ఇంటర్వ్యూ: సంకల్ప్ రెడ్డి – రానా ఎంట్రీ ‘ఘాజి’ స్థాయినే మార్చేసింది !

ఇంటర్వ్యూ: సంకల్ప్ రెడ్డి – రానా ఎంట్రీ ‘ఘాజి’ స్థాయినే మార్చేసింది !

Published on Feb 14, 2017 6:20 PM IST


ఈ వారాంతంలో రిలీజ్ కానున్న సినిమాల్లో అందరూ ఎక్కువగా మాట్లాడుకుంటున్న చిత్రం రానా దగ్గుబాటి నటించిన ‘ఘాజి’. ఇండియా – పాక్ ల మధ్య నడిచిన వాస్తవ యుద్ధ కథనం ఆధారంగా రూపొందిన సినిమా కావడంతో దీనిపై అందరికీ ఆసక్తి ఎక్కువైంది. ఈ సందర్బంగా దర్శకుడు సంకల్ప్ రెడ్డితో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం.

ప్ర) మీ నైపథ్యం ఏంటి ?

జ) నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. ఇక్కడ నా చదువు పూర్తవగానే ఫైన్ ఆర్ట్స్ లో ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్ళాను. అది అయిపోగానే సినిమాల్లోకి రావాలని ఇలా వచ్చాను.

ప్ర) ‘ఘాజి’ సినిమా చేయాలని ఆలోచన ఎలా వచ్చింది ?

జ) నేను వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఈ సబ్ మెరైన్ ను చూశాను. అప్పుడే దీని మీద, ఇండియన్ నేవీ మీద సినిమా తీద్దామని నిర్ణయించుకుని రీసెర్చ్ మొదలుపెట్టి పూర్తి స్క్రిప్ట్ రాసుకున్నాను. కోటి రూపాయలతో సినిమా తీద్దామని మొదట నా సొంత డబ్బు 25 లక్షలు పెట్టి పని స్టార్ట్ చేశాను, సెట్ కూడా వేశాం. కానీ కుదరక పివిపి, మాటినీ సంస్థవారిని సంప్రదించాను.

ప్ర) అసలు ఈ సినిమా ఏం చెబుతుంది ?
జ) ‘ఘాజి’ అనేది పాకిస్థాన్ జలాంతర్గామి. దీని గురించి చాలా కథలున్నాయి. వాటిలో ఒకటి ఇండియా కోణంలోనిదైతే ఇంకొకటి పాకిస్థాన్ కోణం లోనిది. నేను ఇండియా కోణంలోని కథను తీసుకున్నాను. దానికి కమర్షియల్ గా కొంత ఫిక్షన్ ను జోడించాను.

ప్ర) ఈ ప్రాజెక్ట్ లోకి రానా ఎలా వచ్చారు ?
జ) మొదట అందరు కొత్త వాళ్లతో చేద్దామనుకున్నాను. కానీ రానా కథ గురించి విని ప్రాజెక్టులోకి వచ్చారు. ఆయన రాకతో చిత్ర స్థాయి మారిపోయింది. హిందీలో మాత్రమే తీయాలనుకున్న సినిమా ఇప్పుడు హిందీతో పాటు తెలుగులో కూడా రిలీజవుతోంది. పివిపిగారి వలన తమిళంలో కూడా వస్తోంది.

ప్ర) రానా కోసం ఏమైనా మార్పులు చేశారా ?
జ) పెద్దగా ఏమీ చేయలేదు. రానా పాత్రకు 45 ఏళ్ళు ఉంటాయి. కానీ రానా కోసం దాన్ని యంగ్ గా చేశాం. అప్పటికే స్క్రిప్ట్, స్టోరీ బొర్డ్, సిజి వర్క్ రెడీగా ఉండటంతో కేవలం 60 రోజుల్లో హిందీ, తెలుగు వెర్షన్ల షూట్ ముగించేశాం.

ప్ర) బాలీవుడ్ నుండి రెస్పాన్స్ ఎలా ఉంది ?
జ) సినిమాని కరణ్ జోహార్ కు చూపించాం. చాలా సన్నివేశాలు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకుండా తీశాం. అది చూసిన అయన సినిమాని ప్రమోట్ చేయాలనుకున్నారు. 1971 నేవీ కి చెందిన వ్యక్తులకు సినిమా స్పెషల్ షో వేశాం. వారంతా మెచ్చుకున్నారు.

ప్ర) ఫ్యూచర్ లో ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు ?
జ) పూర్తిగా బిన్నంగా ఉండే సినిమాలు తీయాలనే అనుకుంటున్నాను. నాకు సాధారణ సినిమాలు నచ్చవు. ఇప్పటి దాకా ఇండియన్ స్క్రీన్ మీద రానటువంటి చిత్రాలు తీయాలని ఉంది.

ప్ర) తరువాత ఏ సినిమాలు చేయబోతున్నారు ?
జ) ఇప్పటిదాకా ఏమీ అనుకోలేదు. ప్రస్తుతానికి ‘ఘాజి; రిలీజ్ కోసం చూస్తున్న. కొత్త దర్శకుడిగా నా సినిమా ఒకేసారి మూడు భాషల్లో రిలీజవడం గర్వాంగా ఉంది. సినిమా అందరికీ నచ్చితుందనే అనుకుంటున్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు