ఇంటర్వ్యూ: రకుల్ ప్రీత్ సింగ్ – లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి నేనింకా సిద్ధం కాలేదు !

21st, February 2017 - 04:32:56 PM


తెలుగు టాప్ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం పలు పెద్ద సినిమాల్లో నటిస్తోంది. వాటిలో ధరమ్ తేజ్ ‘విన్నర్’ కూడా ఒకటి. ఈ చిత్రం ఈ నెల 24న రిలీజ్ అవుతున్న సందర్బంగా ఆమె మీడియాతో పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. ఆ విశేషాలు మీ కోసం…

ప్ర) ఈ సినిమాలో మీ రోల్ ఎలాంటిది ?
జ) ఇందులో నాదొక అథ్లెట్ పాత్ర. అలాగే జాకీని కూడా. నా వలనే హీరో తేజ్ హార్స్ రేస్ అనే విషయంలోకి దిగుతాడు. సినిమాలో నిజమైన అథ్లెట్ గా కనిపించేలా ఉండటానికి సరైన ఫిట్నెస్ కోసం చాలా వర్కవుట్స్ చేశాను.

ప్ర) ఈ సినిమా ఎలా ఉంటుందో చెప్తారా ?
జ) సినిమా పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉంటుంది. టెక్నికల్ వాల్యూస్ కూడా బాగుంటాయి. చోటా కె నాయుడు సినిమాని చాలా అందంగా చేశారు. హార్స్ రైడింగ్ సన్నివేశాలు టర్కీలో షూట్ చేశాం. చాలా బాగా వచ్చాయి. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి.

ప్ర) ధరమ్ తేజ్ తో పని చేయడం ఎలా ఉంది ?
జ) తేజ్, నేను చాలా కాలం నుండి ఫ్రెండ్స్. అది సినిమాకి బాగా ఉంపయోగపడింది. సెట్లో ఎప్పుడూ సరదాగా చిన్న పిల్లల్లా అల్లరి చేస్తూ ఉంటాం. తేజ్ వాళ్ళ అమ్మని గౌరవించే విధానం చాలా గొప్పగా ఉంటుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం అతనిది.

ప్ర) మెగా హీరోలతో వర్క్ చేయడం ఎలా ఉంది ?
జ) నా వరకు అందరు హీరోలు ఒకటే. నేను వాళ్ళ కుటుంబాలని బట్టి ఎవరినీ సపరేట్ గా ట్రీట్ చేయను. ప్రతి హీరోకి మ్యాగ్జిమమ్ రెస్పెక్ట్ ఇస్తాను. వాళ్ళతో కలిసి ప్రాజెక్ట్ కోసం నా వంతు నేను కష్టపడతాను.

ప్ర) గోపీచంద్ మలినేనితో పని చేయడం ఎలా ఉంది ?
జ) గోపీచంద్ మలినేనితో నేను పని చేయడం ఇది రెండోసారి. ఆయన నటులకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇస్తారు. ఆయన నా పాత్రను వివరించిన తీరు చాలా బాగుంటుంది. చాలా సరదాగా ఉంటారు. కావల్సిన అవుట్ ఫుట్ నటుల నుండి ఎలా తీసుకోవాలో ఆయనకు తెలుసు.

ప్ర) ఇన్ని ప్రాజెక్ట్స్ ఒకేసారి ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ?
జ) నేనైతే బాగానే హ్యాండిల్ చేస్తున్నానని అనుకుంటున్నాను. డేట్లు కుదరక కొన్ని సినిమాలు వదులుకుంటే కొన్నింటిలో నా స్థానంలో వేరే వాళ్ళను తీసుకున్నారు. ఆలా నేను దూరమైన ప్రాజెక్ట్స్ చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి. దేవుడే నాకు మంచి ప్రాజెక్ట్స్ వచ్చేలా చేస్తున్నాడని భావిస్తున్నాను.

ప్ర) లేడీ-ఓరియెంటెడ్ ఫిలిమ్స్ చేస్తారా ?
జ) నిజంగా ఇప్పటి దాకా నాకైతే అలాంటి ఆఫర్స్ రాలేదు. నేను కూడా అందుకు సంసిద్ధంగా లేననే అనుకుంటున్నాను. నయనతార, త్రిష లాగా సినిమా మొత్తాన్ని నా భుజాల మీదే మోయలేను. ఒకవేళ అలాంటి సినిమాలు చేస్తే మేరీ కోమ్ లాంటి సినిమాలు చేస్తాను.

ప్ర) మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ఏంటి ?
జ) మార్చ్ లో కార్తీతో ఒక తమిళ సినిమా మొదలుపెట్టబోతున్నాను. ప్రస్తుతానికి నాగ చైతన్య, మహేష్ బాబు సినిమాల మధ్య బిజీ బిజీగా ఉన్నాను.