ఇంటర్వ్యూ : ప్రవీణ్ సత్తారు – బడ్జెట్ తో నాకు సంబంధం లేదు. అది నా పని కాదు !

ఇంటర్వ్యూ : ప్రవీణ్ సత్తారు – బడ్జెట్ తో నాకు సంబంధం లేదు. అది నా పని కాదు !

Published on Nov 1, 2017 4:41 PM IST

ఈ శుక్రవారం ‘గరుడవేగా’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రవీణ్ సత్తరు తో ఇంటర్వ్యూ…

ప్ర) ఈ సినిమా ఎలామొదలయింది ?

జ) నేను ఎక్కువగా బాలివుడ్ సినిమాల నుండి ప్రేరణ పొందుతాను, ఈ సినిమా స్క్రిప్ట్ 2006 లో రాసుకున్నాను, మొదట ఈ సినిమాకు మగాడు అనే టైటిల్ పెడదాం అనుకున్నాం, చాలా డిస్కషన్స్ తరువాత గరుడవేగా టైటిల్ నిర్ణయించాం.

ప్ర) స్క్రిప్ట్ లో ఎలాంటి మార్పులు చేసారు ?

జ) నేను మొదట కథ రాసుకున్నప్పుడు ఈ సినిమా లో హీరో సిఐ, కాని ఇప్పుడు ఉన్న పరిస్థితులకు అనుకూలంగా హీరో క్యారెక్టర్ మార్చాల్సి వచ్చింది, ఇప్పుడు మా సినిమాలో హీరో నేషనల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ లో వర్క్ చేస్తాడు.

ప్ర) ఫస్ట్ టైంయాక్షన్ సినిమా చేస్తున్నారు, ఎలా అనిపించింది ?

జ) చాలా సంతోషంగా ఉంది, యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడం థ్రిల్లింగ్ గా ఉంది, భవిషత్తు లో మరిన్ని యాక్షన్ సినిమాలు తీయాలనుకుంటున్నాను. టాప్ టెక్నిషియన్స్ తో పని చెయ్యాలని ఉంది.

ప్ర) రాజశేఖర్ మీద ఇంత బడ్జెట్ వర్క్ ఔట్ అవుతుంది అనుకుంటున్నారా ?

జ) ప్రతిచోటా ఇదే ప్రశ్న అడుగుతున్నారు, ఎందుకో నాకు అర్థం కావడంలేదు, ‘అర్జున్ రెడ్డి’ సినిమా 4 కొట్లలో తీసారు, అదీ కొత్త దర్శకుడితో కాని సినిమా 30 కోట్లు వసూళ్ళు చేసింది, బడ్జెట్ కి సినిమా ఫలితానికి సంభందం లేదని నేను భావిస్తాను.

ప్ర) అయితే మీరు బడ్జెట్ గురించి పట్టించుకుంటారా?

జ) లేదు, నేను బడ్జెట్ ను అస్సలు పట్టించుకోను, కథను నమ్మి సినిమాను ప్రారంభిస్తాను, కథకు కావాల్సినవన్ని ఉన్నాయా లేదా చూసుకుంటాను. సినిమా బాగా రావడానికి నావంతు ప్రయత్నం చేస్తాను.

ప్ర) సన్నీ లియోన్ పాత్రకు రెస్పాన్స్ ఎలా ఉంది?

జ) సినిమాలో అదనపు ఆకర్షణకోసం సన్నీలియోన్ ను సంప్రదించడం జరిగింది. ఆమె పాటకు మంచి ఆదరణ లభిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు