ఇంటర్వ్యూ : సాయి ధరమ్ తేజ్ – అది ప్రేక్షకుల చేతుల్లో ఉంది !
Published on Nov 30, 2017 4:00 pm IST

ప్ర) ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది ?

జ) 2015లో దర్శకుడు రవి నాకు ఈ పాయింట్ చెప్పాడు. ఆయన చెప్పిన విధానం, సినిమాలో కంటెంట్ బాగా నచ్చాయి. నా క్యారెక్టర్ సినిమాలో బాగుంటుంది. అప్పడే అనుకున్నాను ఈ సినిమా మిస్ చేసుకోకూడదని. చివరికి ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు చేసాను, విడుదల అవుతోంది.

ప్ర) ఈ సినిమా ద్వారా ఎలాంటి సందేశం ఎవ్వబోతున్నారు ?

జ) ఈ సినిమా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కాదు.మేము ఎలాంటి సందేశం ఈ సినిమాలో ఇవ్వలేదు. సామాన్య ప్రజలు నిజ జీవితంలో ఏ విధంగా ఉంటారు ? సమాజం వారిపై ఏ విధంగా ప్రభావితం చేస్తోంది అనే పాయింట్ తో తెరకెక్కించాం. ఇది పక్కా ఎంటర్టైనర్. మాస్ కు కావలసిన అంశాలన్నీ ఈ సినిమాలో ఉండబోతున్నాయి.

ప్ర) దిల్ రాజు తో సాన్నిహిత్యం గురించి ?

జ) ఆయన నాకు నిర్మాత కంటే ఫ్యామిలి మెంబర్ గా ఎక్కువ. నా కెరీర్ కు హెల్ప్ అయ్యే సలహాలు సూచనలు ఇస్తుంటారు ఆయన. నా లైఫ్ లో ఆయన స్పెషల్ పర్సన్.

ప్ర) మీ కొత్త లుక్ గురించి ?

జ) ఆ క్రెడిట్స్ అంతా నా హెయిర్ డ్రస్సర్ మరియు డైరెక్టర్ బివిఎస్ రవి కి చెందుతుంది. వారు ఏం చెబితే నేను అది పాటించాను.

ప్ర) మీకు మెగా ఫాన్స్ ఫాలోయింగ్ బాగుంది. దాని గురించి ?

జ) ముందుగా నన్ను ఆదరిస్తున్న మెగా ఫాన్స్ అందరికి ధన్యవాదాలు. నా సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి అంటే అది వారివల్లే. వారిరుణం తీర్చుకోలేనిది.

ప్ర) మెహరిన్ తో పనిచెయ్యడం గురించి ?

జ) అమ్మాయి చూడ్డానికి ఎంత బాగుంటుందో అంత కష్టపడుతుంది. ఈ మద్య మెహరిన్ చేసిన సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. ఆమెకు గోల్డెన్ లెగ్ అని పేరుంది, అది మా సినిమాతో కూడా కంటిన్యూ అవుతోంది.

ప్ర) దర్శకుడు బివిఎస్ రవి గురించి ?

జ) ఆయన స్క్రిప్ట్ చెప్పిన విధానం ఎంత బాగుందో అంత బాగా పేపర్ పై పెట్టడం జరిగింది. ఈ సినిమాతో ఆయన మంచి దర్శకుడు అవుతాడన్న నమ్మకం నాకుంది.

ప్ర) జవాన్ సినిమాపై మీకు అంచనాలు ఏ విధంగా ఉన్నాయి ?

జ) జవాన్ సినిమా టికెట్ కొన్న ఎవ్వరు నిరాశ చెందారు. తప్పకుండ సినిమా అందరికి నచ్చుతుంది. నేను ఈ సినిమాకు పడాల్సిన కష్టం అంతాపడ్డాను సినిమా విజయం ప్రేక్షకుల చేతుల్లో ఉంది.

 
Like us on Facebook