ఇంటర్వ్యూ : నిర్మాత సృజన్ యరబోలు(ఎస్ ఒరిజినల్స్) – “అద్భుతం”కి మెగాస్టార్ నుంచి రెస్పాన్స్ ఊహించలేదు

Published on Nov 27, 2021 4:03 pm IST

లేటెస్ట్ గా ఓటిటి లో రిలీజ్ అయ్యి టాలీవుడ్ ఆడియెన్స్ ని ఇంప్రెస్ చేసిన చిత్రం “అద్భుతం”. యంగ్ హీరో తేజ సజ్జ నటించిన ఈ చిత్రం కంప్లీట్ డిఫరెంట్ గా దర్శకుడు మల్లిక్ రామ్ తీసిన ఈ చిత్రాన్ని అంత అందంగా చూపించడానికి కారణం నిర్మాత సృజన యరబోలు. అయితే నిర్మాతగా ఒక కొత్త అటెంప్ట్ చేసిన ఆయన మీడియాతో ముచ్చటించారు. మరి తనలో ఉన్న ఆలోచనలు ఏంటి? సినిమా ప్రపంచంలో తన నుంచి ఎలాంటి సినిమాలు అందించాలి అనుకుంటున్నారు అనేది ఈ ఇంటర్వ్యూ లో తెలుసుకుందాం రండి.

 

చెప్పండి మీరు ఇండస్ట్రీకి రావడానికి గల కారణం ఏంటి? అంతా ఎలా స్టార్ట్ అయ్యింది?

2015లో నేను యూఎస్ లో ఉండేటప్పుడు అక్కడ తెలుగు సినిమాల డిస్ట్రిబ్యూషన్ చేసేవాడిని. 30 సినిమాలు మేర చేశాను. మహానటి, అర్జున్ రెడ్డి ఇలా చాలా సినిమాలే చేశాను. అదే బ్యానర్ నిర్వాణ వారి పేరుతో సినిమాలు ప్రొడ్యూస్ చేసిన రెండు సినిమాలు కూడా అంతగా ఆడలేదు. ఇక తర్వాత డిఫరెంట్ గా స్టార్ట్ చేద్దామని “ఎస్ ఒరిగినల్స్” స్టార్ట్ చేసాం. దినులో ఫస్ట్ సినిమా “అద్భుతం” అవ్వాలి కానీ కొన్ని కారణాల వల్ల లేట్ గా రిలీజ్ అయ్యింది. తర్వాత “తిమ్మరుసు” మహేష్ కోనేరుతో కలిసి చేశా, ఇంకొకటి అమెజాన్ ప్రైమ్ లోనే రిలీజ్ అయ్యింది. ఇప్పుడు అయితే అన్నీ కలిపి ఒక 8 సినిమాలు ఉన్నాయి.

 

మరి చిన్న సినిమాలకు ఓవర్సీస్ లో మార్కెట్ ఉందా?

లేదు ఓవర్సీస్ లో చిన్న సినిమాలకు మార్కెట్ లేదు. నిజానికి అద్భుతం సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ చేద్దాం అనుకున్నాం కానీ పరిస్థితులు రీత్యా ఓటిటి లోనే రిలీజ్ చెయ్యాల్సి వచ్చింది. ఇంకా కొన్ని సినిమాలు అయితే కావాలని ఓటిటి కోసం చెయ్యడం కానీ కొన్ని థియేట్రికల్ కోసం చెయ్యడం కానీ అలా ముందే ప్లాన్ చేసుకొని సినిమాలు తీస్తున్నాం.

 

ఒక దర్శకుడు మీ దగ్గరకి వచ్చినపుడు నిర్మాతగా మీరు ఏ అంశం ఆశిస్తారు?

నేను యూనిక్ గా ఉండే స్టోరీనే ఎంచుకుంటాను. నా బ్యానర్ ఎస్ ఒరిగినల్స్ నుంచి ఓ సినిమా వచ్చింది అంటే అందులో మంచి కథ ఉంటుంది అనే మార్క్ అందరిలో ఉండాలి. అన్నీ అలాంటి కథలే కోరుకుంటా. ఇప్పుడు చేస్తున్న ఓ సినిమాలో అయితే హీరోనే ఉండడు సాంగ్స్ లేవు ఫైట్స్ కూడా ఉండవు. ఇప్పుడు ఆడియెన్స్ ఇతర భాషల్లో చూసి మన దగ్గర బాగున్నాయి అనుకుంటున్నారు అలాగే మన దగ్గర నుంచే మంచి కంటెంట్ ఎందుకు ఉండకూడదు అని నేను చేస్తున్నదే ఈ ప్రయత్నం. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నా.

 

మరి కథ పరంగా సినిమాలు చేస్తారా నటీనటుల పరంగా కూడా వెళ్తారా?

నేను నటీనటుల పరంగానే వెళ్లి ఉంటే ఈపాటికే చాలా మంది స్టార్స్ తో సినిమాలు చెయ్యాలి. కానీ నేను అలా అనుకోలేదు అందుకే అన్ని భాషల్లో కూడా సినిమాలు చేస్తున్నాను. కంటెంట్ కి తగ్గ కాస్ట్ ని మాత్రమే పట్టుకుంటాను. నా సినిమాల్లో హీరో హీరోయిన్ ఎవరు అంటే నేను కూడా చెప్పలేను.

 

‘అద్భుతం’ కి చిరంజీవి గారు కూడా ట్వీట్ చేశారు ఎలా అనిపించింది?

అది నిజంగా ఊహించలేదు. చాలా చాలా హ్యాపీ అయ్యాను. మేము కూడా చిరంజీవి గారిని ఏమీ అడగలేదు. ఆయన తనంతట తాను ట్వీట్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది.

 

మరి ఏదైనా పెద్ద సినిమా ఏదైనా చేస్తున్నారా?

ఇప్పుడు అయితే ఆ పేరు రివీల్ చెయ్యలేను కానీ పెద్ద సినిమా అయితే ఉంది. మంచి కమెర్షియల్ ఎలిమెంట్స్ తో తెలిసిన స్టార్ తోనే. అది జనవరి ఫిబ్రవరిలో అలా అనౌన్సమెంట్ ఉంటుంది.

 

ఇప్పుడు ఓవర్సీస్ లో మార్కెట్ ఎలా ఉంది మరి?

ప్రస్తుతానికి నార్మల్ గానే ఉంది కానీ ఫ్యామిలీ ఆడియెన్స్ ఎవరు థియేటర్స్ కి రావడానికి ఇంకా ఇష్టపడట్లేదు. ఇది బాలయ్య గారి “అఖండ”తో మారుతుంది అనుకుంటున్నా. తర్వాత పుష్ప కూడా ఉంది. దానికీ బాగానే ఉంటుంది. ఇంకా జనవరి కి అలా మొత్తం సెట్టయ్యిపోతుంది.

 

మరి మీ నుంచి రీమేక్ సినిమాలు కూడా ఏమన్నా ఉంటాయా?

రీమేక్స్ అంటే ఇప్పుడు అద్భుతం సినిమానే హిందీలో చేద్దాం అనుకుంటున్నాను. తెలుగు లో అయితే అన్నీ స్ట్రైట్ సినిమాలే చేద్దాం అనుకుంటున్నాను.

 

ఫైనల్ గా మీ బ్యానర్ నుంచి ఐదు సినిమాలు వస్తాయా ఒకే ఏడాదిలో?

అవును, నేను కూడా అదే ప్లానింగ్ అనుకుంటున్నా ప్రతి ఏడాది నా బ్యానర్ నుంచి 5 సినిమాలు చెయ్యాలి అనుకుంటున్నా. ఇప్పటికే పేరుని కూడా ఎస్ ఒరిజినల్స్ నుంచి ఎస్ ఒరిగినల్స్ ఫ్యాక్టరీ గా మార్చి అందరూ డెబ్యూ దర్శకులనే పరిచయం చెయ్యాలి అనుకుంటా. నేను డబ్బులు పట్టుకొని రాజమౌళి లాంటి దర్శకులు చుట్టూ తిరిగే కన్నా నేను ఆయన లాంటి డైరెక్టర్స్ ని తయారు చెయ్యాలి అనేదే టార్గెట్.

సంబంధిత సమాచారం :