ఇంటర్వ్యూ : ఎన్టీఆర్, చరణ్ – చాలా సందర్భాల్లో ఇద్దరం ఒకరి నటన చూసి ఒకరు ప్రేరణ చెందాం

ఇంటర్వ్యూ : ఎన్టీఆర్, చరణ్ – చాలా సందర్భాల్లో ఇద్దరం ఒకరి నటన చూసి ఒకరు ప్రేరణ చెందాం

Published on Mar 15, 2022 5:43 PM IST

ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా టోటల్ ఇండియన్ సినిమా దగ్గరే ఒక క్రేజీ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ లేటెస్ట్ గా వస్తున్న భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం”. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి హీరోలతో దర్శకుడు రాజమౌళి సినిమా అనగానే అంచనాలు ఎక్కడికో వెళ్లాయి. మరి ఈ ఇద్దరు హీరోలు ఈ సినిమా లో ఎలా వర్క్ చేశారు? ఇద్దరి మధ్య స్నేహం ఇంకెంత బలపడిందో ఇలా ఎన్నో ఆసక్తికర ప్రశ్నలకి సమాధానమే ఈ ఇంటర్వ్యూ..అదేంటో చూద్దాం రండి.

ప్ర) ఎన్టీఆర్ గారు మీరు చరణ్ కి ముందే ప్రాణ స్నేహితులు ఈ సినిమా తర్వాత అది ఎంత వరకు వెళ్ళింది?

ఎన్టీఆర్ – ఆయనే అన్నారు మా స్నేహాన్ని చూసి ఈ పాత్రలు ఇచ్చారని, ఈ పాత్రల కోసం మా స్నేహం ఎంత వరకు వెళ్లిందో కానీ మా స్నేహం ఇంకా గట్టి పడినట్టు మా స్నేహం వెళ్ళిపోయింది.

 

ప్ర) మళ్ళీ ఎన్టీఆర్ గారికి.. మీరు చరణ్ అల్లూరి పాత్ర చెయ్యాలని ఏమన్నా అనిపించిందా?

లేదు నేనెప్పుడూ అలా అనేం అనుకోలేదు. అలా ఫర్ఫెక్ట్ డిజైన్ చేసాడు మా పాత్రలని. ఇద్దరికీ కూడా ఆ పాత్రల్లో అంత ఆకలి ఉంది సో మార్చుకోవాల్సిన పని లేదు.

 

ప్ర) కొమరం భీమ్ పాత్రకి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు ఏమన్నా రిఫరెన్స్ తీసుకున్నారా?

నాకు నా గురు మాత్రమే ఉన్నాడు. నా డైరెక్టర్ నుంచే రిఫరెన్స్ తీసుకున్నా. నాకు ఎలాంటి రిఫరెన్స్ లేదు. తాను చెప్పిన దాని నుంచి మాత్రమే చేసాను. ఈ పాత్రలు చెయ్యడానికి ఎంతవరకు కావాలో అంతే తెలుసుకున్నాము అంతే చేసాము.

 

ప్ర) ఇదే కథ ఇదే ఇదే హీరోతో కానీ వేరే దర్శకునితో అయితే మీరు చేస్తారా చరణ్ గారు?

చరణ్ – లేదు అసలు ఆలోచించడానికి కూడా లేదు. చెయ్యను అని చెప్పట్లేదు కానీ ఆలోచించడానికి కూడా చాలా కష్టం అది.

 

ప్ర) చరణ్ గారూ మీ ఇద్దరు కంప్లీట్ యాక్టర్స్..అలా ఈ సినిమాలో మీ ఇద్దరిలో ఒకరికి ఒకరిపై గౌరవం పెరిగేలా అనిపించే సందర్భాలు ఉన్నాయా?

చరణ్ – చాలా ఉన్నాయి. తారక్ ఒక గ్రేట్ యాక్టర్ ని అందరికీ తెలుసు. చాలా సీన్స్ లో తాను చేసినప్పుడు నేను కూడా ఒక యాక్టర్ తన నటన చూసి ప్రేరణ చెందాను. తాను ఇంత బాగా చేసాడు నేను కూడా అంతకు మించి బాగా చెయ్యాలి అని ఫీల్ అయ్యేవాడిని.

ఎన్టీఆర్ – చరణ్ సీన్స్ మానిటర్ చూసేటప్పుడు వెంటనే చెప్పేసేవాడిని బాగుంది అని, అలాగే ఇంకా కొన్ని సీన్స్ లో అయితే చరణ్ వెళ్లే మార్గం నేను అనుకరించవచ్చా? ఇలా కూడా చెయ్యొచ్చా అనిపించేది. ఇలా చాలా సందర్భాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు