ఇంటర్వ్యూ : పల్నాటి సూర్య ప్రతాప్ – ‘ఆర్య’లో ఉండే ఫీల్ ‘కుమారి 21F’లో కూడా ఉంటుంది.

surya-prathap
‘కరెంట్’ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన పల్నాటి సూర్య ప్రతాప్ దాదాపు 6 ఏళ్ళ గ్యాప్ తర్వాత చేసిన మరో యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘కుమారి 21F’. స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ – కథనం అందించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించిన ఈ సినిమా నవంబర్ 20న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రతాప్ తో కాసేపు మాట్లాడి ఆ సినిమా విశేషాలను తెలుసుకున్నాం..

ప్రశ్న) ‘కరెంట్’ సినిమా తర్వాత ఇంత గ్యాప్ తీసుకోవడానికి గల కారణం ఏమిటి?
స) ఆర్యకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాను, ఆ తర్వాత కరెంట్ తో డైరెక్టర్ గా మారాను. ‘కరెంట్’ సినిమా తర్వాత నాకు సుకుమార్ గారి రైటింగ్ డిపార్ట్మెంట్ లో పని చేయడానికి ఆఫర్ వచ్చింది. ఆయనతో పనిచేస్తే రైటర్ గా నాకు అనుభవం చాలా వస్తుందని ఆయనతో కలిసి పనిచేసాను. ఆ తర్వాత ఆయనే నాకు ఈ కుమారి 21F ఆఫర్ ఇచ్చాడు.

ప్రశ్న) డైరెక్టర్ గా మారిన తర్వాత మళ్ళీ సుకుమార్ దగ్గర రైటర్ గా ఎందుకు చేరారు?
) ఇది చాలా మంది అడిగారు.. దానికి ప్రధాన కారణం, నాకు సెట్ ఫీల్డ్ లో అనుభవం బాగా ఉంది, కానీ రైటింగ్ డిపార్ట్మెంట్ లో అనుభవం చాలా తక్కువ ఉంది. సుకుమార్ గారి రైటింగ్ స్టైల్ ఎవరూ టచ్ చేయలేరు. ఆయన రైటింగ్ స్టైల్ కి వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఆయన అడగ్గానే వెళ్లి చేరిపోయాను. ఇది సుకుమార్ గారు రాసుకున్న కథని నాకిచ్చి నువ్వు డైరెక్ట్ చెయ్యరా అన్నప్పుడు.. నా ఈ ఐదేళ్ళ జర్నీకి ఒక సార్ధకత వచ్చిందని ఫీలయ్యాను.

ప్రశ్న) ‘కుమారి 21F’ అనే బోల్డ్ కాన్సెప్ట్ అంటున్నారు. మరి ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటుంటారు అనే టెన్షన్ ఉందా?
స) మీరన్నట్టు సినిమాలో బోల్డ్ కాన్సెప్ట్ ని చూపిచాం కానీ అది అందరూ చూసేలా ఉంటుంది. మాకు టెన్షన్ లేకుండా కాన్ఫిడెన్స్ ఇచ్చిన రెండు విషయాలు ఉన్నాయి. మొదటిది కథ, రెండవది – ఇవాల్టి, రేపటి జెనరేషన్ లో ఒక అమ్మాయి – అబ్బాయి మధ్య ఎలాంటి బాండింగ్ ఉంటోంది, ఎలాంటి రిలేషన్ షిప్ ఉంటోంది, వారి జర్నీ ఎలా ఉంటోంది అనే పాయింట్ ని చూపించాం. సినిమా చూసేటప్పుడు ప్రతి అమ్మాయి, అబ్బాయి వారినే చూసుకుంటారు కాబట్టి ఈ రెండు అందరికీ నచ్చుతాయి.

ప్రశ్న) ఇందులో కొంతమంది కలిసి హీరోయిన్ ని రేప్ చేస్తారు అనే వార్తలు వస్తున్నాయి. అది ఎలా రిసీవ్ చేసుకుంటారని మీరు అనుకుంటున్నారు?
స) నేను ఈ న్యూస్ విన్నాను.. కానీ ఇందులో రేప్ అనేది లేదండి.. ఓ సీన్ లో హీరో హీరోయిన్ మధ్య వచ్చిన సైకలాజికల్ సంఘర్షణని చూపించాం. అందులో ఎలాంటి వల్గారిటీ ఉండదు. కుమారి 21F అనేది కంప్లీట్ ఫీల్ గుడ్ ప్యూర్ లవ్ స్టొరీ. సుకుమార్ గారు తీసిన ‘ఆర్య’లో ఎలాంటి ఫీల్ అయితే ఉంటుందో, అదే ఫీల్ ఇందులో కూడా ఉంటుంది.

ప్రశ్న) సుకుమార్ కథల్లో హీరో రెగ్యులర్ అనేదానికి చాలా దూరంగా ఉంటాయి. మరి ఈ సినిమాలో రాజ్ తరుణ్ పాత్రని ఎలా ప్రెజంట్ చేసారు? అలాగే హీరోయిన్ రోల్ ఎలా ఉంటుంది?
స) చాలా నార్మల్ అండ్ కూల్ పర్సన్.. తన తాను చేసుకుంటూ వెళ్ళే కుర్రాడి పాత్ర. మేము అనుకున్న పాత్రని రాజ్ తరుణ్ చాలా బాగా చేసాడు. గత రెండు సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో సరికొత్త రాజ్ తరుణ్ ని చూస్తారు. ఇక హీరోయిన్ ఆయినే వెరీ బోల్డ్, ఉన్నది ఉన్నట్టు మాట్లడేస్తుంటుంది.

ప్రశ్న) ఈ సినిమా హాలీవుడ్ లో వచ్చిన ‘గర్ల్స్ నెక్స్ట్ డోర్’ సినిమా నుంచి స్ఫూర్తి తీసుకొని చేసారనే వార్తలపై మీ కామెంట్?
స) కుమారి 21F అనే సినిమా కథ ఏ సినిమా నుంచి స్ఫూర్తి తీసుకున్నది కాదు. ఈ సినిమా కథ పుట్టింది సుకుమార్ గారి అనుభవాల నుంచి. ఆయన ఫ్రీ టైమ్స్ లో ఉన్నప్పుడల్లా తన లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పేవారు. ఆ ఇన్సిడెంట్స్ ని సినిమాగా తీద్దాం అన్న ఆలోచన నుంచే ఈ సినిమా కథ మొదలైంది. కావున ఇది దేనికీ స్ఫూర్తి కాదు, కాపీ అంతకన్నా కాదు.

ప్రశ్న) ఇలాంటి ఓ చిన్న సినిమాలోకి రత్నవేలు, దేవీశ్రీ ప్రసాద్ లాంటి వారు రావడానికి గల కారణం ఏంటి.?
స) సినిమా కథ మొత్తం రెడీ చేసుకున్నాక సుకుమార్ గారు పిలిచి మన ఐడియా మరియు పూర్తి కథని రత్నవేలు మరియు దేవీశ్రీ ప్రసాద్ కి చెప్పి ఒపీనియన్ తీస్కో అని నన్ను పంపారు. ఇద్దరూ కథ విని బాగుంది అంటే వచ్చేసాను. ఆ తర్వాత వల్లే సుకుమార్ గారికి కాల్ చేసి ఈ సినిమా చేయడానికి వచ్చారు.

ప్రశ్న) యూత్ఫుల్ ఎంటర్టైనర్ అంటున్నారు.. మరి ఈ సినిమా ద్వారా యూత్ కి ఏమన్నా మెసేజ్ ఇస్తున్నారా?
స) ఈ సినిమాలో పర్టిక్యులర్ గా ఓ మెసేజ్ అనేది మేము ఇవ్వలేదు. కానీ ఇందులో ఇప్పటి యువతరం గురించే ఎక్కువ చూపించాం కాబట్టి సినిమా చూసాక యువత ఆలోచనా విధానంలో కచ్చితంగా మార్పు వస్తుందని అనుకుంటున్నాను.

Exit mobile version