ఇంటర్వ్యూ : సుడిగాలి సుధీర్ – “గాలోడు” లో రష్మీని అందుకే తీసుకోలేదు..

ఇంటర్వ్యూ : సుడిగాలి సుధీర్ – “గాలోడు” లో రష్మీని అందుకే తీసుకోలేదు..

Published on Nov 17, 2022 3:55 PM IST

తెలుగు స్మాల్ స్క్రీన్ సెన్సేషన్ సుడిగాలి సుధీర్‍‍‍‍ కోసం తెలియని వారు ఉండరు. మరి తాను టెలివిజన్ నుంచి సిల్వర్ స్క్రీన్ పై కూడా హీరోగా పరిచయం అయ్యి సక్సెస్ అయ్యాడు. మరి ఇప్పుడు తాను హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మాస్, యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ “గాలోడు”. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా న‌టిస్తోంది. రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌కృతి స‌మ‌ర్ప‌ణ‌లో సంస్కృతి ఫిలింస్ నిర్మిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, ట్రైలర్‌లకు విశేషమైన స్పందన లభించింది. ఈ చిత్రం నవంబర్ 18న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలవుతోన్న సందర్భంగా హీరో సుధీర్ మీడియాతో ముచ్చటించారు. మరి తాను ఎలాంటి విషయాలు పంచుకున్నాడో చూద్దాం.

 

చెప్పండి ఈ సినిమా ఎలా వచ్చింది, ఎందుకు ఓకే చేశారు?

గాలోడు కథ నాకు చాలా నచ్చింది. నా పాత్ర డిజైన్ చేసిన‌ తీరు కూడా బాగుంటుంది. అందుకే సినిమాను ఒప్పుకున్నాను. ఊర్లో పనీ పాట లేకుండా తిరిగే వ్యక్తి సమస్యల్లో పడి సిటీకి రావడం, మళ్లీ సిటీలో ఇంకో సమస్యలో చిక్కుకోవడం, ఈ మధ్యలో ప్రేమ కథ ఉంటుంది.. చిన్న చిన్న టిస్టులతో మంచి మాస్ కమర్షియల్ అంశాలతో ఈ సినిమా న‌డుస్తుంది.

 

సినిమా ఎలా ఉండబోతుంది?

గాలోడు కొత్త కథ అని చెప్పను గానీ.. మంచి మాస్ కమర్షియల్ అంశాలన్నీ ఉంటాయి. చిన్నతనం నుంచి మాస్ సినిమాలంటే ఇష్టం, చిరంజీవి, రజనీకాంత్ గారి సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. మా మాస్ ఆడియెన్స్‌ని మెప్పించేందుకు ఈ సినిమాను చేశాను.

 

సినిమా టైటిల్ ముందే ఇది అని ఫిక్స్ చేసారా?

కథకు తగ్గట్టుగానే ఈ సినిమా టైటిల్‌ను పెట్టాం. కాలేజ్‌లో గాలోడు చేష్టలు చేస్తుంటాడు. ఈ పాత్రను చూస్తేనే గాలోడులా అనిపిస్తుంది. కొన్ని సీన్లు నేను సుధీర్‌లా ఆలోచించి.. వద్దని అనేవాడ్ని. కానీ గాలోడు అలానే చేస్తాడు అని మా డైరెక్టర్‌ చెప్పేవారు.

 

సుడిగాలి సుధీర్ అంటే కామెడీ ఇమేజ్.. దాని నుంచి మాస్ లోకి వచ్చారు జనం చూస్తారు అని నమ్మకం ఉందా?

సుధీర్ అంటే కామెడీ ఇమేజ్ ఉంది. మాస్ ఆడియెన్స్‌కి కూడా సుధీర్ అంటే ఇష్టమే. పూర్తి కమర్షియల్ సినిమా చేయాలనే ఉద్దేశ్యంతోనే గాలోడు చేశాను. ప్రయోగాలు చేస్తుండాలని అందరూ చెబుతుంటారు. ఇమేజ్ మార్చే సినిమా వస్తే ప్రయత్నం చేయాలి. జనాలు చూస్తారా? లేదా? అన్నది తరువాత. కానీ మనం మాత్రం ప్రయత్నం చేయాలి.

 

హీరో, ఎంటర్టైనర్ రెండిట్లో ఎలా ఉండాలి అనుకుంటున్నారు?

హీరోగా కంటే నేను ఎంటర్టైనర్ అని అనిపించుకునే దానిలో నాకు ఎక్కువ సంతోషం ఉంటుంది. కమెడియన్, హీరో అనిపించుకోవాలని నాకు లేదు.

 

మరిన్ని మాస్ సినిమాలు మీ నుంచి రావచ్చా?

నాకు మాస్ జానర్ అంటే ఇష్టం. ట్విస్టులుండే కథలంటే కూడా ఇష్టమే. కథ నచ్చితే సినిమా చేస్తాను.

 

మీకు అసలు సినిమాల్లో హీరోగా ఛాన్స్ లు ఎప్పుడు నుంచి స్టార్ట్ అయ్యాయి?

ఢీ షో తరువాతే సినిమా అవకాశాలు వచ్చాయి. అక్కడ డ్యాన్సులు, మ్యాజిక్, కామెడీ చేయడంతో సినిమా ఆఫర్లు వచ్చాయి. ట్రై చేద్దామని కొంత మంది వచ్చారు. ఎదుటివాళ్ళు నన్ను నమ్మినప్పుడు.. నాపై నాకు కూడా నమ్మకం ఉండాలి కదా? అని సినిమాలను అంగీకరించాను. అలా అని సినిమాలే కాదు.. బుల్లితెరపై కూడా షోలు చేస్తుంటాను.

 

ఈ సినిమాకి రష్మీ గారిని అప్రోచ్ అవ్వలేదా?

ముందుగా ఈ కథను రష్మీ గౌతమ్ గారికే చెప్పారు. ఆమె డేట్స్ కుదరలేదు. మేం ఇద్దరం కలిసి చేయాలని అనుకుంటున్నాం. మంచి కథ దొరికితే మాత్రం కచ్చితంగా చేస్తాం.

 

సిల్వర్ స్క్రీన్ ఇండస్ట్రీలో తేడా ఏమన్నా గమనించారా?

ఇండస్ట్రీలో అందరూ నన్ను ఫ్యామిలీలా చూస్తారు. టీవీ ఆర్టిస్ట్ అన్న కోణంలో నన్ను చూడలేదు. వారిలో ఒకరిలానే నన్ను చూస్తుంటారు.

 

రష్మీ, మీ మధ్య కెమిస్ట్రీ కోసం చెప్పండి

ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అంటే నాకు అంతగా ఇష్టం ఉండదు. రష్మీ గారికి నాకు ఎందుకు అలా కుదిరిందంటే.. మేం ఇద్దరం పట్టుకోం.. ముట్టుకోం. కళ్లతోనే మా భావాలు చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాం. ఆన్ స్క్రీన్ మీద రొమాన్స్ మాత్రం వద్దని చెబుతాను. కానీ డైరెక్టర్‌కు నేను చెప్పే పొజిషన్‌లో లేను. ఆ స్థాయికి వచ్చినప్పుడు మాత్రం కచ్చితంగా అలాంటివి వద్దని చెబుతాను.

 

మళ్ళీ “జబర్దస్త్” రీఎంట్రీ ఉంటుందా?

జబర్దస్త్ స్టేజ్‌ను మిస్ అవుతుంటాను. కానీ నేను ఆ గ్యాప్ అడిగి తీసుకున్నదే. ఆరు నెలలు బ్రేక్ తీసుకుంటాను అని చెప్పా. ఇప్పుడు వచ్చేందుకు రెడీగా ఉన్నాను అని చెప్పా.

 

గాలోడు ట్రైలర్ రెస్పాన్స్ చూసాక మీకేం అనిపించింది?

గాలోడు టీజర్, ట్రైలర్ వచ్చిన తర్వాత.. చాలా మంది ప్రశంసలు కురిపించారు. ఇన్నాళ్లకు ఓ సినిమా చేసినట్టు ఉంది.. హీరోగా అనిపించింది అని చాలామంది అన్నారు. అదే నాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. రాం ప్రసాద్ గారి కెమెరా పనితనం, భీమ్ గారి సంగీతం, మా దర్శక నిర్మాత రాజ‌శేఖ‌ర్ రెడ్డి వల్లే ఇదంతా సాధ్యమైంది. ఈ సినిమా కోసం ప్రతీ ఒక్కరూ రక్తం ధారపోసి పని చేశారు.

 

ఇక ఫైనల్ గా మీ “గాలోడు” కోసం ప్రేక్షకులకి ఏం చెప్తారు?

ఇప్పటి వరకు రకరకాల సినిమాలు చూశాం. కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు చూశాం. కానీ ఇలాంటి మాస్ ఆడియన్స్ పక్కా మాస్ చిత్రాలను మిస్ అవుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ గాలోడు చిత్రం. ఈ చిత్రం కచ్చితంగా మాస్ ఆడియెన్స్‌ను నిరాశపర్చదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు