ఇంటర్వ్యూ: ఎస్ఎస్. రాజమౌళి – బాహుబలి 2 లో మంచి కామెడీ ఉంటుంది !

26th, April 2017 - 06:25:58 PM


భారత సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘బాహుబలి – ది కంక్లూజన్’ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానున్న సందర్బంగా దర్శకుడు రాజమౌళి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం..

ప్ర) రిలీజ్ ముందు ఏమైనా టెంక్షన్ ఫీలవుతున్నారా ?
జ) సినిమా షూటింగ్ అప్పుడు చాలా ఎగ్జైటింగా ఉంటాను. సినిమాకి ఇంకా ఎక్కువ రోజులు కావాలనిపిస్తుంది. కానీ సినిమా విడుదలకు ముందు కాస్త టెంక్షన్ అనిపిస్తుంది. ఇప్పుడైతే అన్ని రకాల ఫీలింగ్స్ కలగలిసి ఉన్నాయ్. సినిమా త్వరగా రిలీజైన తర్వాత ప్రేక్షకులు నా వర్క్ గురించి ఏమనుకుంటారో చూడాలని ఉంది.

ప) అందరూ ఈ సినిమాకి కనెక్టయ్యేలా చేసిన అంశమేమిటని మీరనుకుంటున్నారు ?
జ) మా నాన్నగారు రాసిన పాత్ర చిత్రీకరణే అందరినీ సినిమాకు కనెక్టయ్యేలా చేసిందని నేను భావిస్తున్నాను. సినిమా అయిపోయి ఇంటికి వెళ్ళాక కూడా స్క్రీన్ మీద చూసిన పాత్రలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయని అనుకుంటున్నాను.

ప్ర) ఈ ఐదేళ్లు మిమ్మల్ని ముందుకు నడిపిన అంశాలేమిటి ?
జ) నన్ను ఇన్నేళ్లు ముందుకు నడిపిన అంశాల్లో మొదటిది నన్ను నమ్మి జీవితాల్ని పణంగా పెట్టిన నిర్మాతలు, రెండవది ఈ ప్రయాణంలో నాకు అడుగడుగునా తోడున్న నా కుటుంబం. మూడవది ఎప్పటికప్పుడు నన్ను రియలైజ్ చేస్తూ వచ్చిన నా హీరో ప్రభాస్.

ప్ర) కట్టప్ప బాహుబలిని చంపడం అనే అంశం ఎలా పనిచేస్తోంది ?
జ) కట్టప్ప బాహుబలిని చంపడమే నే ట్విస్ట్ మొదటి పార్ట్ కు మంచి ఎండింగ్ అవుతుందని అనుకున్నాం తప్ప అదే పెద్ద చర్చనీయాంశ అంశమవుతుందని అనుకోలేదు. ఆ అంశానికి నేను న్యాయం చేశాననే అనుకుంటున్నాను. అయినా ఈ అంశం కన్నా సినిమాలో డ్రామా ఇంకా గొప్పగా ఉంటుంది.

ప్ర) రెండవ భాగానికి షూట్ చేయడంలో ఏమైనా కష్టమనిపించిందా ?
జ) ఈ అంశంలో నిర్మాతలు చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. మొదట సీజీ వర్క్ చేయాల్సిన సన్నివేశాలల్ని షూట్ చేశాం. దాంతో విఎఫ్ఎక్స్ చేసేవాళ్ళకి బోలెడంత టైం దొరికింది. అలాగేప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా ముందే ప్లాన్ చేసుకున్నాం. అందుకే చెప్పిన సమయానికే సినిమాని రిలీజ్ చేయగలుగుతున్నాం.

ప్ర) మీ చిత్రాలన్నింటిలో బాహుబలికి ఎలాంటి స్థానం కల్పిస్తారు ?

జ) నా చిత్రాలన్నింటిలో బాహుబలి ద్వారానే సంతృప్తి కలిగింది. అందులో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి రెండు భాగాలను చిత్రీకరించిన ఐదేళ్లలో చాలా నేర్చుకున్నాను.ఇలాంటి చిత్రాలపై మక్కువ కూడా పెరిగింది.

ప్ర) బాహుబలి 2 లో ఎలాంటి ప్రత్యేకత ఉంది..?

జ) మొదటి భాగం కన్నా విజువల్స్ పరంగా, గ్రాఫిక్స్ పరంగా బాహుబలి 2 పెద్దదిగా అనిపిస్తుంది.అంతే కాక ఈచిత్రంలో హాస్యం కూడా ఉంటుంది.కొన్ని పాత్రలకు సంభందించిన ఫ్లాష్ బ్యాక్స్ ఆశ్చర్యానికి గురిచేస్తాయి.

ప్ర ) ఇలాంటి చిత్రాలను తీయాలనే ధైర్యం మీకు ఎలా వస్తుంది ?

జ) మనం తీయాలనుకునే సబ్జెక్టు పై పూర్తి పట్టు సాధించాలి. అలాగే మనకు దానిపై నమ్మకం కలగాలి. ఎలాంటి సందర్భంలో అయినా మీరుచేసే పనిపై అనుమానం కలిగితే ఆ పని చేయడం కష్టమవుతుంది.

ప్ర )బాహుబలి చిత్రం గురించి నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి మాట్లాడినపుడు ఎలా అనిపిస్తుంది ?

జ) చాలా సంతోషంగా అనిపిస్తుంది.మోడీ లాంటి వ్యక్తి మా చిత్రం గురించి మాట్లాడడం నిజంగా గర్వపడాల్సిన విషయమే. ఇండియన్ సినిమాలలో ఓ తెలుగు చిత్రం టాప్ లో ఉండడం అత్యంత సంతోషాన్ని కలిగించే విషయం.

ప్ర)ఈ చిత్రానికి ఎలాంటి వసూళ్లు వస్తాయనుకుంటున్నారు ?
జ) వసూళ్లపై సరైన అవగాహనకు రాలేకున్నాం. కానీ ప్రీరిలీజ్ బిజినెస్,ట్రేడ్ వర్గాలను బట్టి చూస్తే ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ వసూళ్లు వస్తాయని తెలుస్తోంది. వారి జీవితాలను రిస్క్ లో పెట్టిమరీ ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతల కోసం మంచి వసూళ్లు సాధించాలని కోరుకుంటున్నా.