ఇంటర్వ్యూ : నాగవంశీ – “స్వాతిముత్యం” లో ఒక కాంట్రవర్సీ పాయింట్ ని ఫన్ గా చూపించాం

ఇంటర్వ్యూ : నాగవంశీ – “స్వాతిముత్యం” లో ఒక కాంట్రవర్సీ పాయింట్ ని ఫన్ గా చూపించాం

Published on Oct 1, 2022 5:56 PM IST

టాలీవుడ్ లో సినిమా అంటే ఎంతో ప్యాషన్ ఉన్నటువంటి కొద్ది మంది నిర్మాతల్లో యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా ఒకరు. సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేతగా ఎన్నో హిట్ చిత్రాలు చేసి ఈ ఏడాదిలో డీజే టిల్లు, భీమ్లా నాయక్ లాంటి భారీ బ్లాక్ బస్టర్స్ అందుకొని ఇప్పుడు తన మరో చిత్రం “స్వాతి ముత్యం” తో దసరా కానుకగా వస్తున్నారు. మరి గట్టి పోటీ మధ్య తన సినిమాని దింపుతున్న ఈ యంగ్ ప్రొడ్యూసర్ ప్రమోషన్స్ లో భాగంగా లేటెస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మరి తాను ఎలాంటి విషయాలు పంచుకున్నారో చూద్దాం రండి.

 

చెప్పండి మీ స్వాతిముత్యం ఎలా ఉండబోతుంది?

ఇది ఒక ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. థియేటర్ నుంచి నిస్సందేహంగా నవ్వుకుంటూ బయటకు వస్తారు. అద్భుతం తీశాం, అవార్డులు వచ్చే సినిమా తీశామని చెప్పను. పండగ రోజు థియేటర్ కి వస్తే మాత్రం గ్యారంటీగా నవ్వుకునే బయటకు వస్తారు. అయితే ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని పాయింట్ ని ఇందులో టచ్ చేశాం. ఒక కాంట్రవర్షియల్ టాపిక్ ని ఫన్ టోన్ లో చెప్పాం.

 

ఈ సినిమా చేసింది ఓ కొత్త డైరెక్టర్ మీరేమన్నా ఇన్ పుట్స్ ఇచ్చారా?

లేదు, ఇప్పుడొస్తున్న కొత్త డైరెక్టర్లు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటున్నారు. లక్ష్మణ్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా తాను అనుకున్నది తీశాడు. మేం ఏవో చిన్న చిన్న సలహాలు మాత్రమే ఇచ్చాం.

 

గాడ్ ఫాదర్, ఘోస్ట్ లాంటి సినిమాలతో పాటు విడుదల చేస్తున్నారు.ఇది కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా?

కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అలాంటిదేం లేదు. నేను మొన్న కూడా చెప్పాను. కోవిడ్ తర్వాత ప్రతివారం కనీసం రెండు మూడు సినిమాలు వస్తున్నాయి. పైగా దసరా సీజన్ కాబట్టి రెండు సినిమాలున్నా రిస్క్ తీసుకుంటున్నాం అంతే.

 

మొన్న చిరంజీవి గారు మీ సినిమా గురించి కూడా ప్రస్తావిస్తూ అభినందనలు తెలిపారు మీరెలా ఫీల్ అయ్యారు?

అందుకే ఆయన చిరంజీవి అయ్యారు. చిన్న సినిమాలను ఆదరించమని కోరతారు. చిన్న సినిమాలను అభినందిస్తారు. అందుకే ఆయన ఇండస్ట్రీ పెద్ద అయ్యారు. అయన అలా మా సినిమా కోసం చెప్పడం ఆనందంగా అనిపించింది.

 

ఈ సినిమాకి హీరోయిన్ గా వర్ష బొల్లమ్మ ని ఎంపిక చేయడానికి కారణం?

మిడిల్ క్లాస్ మెలోడీస్ లో ఆమె నటన చూసి ఎంపిక చేశాం. దీనిలో కూడా ఒక స్మాల్ టౌన్ అమ్మాయి క్యారెక్టర్. ఆ పాత్రకి ఆమె సరిగ్గా సరిపోతుంది అనిపించుకుంటుంది అందుకే తీసుకున్నాం.

 

ఈ ఫిల్మ్ గణేష్ కి మంచి లాంచ్ అవుతుంది అనుకుంటున్నారా?

బెల్లంకొండ సురేష్ గారు పెద్దబ్బాయిని సమంతను హీరోయిన్ గా పెట్టి గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇది అలా కాదు. ఈ సినిమాతో మంచి కాన్సెప్ట్ తో వచ్చాడన్న పేరు వస్తుంది.

 

ఈ సినిమా తర్వాత నుంచి మీ బ్యానర్ లో ప్రయోగాత్మక చిత్రాలు ఆశించవచ్చా?

డీజే టిల్లు నుంచే చేశాం కదా. అన్ని రకాలు చిత్రాలు చేస్తాం. టిల్లు, వరుడు కావలెను, స్వాతిముత్యం ఇలా చిన్న చిత్రాలతో ప్రయోగాలు చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ బాలకృష్ణ గారు, రవితేజ గారు, వైష్ణవ్ తేజ్, నవీన్ పోలిశెట్టి వంటి హీరోలతో పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తున్నాం. అలాగే ఓ కాలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీతో తారక్ గారు బావమరిదిని లాంచ్ చేస్తున్నాం.

 

మరి చిరంజీవి గారితో ఎప్పుడు ఉండొచ్చు ప్రాజెక్ట్?

నేను కూడా చాలా ఎదురు చూస్తున్నాను ఆయనతో త్వరగా సినిమా చేయాలని.

 

ఇక ఫైనల్ గా మహేష్ బాబు గారితో సినిమా గురించి చెప్తారా?

త్రివిక్రమ్, మహేష్ గారి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలకు థియేటర్స్ లో రావాల్సినంత ఆదరణ రాలేదు. కానీ టీవీల్లో పిచ్చి పిచ్చిగా చూసి ఆ కాంబినేషన్ పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఏ స్థాయిలో అంచనాలు పెట్టుకొని థియేటర్ కి వచ్చినా అంతకుమించి మెప్పించేలా ఈ సినిమా తప్పకుండా ఉంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు