ఇంటర్వ్యూ : శ్రీకాంత్ – ‘అఖండ’ లో నా రోల్ ని ఎవరూ ఊహించి ఉండరు

Published on Sep 30, 2021 4:04 pm IST

ఈ వారాంతం థియేటర్స్ లో సందడి చెయ్యడానికి రెడీ అవుతున్న పలు చిత్రాల్లో యంగ్ హీరో సుమంత్ అశ్విన్ మరియు నటుడు శ్రీకాంత్ సహా భూమికలు కీలక పాత్రల్లో నటించిన చిత్రం “ఇదే మా కథ సినిమా” కూడా ఒకటి. మరి ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో శ్రీకాంత్ లేటెస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి ఇందులో తాను సినిమాకి సంబంధించి ఎలాంటి విషయాలు పంచుకున్నారో చూద్దాం.

చెప్పండి ఈ సినిమా ట్రావెల్ ఎలా స్టార్ట్ అయ్యింది?

ముందుగా డైరెక్టర్ గురు వచ్చి ఈ సినిమా కాన్సెప్ట్ చెప్పాడు. కొంతమంది కలిసి రోడ్ జర్నీ, వారికున్న సమస్యలు, సంతోషాలు ఇవన్నీ ఎలా పంచుకున్నారు అనే దానిమీద ఉంటుందని చెప్పాడు. ఈ బైక్ రైడింగ్ కాన్సెప్ట్ చెప్పినప్పుడే ఇలాంటి ఓ కాన్సెప్టా అనుకున్నాను ఆ తర్వాత చెప్పాక నాకు కూడా యూత్ ఫుల్ గా మళ్ళీ యూత్ ని టచ్ చేసినట్టు ఉంటుంది అని ఓకే చెప్పేశా.

సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ ఏమన్నా తీసుకున్నారా?

నాకు బైక్స్ అంటే నిజంగా చాలా ఇష్టం. ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి కూడా నేను బైక్స్ నే ఎక్కువగా వాడేవాడినికి ఎక్కువ దూరాలు అయినా కూడా బైక్ లోనే వెళ్ళేవాడిని. తర్వాత భాద్యతలు పెరగడంతో దూరం అయ్యాను. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం చాలా ఎంజాయ్ చేశాను నేను. మళ్ళీ పాత రోజులు అన్నీ గుర్తు చేసుకొని చాలా ఎంజాయ్ చేశాను.

నిజమైన బైకర్స్ పై కథలు చెప్పినపుడు ఏమనిపించింది?

బయట నిజమైన బైకర్స్ కథలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి వారి జర్నీ లో ఎన్నో ఎమోషన్స్ ఈ జర్నీలో ఉంటాయి. నాకు నిజంగా జరిగిన అనుభవంలో చాలా మంది చెప్పారు. ఇదే జర్నీలో ట్రూప్స్ గా అన్నీ పంచుకుంటూ వెళ్లి లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ అయ్యినవాళ్లు ఉన్నారు. ఎన్నో దెబ్బలు తిని కాళ్ళు విరగ్గొట్టుకున్నారు కూడా ఉన్నారు. అయినా కూడా దీనిని వాళ్ళు వదల్లేదు.

మరి ఇది చాలా రోజులకి మీకు ఛాలెంజింగ్ రోల్ అని చెప్పొచ్చా?

ఛాలెంజింగ్ అని కాదు కానీ నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నలుగురు స్టోరీస్ కూడా చాలా బాగుంటాయి. సినిమా కూడా చూసాను కాబట్టే నేను ఇంత కాన్ఫిడెన్స్ గా ఉన్నాను.

భూమిక గారితో వర్క్ ఎలా అనిపించింది?

మేము ఇద్దరం కూడా ఇండస్ట్రీలో ఎప్పుడు నుంచో ఉన్నా కూడా కలిసి వర్క్ చెయ్యడం ఈ సినిమాతోనే జరిగింది. చాలా మంచి ఎక్స్ పీరియెన్స్ ఈ సినిమాతో వచ్చింది. ఇంతకు ముందు ఒకలా చూసి ఈ సినిమాకి టోటల్ గెటప్ నే మార్చి చూడడం కొత్తగా అనిపించింది. ముందు ఇలాంటి సినిమా అసలు ఆమె ఓకే చెప్తుందా లేదా అనుకున్నాం కానీ కథ విన్నాక తానే ఈ సినిమా చేస్తాను అని ఒప్పుకున్నారు.

మీరు పెళ్లి సందడి చేశారు, ఇప్పుడు మీ అబ్బాయి రోషన్ సీక్వెల్ చేస్తున్నాడు, పైగా ఇద్దరు కూడా ఇప్పుడు ప్రమోషన్స్ లోనే బిజీగా ఉన్నారు ఎలా అనిపిస్తుంది?

అవును రెండు సినిమాల ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాం. తన సినిమాపై అనౌన్సమెంట్ రేపు వస్తుంది అనుకుంటా.. నేను అయితే రోషన్ అప్పుడే హీరోగా ఎందుకు ఇంకో రెండు మూడేళ్లు ఆగాక చేద్దాం అనుకున్నాను. యాక్టింగ్ లో డిప్లమా చేసి వచ్చాక ప్రభుదేవాతో సల్మాన్ సినిమా దబాంగ్ 3 కి అసిస్టెంట్ డైరెక్టర్ గా సినిమా మొత్తం చేసాడు. తన ఎక్స్ పీరియన్స్ కోసం వెళతాను అనుకునేవాడు నేను హెల్ప్ చేసేవాడిని అంతే.

‘అఖండ’ లో విలన్ గా చేస్తున్నారటగా..

అవును అందులో విలన్ గానే చేస్తున్నా.. చాలా కొత్తగా కనబడతా ఆ సినిమాలో అసలు ఎవరూ కూడా ఊహించరు అలా ఉంటానని. ఫ్రెష్ గెటప్ లో ఉంటుంది. ముంబై నుంచి ఎన్నో డిజైన్స్ చేసి ఫైనల్ గా ఒకటి బోయపాటి ఫిక్స్ చేశారు. చాలా రఫ్ గా క్రూరంగా ఉంటుంది నా రోల్. ఆడియెన్స్ తిడతారేమో అని కూడా అన్నా. కానీ ఫైనల్ గా అంతా హ్యాపీ.

బాలయ్య గారు మళ్ళీ ఇలాంటి రోల్ చెయ్యొద్దన్నారట?

అవును, అంటే ఆ రేంజ్ లో ఈ రోల్ ఉంటుంది. ఇంతకు ముందు బాలయ్యతో తమ్ముడుగా శ్రీరామ రాజ్యంలో చేశాను. ఇప్పుడు కంప్లీట్ డిఫరెంట్ గా పవర్ ఫుల్ రోల్ ఇది. ఇక దీని తర్వాత భయంకరంగా ఆఫర్స్ వస్తాయి అందుకే జాగ్రత్తగా ఉండమని నాకు చెప్పారు. అది జాగ్రత్త చెప్పడం మాత్రమే.

మీ సినిమా బైకర్స్ మీదే.. అలాగే రిపబ్లిక్ తో కూడా వస్తుంది. ఇంకా సాయి తేజ్ కూడా బైక్ ప్రమాదం జరిగింది దీనిపై ఏం చెప్పాలి అనుకుంటున్నారు?

సాయి ధరమ్ తేజ్ దేవుడి దయవల్ల సేఫ్ గా ఉన్నాడు. బైక్ పై అనేవి ఊహించని విధంగా జరుగుతాయి. కొన్ని కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతాయి అంతే కావాలని ఎవరూ చెయ్యరు. తేజ్ కూడా బాగా తెలుసు నాకు క్రికెట్ ఆడేటప్పుడు చాలా బాగా మాట్లాడుకునే వాళ్ళం. అతని మంచితమే తనని కాపాడింది.

 

సంబంధిత సమాచారం :