ఇంటర్వ్యూ : పవన్ సీహెచ్ – శేఖర్ కమ్ముల నన్ను చాలాసార్లు తిరస్కరించారు !

Published on Sep 21, 2021 3:20 pm IST

కూల్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా “లవ్ స్టోరీ”. ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి ఈ సినిమా పై పవన్ సీహెచ్ చెప్పిన విషయాలు మీ కోసం..

“లవ్ స్టోరీ” చిత్రం మ్యూజిక్ పరంగా ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మీకెలా అనిపిస్తుంది?

హ్యాపీ గా అనిపిస్తుంది. నిన్న రాత్రి, మేము సినిమా బ్యాలెన్స్ వర్క్ ను పూర్తి చేశాము. ఇక ఈ సినిమా సంగీతం ఎంత బాగా హిట్ అయిందో నాకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది. నా తొలి సినిమా ఇంత పెద్ద విజయం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

మీ నేపథ్యం గురించి ?

మా నాన్నగారు మరియు తాతగారు ఇద్దరూ ఇండస్ట్రీలో సినిమాటోగ్రాఫర్లుగా పని చేశారు. కానీ నేను ఎప్పుడూ సినిమాటోగ్రాఫర్ గా రావలనుకోలేదు. నాకు సంగీతంలో చాలా మంది స్నేహితులు ఉన్నారు కాబట్టి, నేను ఒక ర్యాప్ సాంగ్ ను కంపోజ్ చేసి నా తల్లిదండ్రులకు చూపించాను. వారు నన్ను ప్రోత్సహించి, చెన్నైలోని ఒక సంగీత పాఠశాలలో చేర్పించారు. అక్కడ నేను సంగీతంలో కోర్సు చేశాను.

ఏఆర్ రెహమాన్ తో మీ ప్రయాణం గురించి ?

నేను చెన్నైలో ఉన్న సమయంలో మూడు పాటలు కంపోజ్ చేసినప్పుడు, ఏఆర్ రెహమాన్ సర్ ఆ సాంగ్స్ చూడటానికి వచ్చి పాటల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయనకి బాగా నచ్చాయి. మరిన్ని కంపోజిషన్‌ల కోసం నన్ను అడిగారు. ఆయన నా పనిని ఇష్టపడ్డారు, నేను ఆయనతో సచిన్, సర్కార్, రోబో, ఫకీర్ ఆఫ్ వెనిస్ మరియు అనేక ఇతర ప్రాజెక్టుల కోసం నాలుగు సంవత్సరాలు పని చేశాను.

లవ్ స్టోరీ ఆఫర్ మీకు ఎలా వచ్చింది?

నేను చాలాకాలంగా శేఖర్ కమ్ముల సర్‌ ని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నాను. నిజానికి, ఆయన ఫిదా సినిమా విషయంలో నా వర్క్ ను తిరస్కరించారు. నన్ను అప్‌డేట్ అయి తిరిగి రావాలని కోరారు. అప్పటి నుంచి నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఆయనకు హే పిల్ల ట్యూన్ పంపించాను. ఆయనకు అది నచ్చింది. కానీ వివిధ రకాల పాటలతో నన్ను పరీక్షించి చివరగా, నా వర్క్ ను ఇష్టపడ్డారు.

మీ భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి ?

సినిమా విడుదల కాకముందే నాకు కొన్ని మంచి ఆఫర్లు వచ్చాయి, కానీ.. కోవిడ్ సమయం కదా, నా సినిమాల ప్లానింగ్ ను కూడా మార్చింది. దాంతో నేను ఇప్పటి వరకు ఏ సినిమాకి సంతకం చేయలేదు. ప్రపంచం అంతా నా వర్క్ ను చూసి గుర్తించేలా మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నాను’ అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

సంబంధిత సమాచారం :