ఇంటర్వ్యూ : సునీల్ – నేను ఇంట్లో డీవీడీ వేసుకుని చూసే డిఫరెంట్ సినిమాల్లో ఇదీ ఒకటి !

ఇంటర్వ్యూ : సునీల్ – నేను ఇంట్లో డీవీడీ వేసుకుని చూసే డిఫరెంట్ సినిమాల్లో ఇదీ ఒకటి !

Published on Oct 4, 2016 5:10 PM IST

sunil
‘జక్కన్న’ చిత్రంతో చాలా కాలం తరువాత మంచి కమర్షియల్ హిట్ అందుకున్న హీరో సునీల్ ఈ ఏడాది తన మూడవ సినిమా ‘ఈడు గోల్డ్ ఏహే’ తో మనముందుకు రానున్నాడు. దర్శకుడు వీరు పోట్ల డైరెక్ చేసిన ఈ చిత్రం అక్టోబర్ 7న విడుదలకానుంది. ఈ సందర్బంగా ఆయనతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం…

ప్ర) ఇంతకు ముందు సినిమాలకి ఈ సినిమాకి తేడా ఏమిటి ?

జ) నేను ఇంతకూ ముందు చేసిన ‘పూల రంగడు, భీమవరం బుల్లోడు, జక్కన్న’ సినిమాలు కార్షియల్, కామెడీ ఎంటర్టైనర్స్. వాటిలో ముందు ఏం జరగబోతోందో చెప్పెయ్యొచ్చు. కానీ ‘మర్యాద రామన్న’ సినిమా డిఫరెంట్. ఇది కూడా అలాంటిదే. నేను ఇంట్లో కూర్చుని డీవీడీ పెట్టుకుని చూసే సినిమాలలో ఇదీ ఒకటి. ప్రతో ఒక్కరూ శాటిసిఫై అవుతారు.

ప్ర) డైరెక్టర్ గురించి ఏం చెబుతారు ?

జ) దర్శకుడు వీరు పోట్ల ఈ సినిమాని చాలా ఇంటెలిజెంట్ తీశారు. థియేటర్లో కూర్చుకుని సినిమా చూసే ప్రేక్షకులు తరువాత ఏం జరుగుతుందో ఊహించలేరు. ఫ్యాఅమిలీ,డ్రామా అన్నీ ఉంటూనే చివరి వరకూ సస్పెన్స్ ఉన్న సినిమా. మర్యాద రామన్న లాగే ఇందులో నా ప్రాబ్లమ్ క్లియర్ అవుతుందో లేదో చెప్పలేం. ప్రతి ఫ్రేమ్ లో కామెడీ ఉంటుంది. క్రెడిట్ మొత్తం వీరు పోట్లకె దక్కుతుంది.

ప్ర) ‘ఈడు గోల్డ్ ఏహే’ అనే టైటిల్ ఎలా పెట్టారు ?

జ) ఇందులో నా పేరు బంగార్రాజు. టైటిల్ కి తగ్గట్టే ఉంటుంది. ‘ఈడు గోల్డ్ ఏహే’ లో చివరగా ‘ఏహే’ అనే పదం నేను రెగ్యులర్ గా వాడే పదం. ఇప్పుడు పిల్లలు పెద్దలు అందరూ సినిమా పేరు చెప్పేటప్పుడు అదే పదాన్ని వాడతారు. బాగా పాపులర్ అయిన పదం. ఆ టైటిల్ ముందు నాకే చెప్పాడు. నాకు చాలా బాగా నచ్చేసింది.

ప్ర) మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది ?

జ) ఇందులో నా క్యారెక్టర్ లో రెండు షేడ్స్ ఉంటాయి. ఈ కథ నాకు చాలా బాగా కుదిరింది. నన్ను దృష్టిలో పెట్టుకునే వీరు పోట్ల ఈ కథ రాశాడు. ‘మర్యాదరామన్న’ ఈ సినిమా వల్ల నాకు అన్ని రకాలుగా నాకు పేరొస్తుంది. ఫస్ట్ టైమ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు క్రైమ్ థ్రిల్లర్ గా ఉండే సినిమా చేశాను. ఇందులో కామెడీ పరంగా పాత సునీల్ ని చూస్తారు. ప్రతి సీన్లో ఆ కామెడీ మిస్ కాకుండా చూశాడు వీరు పోట్ల.

ప్ర) ‘జక్కన్న’ సినిమాతో పడుతున్నారా ?
జ) అవును. ఖచ్చితంగా తృప్తి పడుతున్నాను. మేమైతే సినిమా ఏదోలా ఆడిస్తే పర్వాలేదనుకున్నాం. కానీ దేవుడి దయ వల్ల అంతకు మించి ఆడేసింది. ఒకరకంగా మా అంచనాలను మించి ఆడేసింది. దేవుడు ఆ సినిమాని సెకండ్ క్లాస్ లో పాస్ చేయించేశాడు.

ప్ర) కమర్షియల్ సినిమా చేయాలడం ఎలా ఉంది ?
జ) కమర్షియల్ సినిమాలు చేయడం చాలా కష్టం. అది అందరికీ రాదు. కమర్షియల్ సినిమా అంటే ఐటమ్స్ లా ఉంటుంది. రొటీన్ అనే ఫీలింగ్ వచ్చేటప్పటికి వేరే ఐటమ్ ని కొత్తగా సర్వ్ చెయ్యాలి. ఒక ఆర్టిస్ట్ దమ్ము ఏమిటనేది కమర్షియల్, రొటీన్ సినిమాల్లోనే బయటపడుతుందని నేను నమ్ముతాను. ఇక కొత్త, డిఫరెంట్ సినిమాలు ఆర్టిస్ దమ్ముని పెంచుతాయి.

ప్ర) స్క్రిప్ట్ ని మీరు ఎలా ఎంచుకుంటారు ?
జ) నేను అసలు ఇండస్ట్రీకి వచ్చింది విలన్ అవుదామని. అంటే మోహన్ బాబులా విలనిజం, కామెడీ చేసి ఫైనల్ గా కోట శ్రీనివాస రావు గారిలా సెటిలవుదామని అనుకున్నా. నేను ఎక్కువగా కాపీ కొట్టేది కోట గారిని, శ్రీదేవి గారిని. వారిద్దరినీ కలిపితేనే నేను. అది ఎవరికీ తెలీదు. అందరినీ ఎంటర్టైన్ చెయ్యాలి అనుకునేవాడిని. అందుకే నాకు, నిర్మాతకు అందరికీ నచ్చేలా ఉండే స్క్రిప్ట్ ను చూజ్ చేసుకుంటాను.

ప్ర) ఇంట్లో వాళ్లకి టైం ఎలా కేటాయిస్తారు ?
జ) ఇంట్లో వాళ్లకి సినిమా అయినా తరువాతే టైమ్ ఇవ్వగలుగుతున్నాను. కమెడియన్ గా చేసేటప్పుడు రోజుకి ఐదు సినిమాలు చేసేవాడిని. లంచ్ బ్రేక్ లో చేసిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఎక్కువ శాతం బస్సు, ట్రైన్, కారులోనే పడుకునేవాడిని. అంత బిజీగా ఉండేవాడిని. అప్పుడు ఇంట్లో వాళ్ళకి టైం ఇచ్చేవాడిని కాదు. ఇప్పుడు కాస్త కేటాయిస్తున్నాను. అయినా ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ ఫీలవలేదు.

ప్ర) చిరంజీవి సినిమాలో చేస్తున్నారని విన్నాం ?

జ) లేదు చేయడం లేదు. బిజీగా ఉండే వల్ల అది కుదరలేదు. అందుకే అలీ గారు చేస్తున్నారు. ఇక వేరే దాంట్లో చేయొచ్చు.

ప్ర) సినిమాలు కాకుండా సోషల్ సర్వీస్ ఏమన్నా చేస్తున్నారా ?

జ) అంటే పర్టిక్యులర్ గా చెయ్యట్లేదు. ఎవరేమన్నా చేసేప్పుడు పిలిస్తే వెళ్లి ముందుండి చేస్తుంటా. ఇక నా బర్త్ డే, అమ్మ బర్త్ డే అప్పుడు నేనే స్వయంగా వెళ్లి కాంట్రిబ్యూట్ చేస్తా. మంచి ఆర్గనైజేషన్ ఓపెన్ చేసి సేవ చేయాలని ఉంది. ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. వచ్చే ఏడాది మొదలుపెడతా. అంటే నా సొంత డబ్బుతో మానసికంగా సరిగా లేని ఓ పదిమందిని దత్తత తీసుకుని వాళ్ళు చదువుకుని, ఉద్యోగాలు చేసుకునే స్థాయికి వచ్చే వరకూ చూసుకోవాలని ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు