ఇంటర్వ్యూ : సాయి ధరమ్ తేజ్ – చిత్రలహరి నా బయోపిక్ కాదు !

వరుసగా ఆరు ప్లాపుల తరువాత సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు . కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసినఈ చిత్రం ఏప్రిల్‌ 12న విడుదలకానుంది. ఈ సందర్భంగా తేజు మీడియా తో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

సినిమా లో మీ పాత్ర గురించి ?

ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ పేరు విజయ్‌ కృష్ణ. తన జీవితంలో ఎప్పుడూ సక్సెస్‌ చూడలేదు. సక్సెస్‌ అంటే ఏంటో కూడా తెలీదు. అలాంటి ఓ యువకుడు ఫెయిల్యూర్స్‌ని అధిగమించి సక్సెస్‌ని ఎలా సాధించాడు అనేది సినిమా మెయిన్‌ కాన్సెప్ట్‌.

కథల ఎంపిక విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

ప్రతి సినిమా విజయం వెనుక ఒక టీమ్‌ వర్క్‌ ఉంటుందని నమ్ముతాను. అలాగే ప్రతి సినిమాకు హండ్రెడ్‌ పర్సెంట్‌ నటుడిగా పూర్తి ఎఫర్ట్‌ పెడతాను. ఆ ప్రాసెస్‌లో కొన్ని ఫెయిల్యూర్స్‌ రావొచ్చు. అవి సహజం. కానీ నటుడిగా ప్రతి సినిమా నాకు మంచి పేరు తెచ్చింది. నా గత అనుభవాల వల్ల స్క్రిప్ట్‌ నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పగలుగుతున్నా. స్క్రిప్ట్‌ పరంగా నేను పూర్తిగా సంతృప్తి చెందితేనే సినిమా లకు ఓకే చెప్తున్నా.

ఈ స్క్రిప్ట్‌ వినగానే మీకేమనిపించింది ?

కిషోర్‌ తిరుమల ఈ స్క్రిప్ట్‌ చెప్పగానే నాకు లోపల నుండి తెలియని వాయిస్‌ విన్పించింది ఈ స్క్రిప్ట్‌ వదులుకోకు అని. నా మనసులోంచి వచ్చిన మాటను నమ్మి ఈ సినిమా చేశాను.దానికి తగ్గట్లుగానే మంచి అవుట్ ఫుట్ ఇచ్చాడు మా డైరెక్టర్.

సినిమా ఫైనల్‌ కాపీ చూశారా?

లేదండి . డబ్బింగ్‌చెబుతున్నప్పుడు చూశాను. సినిమా ను ఆడియన్స్‌తో పాటు థియేటర్‌లో చూస్తాను.

నిర్మాతల గురించి ?

చాలా మంచి ప్రొడ్యూసర్స్‌ అండి. అలాంటి ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్స్‌ నాకు ఆరు సినిమాల తర్వాత నన్ను నమ్మి ఛాన్స్‌ ఇవ్వడం చాలా హ్యాపీగా అన్పించింది. ఎంతో ఫ్రీడమ్ ఇచ్చారు. మైత్రి మూవీ మేకర్స్‌ బేనర్‌లో వర్క్‌ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాంటి ప్రొడ్యూసర్స్‌ ఇండస్ట్రీకి ఎంతో అవసరం.

దేవి శ్రీ ప్రసాద్ గురించి ?

దేవిశ్రీ ఈ సినిమాకి అద్భుతమైన సంగీతాన్నిచ్చారు. దేవి అన్న సాంగ్స్‌ని నేను ఫస్ట్‌ నుండి ఫాలో అవుతున్నా. ఆయన సాంగ్స్‌ విని ఎంతో ఎంజాయ్‌ చేసేవాడ్ని. నేను ఆయనతో కలిసి వర్క్‌ చేస్తానని అనుకోలేదు. మా అమ్మగారు కూడా నేను, దేవిశ్రీ కలిసి పని చేయాలని, ఆయన మ్యూజిక్‌ని నేను డ్యాన్స్‌ చేయాలని అంటూండేది. అది ఈ సినిమాతో నెరవేరింది.

సునీల్‌ గురించి చెప్పండి?

సునీల్‌ అన్నతో కలిసి వర్క్‌ చేయాలని నాకు ఎప్పటినుండో కోరిక గా ఉండేది. నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి ఆయన హీరో అయ్యారు. కుదురుతుందో, లేదో అనుకున్నాను. ఈ సినిమాతో కుదిరింది. ఆఫ్‌ స్క్రీన్‌లో కూడా ఆయన నన్ను ఓ తమ్ముడిలా చూసుకున్నారు. ఈ సినిమాలో ఆయన కామెడీ చాలా బాగుంటుంది.

హీరోయిన్స్‌ గురించి?

కల్యాణి, నివేదతో కలిసి నటించడం ఇదే ఫస్ట్‌ టైమ్‌ ఇద్దరూ మంచి పెర్‌ఫార్మెర్స్‌. వాళ్లు ఎలా చేస్తారో, నేను ఎలా రియాక్ట్‌ అవ్వాలా అని చిన్న ఎగ్జయిట్‌మెంట్‌ ఉండేది. మా ముగ్గురి మధ్య హెల్దీ కాంపిటీషన్‌ ఉంది.

‘గ్లాస్‌మేట్స్‌’ సాంగ్‌ కథలోంచి వచ్చిందా?

ఫిబ్రవరిలో నాకు పూర్తి కథ చెప్పడం జరిగింది. అప్పుడే సాంగ్‌ కాన్సెప్ట్‌ చెప్పడం జరిగింది. అప్పటికే ‘ప్రేమ వెన్నెల’, ‘పరుగు పరుగు’, ‘గ్లాస్‌మేట్స్‌’, ‘ప్రయత్నమే’ పాటలు గురించి చెప్పారు. కానీ డిసెంబర్‌లో ‘గ్లాసు’ గుర్తు వస్తుందని అనుకోలేదు.

Exit mobile version