ఇంటర్వ్యూ : సమంత – ‘యశోద’ ఆడియెన్స్ కి థ్రిల్ ని ఇస్తుంది.

ఇంటర్వ్యూ : సమంత – ‘యశోద’ ఆడియెన్స్ కి థ్రిల్ ని ఇస్తుంది.

Published on Nov 8, 2022 3:56 PM IST


మన తెలుగు సినిమా దగ్గర మంచి డెడికేషన్ ఉన్నటువంటి స్టార్ అండ్ గ్లామరస్ హీరోయిన్స్ లో సమంత కూడా ఒకరు. మరి సమంత ఇప్పుడు భారీ సినిమాలు సహా ఓటిటి లో కూడా పలు షోలు తాను చేస్తూ బిజీగా ఉంది. అయితే తాను నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ చిత్రం “యశోద” ఈ వారం రిలీజ్ కి రెడీ కాగా తన ఆరోగ్యం బాగోలేనప్పటికీ సినిమాకి డబ్బింగ్ చెప్పి ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. మరి తాను సినిమా కోసం, అలాగే ఆరోగ్యం కోసం ఎలాంటి అంశాలు పంచుకున్నారో చూద్దాం.

 

హలో సమంత గారు..ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? చాలా వార్తలు కూడా వస్తున్నాయి

థాంక్యూ.. ఈ మాట అడిగినందుకు! ఇప్పుడు నేను రికవరీ అవుతున్నాను. త్వరలో పరిస్థితులు మెరుగు అవుతాయని ఆశిస్తున్నాను. ఈ క్షణం, నేను ఈ రోజు గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. ఈ రోజు ‘యశోద’ విడుదల గురించి ఎగ్జైట్ అవుతున్నాను. అవును… నేనూ చాలా ఆర్టికల్స్ చూశాను. అయితే… ప్రస్తుతానికి నేను చావలేదు (నవ్వులు). ఆ హెడ్డింగ్స్ అప్రస్తుతం. నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. ఫైట్ చేస్తున్నాను. నేను ఉన్న పరిస్థితిలో అది అంత ప్రాణాంతకం ఏమీ కాదు.

 

ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం మీకు ఎక్కడ నుంచి వస్తోంది?

సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు కొన్ని మంచి రోజులు ఉంటాయి. కొన్ని చెడ్డ రోజులు ఉంటాయి. ఒక్కోరోజు ఇంకొక్క అడుగు కూడా ముందు వేయలేనేమో అనిపిస్తోంది. కొన్ని రోజులు వెనక్కి తిరిగి వస్తుంటే ఇంత దూరం వచ్చానా? అనిపిస్తోంది. (సమాధానం చెబుతూ సమంత భావోద్వేగానికి లోనయ్యారు) చాలా మంది ఎన్నో సవాళ్లతో యుద్ధం చేస్తున్నారు. అంతిమంగా మనమే విజయం సాధిస్తాం.

 

యశోద టీజర్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చాయి, ఆడియెన్స్ రియాక్షన్ కోసం చెప్పండి?

చాలా సంతోషంగా ఉంది. ఎగ్జైట్ అయ్యాను. అదే సమయంలో కొంచెం నెర్వస్ కూడా ఉంది. టీజర్, ట్రైలర్లో మేము చూపించినది నిజమే. సినిమాలో ఏం ఉందో అదే చూపించాం. ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్లకు టీజర్, ట్రైలర్ నచ్చాయి. సినిమా కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను.

 

చెప్పండి ఈ సినిమా ఎలా ఓకే చేసారు?

సాధారణంగా నేను ఏదైనా స్క్రిప్ట్ ఓకే చేయడానికి ఒక రోజు సమయం తీసుకుంటా. కానీ, ‘యశోద’ వెంటనే ఓకే చేశా. నేను విన్న వెంటనే ఓకే చేసేసిన కథల్లో ‘యశోద’ ఒకటి. ‘యశోద’ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. పవర్ ఫుల్ స్టోరీ ఇది. అందుకని, ఎక్కువగా ఆలోచించడానికి ఏమీ లేదు. కథ విన్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. థ్రిల్ అయ్యాను. ప్రేక్షకులు కూడా అదే విధంగా థ్రిల్ అవుతారని, వాళ్ళకూ గూస్ బంప్స్ వస్తాయని ఆశిస్తున్నాను. సినిమాలో అంత పవర్ ఉంది. దర్శకులు హరి, హరీష్ కొత్త కాన్సెప్ట్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.

 

ఇప్పుడు సరోగసీ అనేది కామన్ అయ్యింది. సరోగసీ మీద మీ అభిప్రాయం?

సరోగసీ మీద నాకు బలమైన అభిప్రాయం లేదు. తల్లిదండ్రులు కావాలని అనుకునే వాళ్ళకు అదొక పరిష్కారం మాత్రమే. వాళ్ళ ఆశలకు ఆయువు పోస్తుంది.

 

మీరు డిఫరెంట్ జానర్ సినిమాలు చేశారు. థ్రిల్లర్ సినిమాలు చేయడం ఎలా అనిపించింది?

కథలు వినేటప్పుడు గానీ తర్వాత సినిమాలో క్యారెక్టర్ విషయంలో గానీ… ఇంతకు ముందు చేసిన దానికి డిఫరెంట్‌గా, కొత్తగా ఉండాలని ప్రతిసారీ ఆలోచిస్తాను. అలా ఉండేలా చూస్తాను. ‘యశోద’ కంటే ముందు ‘యు – టర్న్’ చేశా. అది కూడా థ్రిల్లర్. కానీ, ‘యశోద’ చాలా కొత్తగా ఉంటుంది. యాక్షన్ పరంగా కూడా కొత్తగా ఉంటుంది. యాక్షన్ చేయడం ఎంజాయ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ‘ఫ్యామిలీ మ్యాన్ 2’లో రాజీ రోల్ కోసం యాక్షన్ చేశా. నిజం చెప్పాలంటే… యాక్షన్ చేసేటప్పుడు చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాను.

 

యాక్షన్ సీన్స్ కోసం మీరు ఎలాంటి ట్రైనింగ్ తీసుకున్నారు?

యానిక్ బెన్ తో ‘ఫ్యామిలీ మ్యాన్ 2’కి పని చేశా. ఆ క్యారెక్టర్ కోసం కిక్ బాక్సింగ్, బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నాను. ‘యశోద’లో నేను సింపుల్ ప్రెగ్నెంట్ లేడీగా చేశా. ఆ పాత్రకు తగ్గట్టు యాక్షన్ డిజైన్ చేశారు యానిక్ బెన్, వెంకట్ మాస్టర్ ఇద్దరూ ఫైట్స్ అన్నీ రా అండ్ రియల్ గా ఉండేలా చూసుకున్నారు. అదే సమయంలో పాత్రకు తగ్గట్టు ఉండేలా చూశారు. చాలా ప్రిపేర్ అయ్యాను.

 

సినిమాలో చాలా మంది స్టార్ నటీనటులు ఉన్నారు వారితో వర్క్ ఎలా ఉంది?

సినిమాలో నటీనటులు అందరితో పని చేయడం వండర్ ఫుల్ ఎక్స్‌పీరియన్స్. మన చుట్టూ ఎంతో అనుభవం ఉన్న ఆర్టిస్టులు ఉన్నప్పుడు వాళ్ళ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ‘యశోద’లో వివిధ భాషల నటీనటులు ఉన్నారు. ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకునే విషయం ఒకటి ఉంది. మలయాళం యాక్టర్ డైలాగ్ చెప్పే విధానం, తెలుగు యాక్టర్లు చెప్పే విధానానికి వేరుగా ఉంటుంది. అంత మందితో కలిసి నటించడం ఆసక్తికరంగా అనిపించింది. వాళ్ళందరి నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను.

 

మీ ప్రొడ్యూసర్ కోసం చెప్పండి?

సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్ కోసం లోకల్ హోటల్స్, హాస్పిటల్స్ చాలా చూశారు. కానీ, ఏవీ సెట్ కాలేదు. దాంతో భారీ సెట్ వేశారు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ గారు సినిమా గొప్పగా ఉండాలని ఎప్పుడూ తపిస్తారు. అవుట్‌పుట్ గ్రాండ్‌గా ఉండాలని ఖర్చుకు వెనుకాడకుండా తీశారు.

 

పాన్ ఇండియా రిలీజ్ తోనే ఈ సినిమా మీ దగ్గరికి వచ్చిందా?

కథ చూస్తే… కథలో, సినిమాలో గొప్ప ఎమోషన్ ఉంది. ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విధంగా సినిమా ఉంటుందని అర్థమైంది. బిగినింగ్ నుంచి కథలో పొటెన్షియల్ ఉందని మాకు అర్థమైంది. షూటింగ్ చేసేటప్పుడు మా కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. ఎమోషనల్ పాయింట్ కావడంతో అన్ని భాషల ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని, అందరికీ నచ్చుతుందని అనుకున్నాం. ఇప్పుడు ఐదు భాషల్లో విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు, మీడియా ‘పాన్ ఇండియా’ అంటున్నారు. పాన్ ఇండియా హిట్ అవుతుందని ఆశిస్తున్నా.

 

ఈ సినిమాకి ఇతర భాషల్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నారా?

నిజం చెప్పాలంటే… అన్ని భాషల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. డిఫరెన్స్ ఏంటంటే… మైక్రో ట్రెండ్స్. ఒక్కో భాషలో ప్రేక్షకులకు ఒక్కో అంశం నచ్చుతుంది. వాళ్ళ అభిరుచులు కొంచెం వేరుగా ఉంటాయి. అందుకని, ఎవరికి ఏం నచ్చిందో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రక్షిత్ శెట్టి, సూర్య, వరుణ్ ధావన్… ట్రైలర్ విడుదల చేసిన హీరోలు అందరికీ థాంక్స్. వాళ్ళ సపోర్ట్ వల్ల అన్ని భాషల్లో ప్రేక్షకులకు ట్రైలర్ మరింత చేరువ అయ్యింది.

 

డబ్బింగ్ కి వేరే వాళ్ళని కూడా పెట్టొచ్చు కానీ మీరు సెలైన్ పెట్టుకొని మరీ చెప్పారంట?

‘యశోద’కు డబ్బింగ్ చెప్పాలని ముందు నుంచి డిసైడ్ అయ్యాను. ఒక్కసారి నేను కమిట్ అయ్యానంటే… చేయాల్సిందే. ఓ క్యారెక్టర్ చేసేటప్పుడు ఆర్టిస్ట్ ప్రాణం పెట్టారంటే… వాళ్ళే డబ్బింగ్ చెప్పాలని కోరుకుంటారు. తమ వాయిస్ వినిపించాలని అనుకుంటారు. నేను ఇంతే… నాలో ఆ పట్టుదల ఉంది. నాకు మొండితనం ఎక్కువ. సవాళ్లు ఎదురైనప్పటికీ డబ్బింగ్ చెప్పగలిగినందుకు సంతోషంగా ఉంది.

 

ప్రస్తుతం మీ హెల్త్ గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతోంది. అభిమానులకు ఏం చెబుతారు?

వాళ్ళు చూపిస్తున్న ప్రేమ, అభిమానం, మద్దతుకు థాంక్స్. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. ఇదొక యుద్ధం. ఆ యుద్ధంలో పోరాటం చేయడానికి మీరందరూ చూపిస్తున్న ప్రేమ, మద్దతే కారణం.

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు