను.

 

మీ ప్రొడక్షన్ హౌస్, నిర్మాత నాగవంశీ కోసం చెప్పండి..

వాళ్ళు చాలా మంచి వాళ్ళు, కథకి కావాల్సినంత పెడతారు ఒకవేళ ఎక్కువ అవుతుంది అంటే ఎలా రాబట్టుకోవాలో కూడా తెలుసు. నాగవంశీ గారు అయితే నన్ను చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు.

 

ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ సినిమాకి వర్క్ చేసినట్టు ఉన్నారు?

అదే సినిమాకి బడ్జెట్ పెరిగింది అన్నాం కదా అది దీనికే.. ఈ నిర్ణయం కంప్లీట్ గా మేకర్స్ దే. థమన్ తో వర్క్ చెయ్యాలని ఎప్పుడు నుంచో ఉంది. అది ఈ సినిమాతో నెరవేరింది. అలాగే విశాల్ తో కూడా చెయ్యాలి అనుకున్నాను కానీ ఆ రెండు ఈ సినిమాతో అయ్యిపోయాయి.

 

నదియా గారి పాత్ర కోసం ఏమన్నా చెప్పండి?

నదియా గారి రోల్ ‘అత్తారింటికి దారేది’ పవన్ కళ్యాణ్ గారినే డిమాండ్ చేసే లాంటి రోల్. అంత మంచి రోల్ చేసిన తనతో ఈ సినిమాలో కామెడీ చేయించడం అనేది చిన్న విషయం కాదు. ఒక మిడిల్ క్లాస్ తల్లిగా తన కూతురికి పెళ్లి చెయ్యాలని ఆరాటపడే తల్లిగా తాను యాక్ట్ చెయ్యడం చూసి నేను షాక్ అయ్యిపోయాను. ఆవిడ వర్క్ ప్రతి ఒక్కరినీ మెప్పిస్తుంది.

 

ఇక ఫైనల్ గా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం చెప్పండి..

ప్రస్తుతానికి మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. నాకు ‘లక్ష్య’ పై కూడా చాలా అంచనాలు ఉన్నాయి. నా ప్రతి సినిమాలో నన్ను నేను కొత్తగా చూపించుకోవడానికే కష్టపడతాను.

సంబంధిత సమాచారం :

More