ఇంటర్వ్యూ : ప్రియాంకా జవల్కర్ – “గమనం” స్క్రిప్ట్ విన్నాక ఒక ‘వేదం’ టైప్ సినిమా ఫీల్ వచ్చింది

Published on Dec 5, 2021 5:34 pm IST

వచ్చే వరం టాలీవుడ్ దగ్గర రిలీజ్ కి రెడీ అవుతున్న పలు చిత్రాల్లో శ్రేయ శరన్, ప్రియాంకా జవాల్కర్ అలాగే శివ కందుకూరి మరియు సుహాస్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన అంథాలజీ చిత్రం “గమనం”. సుజనా రావ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకులు మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. మరి ఈ రిలీజ్ క్రమంలో ప్రియాంకా జవాల్కర్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. మరి తాను ఎలాంటి విషయాలు పంచుకుందో చూద్దాం.

చెప్పండి మీకు ఈ సినిమా ఆఫర్ ఎలా వచ్చింది?

నన్ను ముందు జ్ఞ్యాన శేఖర్ గారు ముందు అప్రోచ్ అయ్యారు. ఆ తర్వాత ముందు నాకు లుక్ టెస్ట్ చేసి సెట్ అవుతానా లేదా అని చూసారు. అప్పుడు సెట్టయ్యాక ఒకే చేశారు. అలా ఈ సినిమా నాకు వచ్చింది.

మరి ఈ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?

ఈ సినిమాలో నేను జారా అనే అమ్మాయిగా కనిపిస్తాను. కొంచెం కన్వెన్షల్ గా ఉండే కాలేజ్ కి వెళ్లే ముస్లిం అమ్మాయి గా కనిపిస్తాను. తక్కువగా మాట్లాడుతుంది హీరోతో లవ్ ట్రాక్ కూడా ఉంటుంది. ఎక్కువగా ఎమోషన్స్ తో తక్కువ డైలాగ్స్ ఉంటాయి. అందుకే కొంచెం కష్టంగా అనిపించింది.

ఫస్ట్ టైం ఒక లేడీ డైరెక్టర్ తో వర్క్ చేశారు ఎలా అనిపించింది?

మేల్, ఫిమేల్ లతో వర్క్ లో పెద్దగా తేడా ఉండదు అంటారు అనుకుంటారు కానీ తనతో వర్క్ చెయ్యడంలో నేను కాస్త ఎక్కువ కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాను. తనతో కనెక్ట్ అయ్యి, ఒక ఫ్రెండ్ గా ఇప్పుడు తాను మారింది.

ఈ స్క్రిప్ట్ విన్నాక మీ ఫీలింగ్ ఏంటి?

అప్పుడు వరకు చాలా కథలు వింటున్నాను అన్నీ చేసినట్టుగా కమర్షియల్ గా అనిపించాయి. కానీ ఈ సినిమా కథ కాస్త డిఫరెంట్ గా అనిపించింది. రియాలిటీ కి దగ్గరగా ఒక ‘వేదం’ సినిమా టైప్ లో ఉంటుంది అనిపించింది. ఇంకా ఇళయరాజా గారి మ్యూజిక్ అని చెప్పగానే వెంటనే ఓకే చెప్పేసాను.

మీ ఫిల్మ్ కెరీర్ పరంగా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు?

అవును సినిమాల ఎంపిక పరంగా కాస్త పర్టిక్యులర్ గానే ఉంటాను కానీ ఏది పడితే అది చెయ్యాలని అనిపించదు. ఒక్కోసారి భయం కూడా వేస్తుంది. ఫటాఫట్ వెంటవెంటనే చేసెయ్యాలని కానీ మంచి కథ అయితేనే బాగుంటుంది కదా అని అనుకుంటా అందుకే తక్కువ సినిమాలే చేస్తున్నాను.

ఈ హీరోతో సినిమా చెయ్యాలని ఏమన్నా ఉందా?

అందరి హీరోస్ తో సినిమాలు చెయ్యాలని ఉంది. కానీ మెల్లమెల్లగా ఒక్కో సినిమా చేసుకుంటూ అలా ఎదగాలి అనుకుంటున్నాను.

ఓటిటి ఆఫర్స్ కి ఏమన్నా ట్రై చేస్తున్నారా?

నేను ఎప్పుడూ హిందీ నెట్ ఫ్లిక్స్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాను. వెళ్తున్నాను ఆడిషన్స్ ఇస్తూనే ఉన్నాను. కానీ ఇంకా ఏది ఓకే అవ్వలేదు. మేజర్ గా అయితే నెట్ ఫ్లిక్స్ కే ట్రై చేస్తున్నాను.

ఫైనల్ గా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం చెప్పండి?

ప్రస్తుతానికి అయితే ఇంకా ఏదీ ఓకే చెయ్యలేదు, స్క్రిప్ట్స్ వింటూనే ఉన్నాను. బహుశా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి మళ్ళీ ఇంకో ఏడాది గ్యాప్ వచ్చేలా ఉంది.

సంబంధిత సమాచారం :