ఇంటర్వ్యూ : వరుణ్ తేజ్ – “గని” సినిమాకి అందుకే ఎక్కువ భాద్యత తీసుకున్నాను

ఇంటర్వ్యూ : వరుణ్ తేజ్ – “గని” సినిమాకి అందుకే ఎక్కువ భాద్యత తీసుకున్నాను

Published on Apr 6, 2022 7:03 PM IST

మెగా ఫ్యామిలీ నుంచి పరిచయం అయ్యిన యంగ్ హీరోస్ లో ఎప్పటికప్పుడు సరికొత్త కాన్సెప్ట్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసే హీరో ఎవరన్నా ఉన్నారు అంటే అది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అని చెప్పాలి. అలా ఇప్పుడు తాను హీరోగా నటించిన మరి ఇంట్రెస్టింగ్ సినిమా “గని” రిలీజ్ తో చాలా కాలం తర్వాత థియేటర్స్ లోకి వస్తున్నాడు. మరి ఈ రిలీజ్ టైం లో తాను ఓ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది దీనితో తాను ఎలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడో చూద్దాం.

చెప్పండి ఈ డైరెక్టర్ తో సినిమా ఎలా ఓకే చేశారు? కారణం ఏంటి?

నాకు కిరణ్ చాలా కాలం నుంచి తెలుసు, నేను శ్రీను వైట్ల గారితో మిస్టర్ సినిమా చేసినప్పుడు తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. అప్పుడు మా ఇద్దరి పరిచయం స్టార్ట్ అయ్యింది. అప్పుడు తన వర్క్ నచ్చి నా “తొలిప్రేమ” సినిమాకి పెట్టించుకున్నాను. వెంకీ కొత్త డైరెక్టర్ అలాంటప్పుడు ఎంతో అనుభవం ఉన్న కిరణ్ అయితే బాగుంటుంది అని ఆ సినిమాకి పెట్టించాను. అలా రోజు నా దగ్గరకి ఒక కథ ఉందని చెప్పాడు. సో అలా ఈ సినిమా ఓకే అయ్యింది.

ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఐడియా మీదే అంటగా?

హాలీవుడ్ లో చాలా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలు ఉన్నాయి. మన దగ్గర హిందీలో కూడా ఉన్నాయి. అలాగే కళ్యాణ్ బాబాయ్ తమ్ముడు సినిమా గాని శ్రీహరి గారిది ‘భద్రాచలం’ గాని చాలా ఇష్టం నాకు. మంచి జాన్రా ఇది మన దగ్గర ఎందుకు తియ్యట్లేదు అని నేను సజెస్ట్ చేశాను అంతే. తనకి ఐడియా నచ్చింది ఇక మిగతా అన్ని పనులు తానే చూసుకున్నాడు.

ఈ సినిమాకి మీరే ఎక్కువ భాద్యత తీసుకున్నారని అంటున్నారు దీనిపై చెప్పండి?

అంటే ఈ సినిమాకి డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ ఇద్దరూ కొత్తే కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ భాద్యత తీసుకున్నాను. కొన్ని చోట్ల నాకు అనిపించినా సజెషన్స్ మాత్రమే చేశాను. ఎక్కడైనా సీన్ కోసం మాట్లాడుకునేవాళ్ళం నచ్చితే చెప్పేవాడిని లేకపోతే మళ్ళీ మార్చేవాడు అలా కూర్చున్నాం తప్ప ఇంకేం లేదు. సిద్దు, బాబీ లు కూడా మా కజిన్స్ కాబట్టి డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా చూసుకోవాలి అనుకునేవాడిని.

ఇలాంటి సినిమాలకి బయట ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు?

నిజానికి అయితే అసలు ఇంత కష్టంగా ఉంటుంది అని నేనెప్పుడూ అనుకోలేదు. మొదటి సారి బాడీ మైంటైన్ చెయ్యడం ఇవేవి చెయ్యలేదు జస్ట్ బాక్సింగ్ వరకే అనుకున్నాను. కానీ తర్వాత ఇందులో చాలా ఉంటాయని తెలిసింది. సో అలా కష్టపడాల్సి వచ్చింది. కష్టం అయినా ఇష్టం గానే చేశాను కాబట్టి ఏమీ అనిపించలేదు.

సినిమా చాలా సార్లు పోస్ట్ పోన్ అయ్యింది మీకెలా అనిపించింది ఆ టైం లో?

ఈ సినిమాని మేము స్టార్ట్ చేసినప్పుడే ఎప్పుడు రిలీజ్ చేస్తామో అనేది కూడా అనౌన్స్ చేసేసాము. కానీ ఫస్ట్ డేట్ మిస్ అవ్వడంతో చాలా ఫ్రస్ట్రేషన్ అనిపించింది. ఇంకా హీరోయిన్ కి కూడా ఇదే ఫస్ట్ సినిమా ఆ అమ్మాయి పాపం మూడేళ్లు ఆగాల్సి వచ్చింది. తర్వాత డిసెంబర్ అనుకున్నాం, తర్వాత జనవరి ఇలా ఆగుతూ వచ్చింది. ఇపుడు అయితే అంత ఇబ్బందిగా ఏం లేదు. కాకపోతే చాలా కస్టపడి చేసాం త్వరగా రిలీజ్ అయ్యి అందరూ మెచ్చుకుంటే చూడాలి అనిపించింది.

ఉపేంద్ర గారితో వర్క్ కోసం చెప్పండి?

ఉపేంద్ర గారితో వర్క్ చేసేటప్పుడు నేనెప్పుడు ఆయన్ని డామినేట్ చెయ్యాలని గాని ఇంకా ఎక్కువ చెయ్యాలని ఎప్పుడూ అనుకోలేదు. నా సీన్ పేపర్ ఇస్తే అది బెటర్ గా ఎలా చెయ్యాలా అని మాత్రం అనుకునే వాడిని. ఇంకా ఫస్ట్ టైం ఉపేంద్ర గారిని కలిసినప్పుడు అయితే చాలా షాక్ అయ్యాను. ఎప్పుడో సినిమాల్లో చూసినప్పుడు మంచి రెబల్ గా కనిపించే ఆయన బయట మాత్రం కామ్ గా అందరిని ఎంతో గౌరవంగా చూసేవారు. సినిమాలో ఫెంటాస్టిక్ పెర్ఫామెన్స్ ఇచ్చారు.

థమన్ ఇచ్చిన స్కోర్ కోసం చెప్పండి?

థమన్ ని ఈ సినిమాకి తీసుకోడానికి కారణమే తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం. ఈ సినిమాలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి వాటి కోసం సినిమాలో ఫైట్స్ కి గాని ఇంట్రెస్టింగ్ స్కోర్ ఉంటుంది. వాటిపై తాను చాలా స్టడీ చేసి మంచి స్కోర్ ని అందించాడు.

మల్టీ స్టారర్స్ ఇంకా ఎవరితో చెయ్యాలి అనుకుంటున్నారు.?

కథ బాగుంటే ఎవరితో అయినా చేస్తాను. నాకు తేజ్ తోని నితిన్ తో మంచి పరిచయం ఉంది కాబట్టి వాళ్ళతో అయితే చెయ్యడానికి ఇష్టపడతాను.

ఫైనల్ గా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?

ప్రస్తుతం “ఎఫ్ 3” ఉంది దానితో పాటు ప్రవీణ్ తో సినిమా ఒకటి. ఇంకా రెండు మూడు కథలు విన్నాను వాటిపై కూడా ముందు క్లారిటీ వస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు