ఇంటర్వ్యూ : పూజా హెగ్డే – “రాధే శ్యామ్” కి టైటానిక్ కి అందులో మాత్రమే పోలిక ఉంది

ఇంటర్వ్యూ : పూజా హెగ్డే – “రాధే శ్యామ్” కి టైటానిక్ కి అందులో మాత్రమే పోలిక ఉంది

Published on Mar 7, 2022 12:00 AM IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర రిలీజ్ కి రెడీ అవుతున్న లేటెస్ట్ భారీ సినిమాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన చిత్రం “రాధే శ్యామ్” కూడా ఒకటి. మరి ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా లేటెస్ట్ గా పూజా హెగ్డే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మరి ఇందులో ఈమె ఎలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలు పంచుకుందో చూద్దాం రండి.

 

రాధే శ్యామ్ లో మీ ప్రేరణ రోల్ ఎలా ఉంటుంది?

ఈ సినిమాలో నేను చేసిన ప్రేరణ రోల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చాలా షేడ్స్, డెప్త్ ఈ క్యారెక్టర్ లో కనిపిస్తాయి. చాలా ఎమోషన్స్ ఇందులో కనిపిస్తాయి. నేను కూడా దీనిపై చాలా రీసెర్చ్ చేశాను. ఇప్పుడే అంతా చెప్పడం కరెక్ట్ కాదు కానీ ఈ నాలుగేళ్లలో నేను కూడా చాలా పరిణితి చెందాను.

 

మరి మీరు రియల్ లైఫ్ లో జోశ్యం నమ్ముతారా?

అవును నేను కూడా చాలా నమ్ముతాను. మన ఇండియా కల్చర్ ఎంతో గొప్పదిగా నేను భావిస్తాను. దానికి చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి. టెలిస్కోప్ రాకముందే మన దేశపు కల్చర్ ఎన్నో కనుక్కుంది. అందుకే నేను నిజంగా కూడా నమ్ముతాను.

 

ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ లతో యాక్ట్ చేశారు వారితో వర్క్ కోసం చెప్పండి?

ఎన్టీఆర్ అయితే సెట్స్ లో చాలా ఎనర్జిటిక్ గా ఉంటాడు. ఏదైనా సింగిల్ టేక్ లోనే చేసేస్తాడు. అలాగే బన్నీ కూడా చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తాడు. ఇక ప్రభాస్ అయితే కొంచెం షై గా కనిపిస్తాడు కానీ చాలా ఫన్నీ గా ఉంటాడు. అలాగే ఇటలీ లో నా టీం లో ముగ్గురికి కరోనా వస్తే ప్రభాస్ నే నాకు అన్ని రోజులూ ఫుడ్ ని పంపేవాడు. మా అమ్మ కూడా ప్రభాస్ చేసిన పనికి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవారు.

 

ఈ సినిమాలో మీకు ఛాలెంజింగ్ గా అనిపించింది ఏంటి?

ఈ సినిమాలో నాకు ఛాలెంజింగ్ గా అనిపించింది.. రెండు భాషల్లో షూటింగ్ చెయ్యడం. తెలుగు ఇంకా హిందీలో ఒకేసారి షూట్ చెయ్యడం కాస్త కష్టంగా అనిపించింది. అలాగే ఇంకొకటి ఏమిటంటే సినిమా ఎమోషనల్ సీన్స్ చెయ్యడం చాలా కష్టం అనిపించేది. ఎందుకంటే ఒక కంప్లీట్ ఎమోషనల్ సీన్ ని తెలుగులో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తే ఒకే దానికి కట్ చెప్పి మళ్ళీ డైరెక్టర్ రాధా ఇంకో భాషలో టేక్ చేద్దాం అంటే అప్పుడు ఓ రేంజ్ లో అనిపించేది(నవ్వుతూ). సీన్స్ ఒకటే కానీ మ్యాజిక్ వేరేగా ఉంటుంది.

 

సినిమాపై టైటానిక్ ఫ్లేవర్ అంటున్నారు..దాని కోసం చెప్పండి

ఇప్పుడు మీరు చూస్తే ఒకవేళ షిప్ గాని మునిగిపోతే అది టైటానిక్ అంటారు.. అయితే ఈ సినిమాకి అలాంటి గ్రేట్ సినిమాతో పోల్చడం గొప్ప విషయం. కానీ ఇది అయితే టైటానిక్ కాదు. జస్ట్ షిప్ ఉందని పోలిక మాత్రమే.

 

మిమ్మల్ని పాన్ ఇండియా యాక్టర్ అంటుంటే ఎలా అనిపిస్తుంది?

అందులో నేనేమి అనుకోవట్లేదు కానీ నేను అన్ని భాషల్లోని యాక్ట్ చెయ్యాలి అనుకుంటాను. కంటెంట్ బాగుంటే ఏ భాషల్లో అయినా చేస్తాను. కానీ తెలుగు సినిమాలు ఎక్కువ చెయ్యడానికి ఇష్టపడతాను. ఎందుకు అంటే ఇక్కడ నుంచే నా కెరీర్ మొదలు పెట్టాను. ఇక్కడ నుంచే ఎలాంటి సినిమాలు చెయ్యాలి అనేది కూడా నేర్చుకున్నాను.

 

పవన్ – హరీష్ శంకర్ గారి సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? కథ విన్నారా?

ఈ మాట హరీష్ శంకర్ గారికి ఫోన్ చేసి అడగండి… స్టోరీ కోసం అవేవి చెప్పను ఇప్పుడు రాధే శ్యామ్ కోసం మాత్రమే మాట్లాడుకుందాం.

 

ఒక మహిళ గా మీరు ఎలాంటి సినిమాలు ఒప్పుకుంటారు? ఎలా ఒప్పుకుంటారు?

నేను కూడా కొన్ని సినిమాలు ఆడవాళ్ళకి ప్రేరణగా నిలిచే సినిమాలు చేయాలి అనుకుంటాను. అలా నటులు సావిత్రి గారు, హేమ మాలిని గారు ఎన్నో విమెన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేశారు. అవి మంచి లాభాలు కూడా ఇచ్చాయి. నేను చేసిన సినిమాల్లో అరవింద సమేత లో నేను చేసిన రోల్ మంచి పవర్ ఫుల్ రోల్ గా అనుకుంటాను. ఈ ఉమెన్స్ డే కి నా నుంచి మహిళలకి ఒక మెసేజ్ ఇవ్వమంటే.. మీ మీద మీరు కొంచెం ఎక్కువ ప్రేమ పెంచుకోండి. మీ చుట్టూ ఉన్న ఇతర ఆడవాళ్లను మీ తల్లిని చూసి కొంచెం నేర్చుకోండి. ఇది మీకు బాగా వర్క్ కావచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు