ఇంటర్వ్యూ : శేఖర్ కమ్ముల – “లవ్ స్టోరీ” ని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టరు.

ఇంటర్వ్యూ : శేఖర్ కమ్ముల – “లవ్ స్టోరీ” ని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టరు.

Published on Sep 20, 2021 2:09 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ ఆడియెన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “లవ్ స్టోరీ”. మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తీసిన ఈ చిత్రంలో నాగ చైతన్య మరియు సాయి పల్లవి లు నటించారు. మరి అనేక సార్లు వాయిదా తర్వాత ఇప్పుడు ఎట్టకేలకు సందడి చేసేందుకు ఈ సినిమా రెడీ అవుతుంది. మరి ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి దీనితో సినిమాపై మరిన్ని విషయాలు ఏం చెప్పారో చూద్దాం.

మీ అన్ని సినిమాలు కూడా మంచి ఫీల్ గుడ్ గా ఉంటాయి మరి ఇది కూడా అలానే ఉంటుందా?

అవును ఇది కూడా ఫీల్ గుడ్ గానే ఉంటుంది. ఒక అమ్మాయి, అబ్బాయికి మధ్య ఉండే రొమాన్స్, మ్యూజిక్ అన్నీ కూడా ఉంటాయి వాటితో పాటుగా మరో కీలక పాయింట్ ఈ సినిమాని మరో స్థాయిలో పెట్టేలా ఉంటుంది అదే ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్ లా ఉంటుంది అందుకు ఇది మంచి లవ్ స్టోరీలా ఉంటుంది.

ఈ సినిమాతో ఇంతవరకు ఎవరూ చెప్పని అంశాన్ని చెప్తున్నా అన్నారు అసలు ఏంటి అది?

అది ఏంటంటే సినిమాలో రెండు పాయింట్స్ తీసుకున్నాం ఒకటి కుల వివక్షత అనేది అబ్బాయి విషయంలో ఇంకొకటి ఆడ మగ తారతమ్యంపై.. ఈ రెండు విషయాల పై సినిమాలో బలంగా చూపించడం జరిగింది. అంటే నార్మల్ లవ్ స్టోరీస్ నా ఫిదా లా కాకుండా సొసైటీ నుంచే వచ్చే ఇబ్బందులు అలా ఆ టైప్ లో తీసాం.

లీడర్ తర్వాత మళ్ళీ సోషల్ ఇష్యూ పై సినిమా తీశారు దానికి దీనికి ఎలా ఉంటుంది?

లీడర్ లో అంటే అది అవినీతిపై చేద్దాం అనుకున్నాను అందులో కులం కోసం పెట్టిన సీన్ చిన్న పార్ట్ వరకు మాత్రమే కానీ దానిపైనే ఒక ఫుల్ ఫ్లెడ్జ్ సినిమా చేద్దామని ఎప్పుడు నుంచో ఉంది. సమాజంలో ఎప్పుడూ ఏదొక సమస్య ఉంటూనే ఉంటుంది అలా చూసి చూసి ఫైనల్ గా రెండు బలమైన పాయింట్స్ తో లవ్ స్టోరీ లో చూపించడం జరిగింది.

లాక్ డౌన్ మూలాన సినిమా డిలే అవ్వడం చాలా సార్లు వాయిదా అవుతూ ఉండడం జరిగింది దీనిపై చెప్పండి..

లాక్ డౌన్ వచ్చే టైం ఇంకా జస్ట్ కొన్ని రోజులు షూట్ మాత్రమే బ్యాలన్స్ ఉంది కంప్లీట్ చెయ్యడానికి టైం కోసం చూస్తున్నాం ఆ గ్యాప్ లో ఎడిటింగ్ కంప్లీట్ చెయ్యాలి అనుకున్నాం, అది కూడా పూర్తిగా ఆ టైం లో చేయలేకపోయాం. తర్వాత మళ్ళీ అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇండస్ట్రీలో ఫస్ట్ షూట్ కూడా మేమే స్టార్ట్ చేసాం అలా కొన్నాళ్ళు చేసి రిలీజ్ చేద్దామన్న టైం లో రెండో వేవ్ వచ్చేసింది. నిజానికి ఆ టైం లో అయితే వేరే నిర్మాతలు ఖచ్చితంగా సినిమా ఓటిటికి ఇచ్చేసేవాళ్ళు. కానీ మా నిర్మాతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సినిమాని థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని ఉన్నారు. వారికి కూడా థియేటర్స్ ఉన్నాయని కాదు, వారికి తెలుసు సినిమా అంటే థియేటర్స్ లోనే చూడాల్సింది అని అందుకే ఇన్నాళ్లు ఆగారు. నిజంగా వారు దొరకడం నాకు ఇంకా బలం వచ్చినట్టు అయ్యింది. ఈ గ్యాప్ లోనే చాలా అనుమానాలు, సినిమాలు రిలీజ్ అవుతున్నాయి మేము చెయ్యాలా వద్దా అని సందేహాలు నేను తీసుకున్న పాయింట్స్ కూడా మామూలువి కాదు అందరినీ మెప్పించాలి అనేది ఒకటి ఇలా ఎన్నో అనిపించాయి ఇక ఫైనల్ ఈ సెప్టెంబర్ 24 కి ఈ సినిమాని తీసుకురావాలని ఫిక్స్ అయ్యాం.

నాగ చైతన్య తో తెలంగాణా కుర్రాడిలా చూపించడానికి కష్టపడ్డారా?

తానొక్కడే కాదు మేము కూడా కష్టపడ్డాం, సినిమాలో తన డైలాగ్స్ నుంచి మ్యానరిజమ్స్ వరకు ప్రతీ అంశంలో కూడా డబ్బింగ్ లో ప్రతి పదం సినిమా షూట్ లో కూడా నా టీం అంతటితో చాలా వర్క్ చేసిన తెలంగాణా స్లాంగ్ లో చైతూని ముందు సినిమాల్లో చూపించని విధంగా ట్రై చేసాం. ఖచ్చితంగా చాలా నమ్మకంగా చెప్తున్నాం ఈ సినిమాలో చాలా కొత్త నాగ చైతన్యని అందరూ చూస్తారు.

మీ సినిమాల్లో హీరోయిన్ రోల్స్ కాస్త డామినేటింగ్ ఉంటాయి మరి ఈ సినిమాకి సాయి పల్లవినే తీసుకోడానికి కారణం ఏంటి?

కారణం ఏంటి అంటే ఆమె ఒక మంచి పెర్ఫామార్ అంతే అంతకు మించి ఏం లేదు.. చాలా బాగా యాక్ట్ చేస్తుంది ఫిదా నుంచి ట్రావెల్ అయ్యాం కాబట్టి తన కోసం బాగా తెలుసు అందుకే ఈ సినిమాకి తీసుకున్నాం. ముందు ఫిదా లో అయితే తన రోల్ ఒకలా ఉంటుంది కానీ ఈ సినిమాలో కంప్లీట్ దానికి వ్యతిరేఖంగా కనిపిస్తుంది. తనలోనే తాను మధనపడుతూ స్ట్రగుల్ అవుతూ ఉండేలా కనిపిస్తుంది. చాలా షేడ్స్, లెటర్స్ ఉన్న రోల్ అది దానిని తను చాలా కస్టపడి చేసింది.

మీ సినిమాలతో చాలా మంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ ని ఇంట్రో చేశారు మరి ఈ సినిమా సంగీతం కోసం చెప్పండి?

రెహమాన్ దగ్గర వర్క్ చేసాడు అని కాదు కానీ పవన్ ఫ్రెష్ మ్యూజిక్ ఇస్తాడు అని అనిపించింది అందులోని లోకల్ అబ్బాయి కావడంతో నమ్మకం ఉంది కానీ తాను మాత్రం నేను పెట్టుకున్న అంచనాలకి మించే మ్యూజిక్ ఇచ్చాడు. ఈ ప్యాండమిక్ టైం లో ఏదన్నా మంచి మాకు జరిగింది అంటే అది ఈ సినిమా మ్యూజిక్ హిట్టవడమే అని చెప్పాలి. తాను మాత్రం సూపర్ జాబ్ ఇచ్చాడు. ఖచ్చితంగా అబ్బాయికి మంచి ఫ్యూచర్ ఉంటుంది.

మీ సినిమాలు అన్నీ రిపీటెడ్ గా చూసేలా ఉంటాయి ఈ సినిమా కూడా ఆ రేంజ్ లో ఉంటుందా?

అవును ఖచ్చితంగా ఉంటుంది. వాటి లానే మళ్ళీ మళ్ళీ చూసేలా ఉంటుంది. ఇంకా ఈ సినిమాలో ఇంకో పాయింట్ ఉంటుంది. అంటే ఓ కష్టం ఉంటుంది అది డెఫినెట్ గా ప్రతీ ఒక్కరికీ తలిగేలా ఉంటుంది అది ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఈ సినిమాని వదిలిపెట్టరు.

మరి ఈ లవ్ స్టోరీ కూడా చరిత్రలో నిలిచేదిలా ఉంటుందా?

నేనే కాదు ఎవరైనా సరే తమ సినిమాలు చరిత్రలో నిలిచేలా ఉండాలనే తీస్తారు. ఇందులో కూడా ఆ షేడ్స్ ఉన్నాయి. కొన్ని అంచనాలు ప్రతీ ఒక్కరు పెట్టుకుంటారు మొన్న నాగార్జున గారు ప్రేమ్ నగర్ సినిమా రిలీజ్ రోజున ఇది కూడా అవుతుంది అని పెట్టారు ఆ సినిమా సక్సెస్ లో నా సినిమా ఒక 30 పర్సెంట్ అందుకున్నా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. నేను తీసిన లీడర్ సినిమా అప్పుడు అందరు మామూలుగానే చూసారు కానీ ఇప్పుడు దాని కోసం ఇంకా మాట్లాడుకుంటారు అలానే నేను ప్రతీ సినిమాని సన్నివేశాన్ని ఇంతకు మించి ఎవరూ తియ్యలేరు అన్నట్టుగా చెయ్యాలని ప్రయత్నిస్తా. ఒక పదేళ్లు తర్వాత నా పిల్లలకి కూడా గర్వంగా సినిమా చూపించగలగాలి అనుకుంటా.

సినిమాలో రెండు సమస్యలు అంటున్నారుగా వాటికి పరిష్కారం కూడా చూపించారా మరి?

ఇప్పుడు నేను చెప్తున్నా అంశం అనేది ఇప్పుడు నుంచి ఉన్నది కాదు కదా ఎన్నో శతాబ్దాలు నుంచి ఉంది అప్పుడు నుంచి దొరకని పరిష్కారం ఇప్పుడు దొరుకుతుంది అనుకుంటున్నారా? ఒక తప్పు జరిగినప్పుడు తప్పు అని ఎన్ని సార్లు చెప్తాం? ఇప్పుడు నిర్భయ అంశం ఉంది దాని తర్వాత ఎన్ని ఘటనలు జరిగాయి? ఇవన్నీ మనుషులు జీవితంలో అలవాటు అయ్యిపోతున్నాయి అదే నా బాధ. ఇంకా ఎంత కాలం అని చెప్తాము. ఏదో పెద్ద సునామి వచ్చేసి అందరూ కొట్టుకుపోయి కొత్త మనుషులు పుడితే కానీ ఇవన్నీ మారుతాయేమో..

‘లీడర్’ సినిమాకి సీక్వెల్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా?

అవును ఉంది ఆ సినిమా సీక్వెల్ ఖచ్చితంగా చేస్తా, కానీ ఇప్పుడు కాదు అదే పాత్రలతో రానా ఖచ్చితంగా ఉంటాడు. ఆ పాత్రలతోనే తోనే నడిచే విధంగా సీక్వెల్ ని చేస్తాను.

మరి మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం చెప్పండి?

నెక్స్ట్ ధనుష్ తోనే ఉంది తమిళ్, తెలుగు ముందు అనుకున్నాం ఇక ఎలాగో ఓటిటితో అందరికీ మంచి రీచ్ వచ్చింది కాబట్టి హిందీలో కూడా ప్లాన్ చేస్తున్నాం. పైగా ధనుష్ కి కూడా హిందీలో రీసెంట్ గా మంచి మార్కెట్ వచ్చింది. నా ముందు సినిమాల్లా కాకుండా ఇది థ్రిల్లర్ టైప్ లో ఉంటుంది, పైగా కథ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది అందుకే పాన్ ఇండియన్ సినిమాలా ప్లాన్ చేసాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు