ఇంటర్వ్యూ : సాయి పల్లవి – “శ్యామ్ సింగ రాయ్” మా రోల్స్ లో చాలా డెప్త్ ఉంటుంది

ఇంటర్వ్యూ : సాయి పల్లవి – “శ్యామ్ సింగ రాయ్” మా రోల్స్ లో చాలా డెప్త్ ఉంటుంది

Published on Dec 21, 2021 2:06 PM IST

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా నుంచి రాబోతున్న మరో భారీ సినిమా “శ్యామ్ సింగ రాయ్”. నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించారు. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం నాని కెరీర్ లోనే మంచి హైప్ తో వస్తుంది. మరి ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా నటించిన నాచురల్ బ్యూటీ సాయి పల్లవి లేటెస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది. మరి తాను ఎలాంటి అంశాలు పంచుకుందో చూద్దాం రండి.

 

చెప్పండి ఈ సినిమాలో రోల్ కి మీకు ఆఫర్ ఎలా వచ్చింది ఎందుకు ఎంచుకున్నారు?

ఒక సినిమాని నమ్మే చేస్తాం, అలాగే స్క్రిప్ట్ చదివినప్పుడు కొన్ని అనిపిస్తాయి అలా ఈ సినిమాలో నా రోల్ ఒక దేవదాసీగా కొత్తగా అనిపించింది. వాళ్ళ సైకాలజీ తో నటించాల్సిన అవసరం ఇందులో ఉంది. అందుకే ఈ రోల్ ని నేను ఎంచుకున్నాను.

 

మీ ప్రతి సినిమాలో డాన్స్ ఇంపార్టెన్స్ పోషిస్తుంది అనుకుంటున్నారా?

నా సినిమాల్లో అయితే లవ్ స్టోరీ కి మాత్రమే డాన్స్ బేస్ గా ఎక్కువ తీసుకున్నారు అనుకుంటున్నాను. శ్యామ్ సింగ రాయ్ లో కూడా అక్కడ సందర్భాన్ని బట్టే డాన్స్ చెయ్యాల్సి వస్తుంది కానీ పల్లవి తో చేయించాలని చేయించలేదు.

 

ఈ సినిమాలో మీ రోల్ కోసం ఏమన్నా రీసెర్చ్ చేసారా మరి?

రీసెర్చ్ అని ఏం కాదు ఆల్రెడీ స్కూల్ లో చదువుకున్నదే కాబట్టి ఒక ఐడియా అయితే నాకు ఉంది. అలాగే సినిమాలో శ్యామ్ సింగ రాయ్ అంటే శ్యామ్ కోసం మాత్రమే సినిమా నడుస్తుంది. అలా ఒక దేవదాసీగా నా పాత్రకి ఎంత ఇంపార్టెన్స్ ఉండాలో అంతే డైరెక్టర్ పెట్టారు.

 

ప్రీ రిలీజ్ లో స్టేజ్ పైనే ఏడ్చేశారు..!

అది జస్ట్ గ్రాటిట్యూడ్ వల్లనే అయ్యింది. ఆరోజు కళని ని ఎంజాయ్ చేస్తూ మొత్తం అంతా చూసి చాలా ఎమోషనల్ అయ్యిపోయాను. దాంతో ఒక్కసారే ఆడియెన్స్ కూడా అలా చేసేసరికి ఇంకా ఎమోషనల్ అయ్యిపోయాను. ఒక హీరోయిన్ గా కాకుండా మా ఇంట్లో ఉండే సాయి పల్లవిలా అయ్యిపోయాను. అందరికీ ఋణ పడిపోయాను అనిపించింది అందుకే కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేసాను.

 

నాని తో మీకిది రెండో సినిమా ఈసారి జర్నీ ఎలా అనిపించింది?

ఇంతకు ముందు మేము చేసిన ఎం సి ఏ లో ఒక 30 శాతం మాత్రమే ఉంటుంది. పైగా లవ్ ట్రాక్ నేను నాలాగా నాని గారు ఆయనలానే ఉన్నట్టు ఉంటుంది. కానీ శ్యామ్ సింగ రాయ్ లో మాత్రం అలా కాదు. రెండు చాలా డిఫరెంట్ గా ఉంటాయి మా ఇద్దరి రోల్స్ లో చాలా డెప్త్ కనిపిస్తుంది.

 

డైరెక్టర్ రాహుల్ కోసం చెప్పండి?

రాహుల్ చాలా క్లారిటీ గా ఉంటారండి. నేను ఏ సీన్ చెయ్యాలి ఎలా చెయ్యాలి అనేవి బాగా తెలుసు. మా ఇద్దరికీ ఫస్ట్ సీన్ ఏమిటంటే సినిమాలో మాకు అదే లాస్ట్ సీన్. దానిని ఎలా చేస్తారో చూద్దామని మాతో చేయించారు. తాను మాత్రం చాలా క్లారిటీ గా ఎప్పుడూ ఉంటారు.

 

ఫైనల్ గా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం చెప్పండి?

ప్రస్తుతం పర్వం రిలీజ్ కి వస్తుంది, తమిళ్ లో కూడా ఒక సినిమా రావడానికి రెడీగా ఉంది. ఇంకా అన్నీ డబ్బింగ్ చేసి మిగతా సినిమాలు స్టార్ట్ చెయ్యాలి అనుకుంటున్నా. వెబ్ కంటెంట్ పై ఇంకా అనుకోవట్లేదు ఇంట్రెస్టింగ్ గా ఏమన్నా వస్తే చేస్తా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు