ఇంటర్వ్యూ : విక్టరీ వెంకటేష్ – “దృశ్యం 3” కి ఇంకా ఎలాంటి ప్లాన్స్ లేవు

Published on Nov 18, 2021 5:00 pm IST

టాలీవుడ్ అందరి ఫేవరెట్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “దృశ్యం 2”. తన గత చిత్రం “నారప్ప” లానే ఇది కూడా ప్రైమ్ వీడియోలో నేరుగా డిజిటల్ రిలీజ్ కావడానికి రెడీగా ఉంది. మరి ఈ సందర్భంగా వెంకీ మామ లేటెస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తాను ఎలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారో చూద్దాం.

చెప్పండి “దృశ్యం 2” ఎలా స్టార్ట్ అయ్యింది?

ఎలా స్టార్ట్ అవుతుంది? దృశ్యం 1 అందరూ చూసారు కదయ్యా(నవ్వులు). దృశ్యం లో రాంబాబు తన ఫ్యామిలీ కోసం ఎంతవరకు వెళ్తాడు అని అందరికీ అర్ధం అయ్యింది. అంత మంచి సినిమా చేసాక దాని సీక్వెల్ చెయ్యాలి అని అందరూ అనుకున్నారు.అప్పుడు ఆరేళ్ళు తర్వాత జీతూ సీక్వెల్ తో వచ్చాడు. ముందు పార్ట్ కన్నా చాలా ఎగ్జైటింగ్ గా థ్రిల్లింగ్ గా తీసుకొచ్చాడు.

ఓటిటికి ఇది పర్ఫెక్ట్ చిత్రం అనుకుంటున్నారా?

అవును ఖచ్చితంగా, ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఈ తరహా సినిమాలు బాగా నచ్చుతాయి అనుకుంటున్నాను. నేను నా పని చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇది కరెక్ట్ ఇది రాంగ్ అనుకోలేదు. ఒక ఫ్లో లో వెళ్ళిపోయాను. డెఫినెట్ గా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది.

థియేటర్స్ ఓపెన్ అయ్యాయి ఓ పెద్ద సినిమా పడితే బాగుంటుంది అనుకుంటున్నారు?

చిన్న పెద్ద అని లేదు సినిమాలు వస్తున్నాయి. కానీ ఈ సినిమాకి ఇలా జరిగిపోయింది. వీటి కోసం ఎక్కువగా ఆలోచించను నేను.

రాంబాబు పాత్ర మళ్ళీ చెయ్యడం మీకెలా అనిపించింది?

ముందు చెప్పినట్టు గానే రాంబాబు అన్నీ బాగున్నపుడు బాగుంటాడు మళ్ళీ సమస్య వస్తే ఎదుర్కొంటాడు. ఈసారి కూడా అంతే థ్రిల్ ని అందిస్తాడు.

లాస్ట్ టైం కూడా ఓటిటికే వెళ్లారు మరి ఫ్యాన్స్ హర్ట్ అవుతారుగా?

ఈ ఏడాదికి అలా అయ్యిపోయింది. ఇక మళ్ళీ మంచి సినిమాలతో థియేటర్స్ లోకి వచేస్తున్నాం. నా అభిమానులు చాలా ఓపికగా ఉంటారు. ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కానీ అన్నిటికీ టైం వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళకి మంచి సినిమా ఇస్తాను ఈసారికి ఇలా అయ్యిపోయింది.

మరి ‘దృశ్యం 3’ కోసం ఏమన్నా డిస్కషన్ లు జరిగాయా?

లేదు ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచనలు లేవు. కానీ జీతూ జోసెఫ్ మైండ్ లో ఏముందో నాకు కూడా తెలీదు. బహుశా ఇంకో రెండు మూడేళ్లు పట్టొచ్చు. అప్పుడు వరకు రాంబాబు అలాగే ఉంటాడు గడ్డం పెంచుకొని కటింగ్ చేయించుకొని(మళ్ళీ నవ్వులు)

ఈ రెండు సినిమాలు ఓటిటికి వెళ్లిపోయాయి మరి ఫ్యాన్స్ కి ఎఫ్ 3 తో గట్టి ట్రీట్ ఇస్తారా?

తప్పకుండా.. ఈసారి డబుల్ ట్రిపుల్ ట్రీట్ ఖచ్చితంగా నా అభిమానులకు ఉంటుంది. అది కూడా థియేటర్స్ లోనే ఉంటుంది. కానీ సినిమా సమ్మర్ లో అంటున్నారు చూడాలి.

తరుణ్ భాస్కర్ తో సినిమా కోసం చెప్పండి?

తరుణ్ తో పాటు అందరూ స్క్రిప్ట్స్ రెడీ చేస్తున్నారు. అంతా ప్రిపరేషన్స్ లోనే ఉన్నారు. ప్రస్తుతానికి అయితే కొత్త సినిమాలేం లేవు. బాగుంటే అప్పుడు స్టార్ట్ చేస్తారు.

ఒక యాక్టర్ గా ఫలానా సినిమాలు చెయ్యాలి అనుకుంటున్నారా?

నేనెప్పుడూ అలా అనుకోలేదు కొత్త కథలు ఎలాంటి తీసుకొచ్చినా చేస్తాను. వాళ్ళకి తెలుసు నాకు ఎలాంటి కథలు రాయాలో వాళ్ళే చూసుకుంటారు నేను చేస్తూ వెళ్ళిపోతాను అంతే.

సంబంధిత సమాచారం :