లేటెస్ట్ మెగా సెన్సేషన్ యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్, హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు ఎన్ శ్రీకాంత్ రెడ్డి తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే “ఆదికేశవ”. మరి మంచి బజ్ నడుమ ఈ వారం థియేట్రికల్ రిలీజ్ కి ఈ సినిమా రాబోతుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ఓ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మరి ఇందులో తాను ఎలాంటి అంశాలు పంచుకున్నాడో చూద్దాం రండి.
చెప్పండి ఈ సినిమా జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది?
నాది ‘రంగరంగ వైభవంగా’ టైం లోనే ప్రొడ్యూసర్ నాగవంశీ ఆదికేశవ కథ వినమన్నారు. అప్పుడే నాకు బాగా నచ్చింది. తర్వాత కొన్ని ఇంప్రవైజేషన్స్ చేశారు. వాటితో ఇంకా బాగా వచ్చింది.
ఈ సినిమా చేయడానికి కారణం ఏంటి కథలో ఏం నచ్చింది?
ఇది కంప్లీట్ మాస్ సినిమా అయినప్పటికీ కథలో కూడా కొత్తదనం ఉంది. కేహా విన్నప్పుడే ఈ లైన్ ఎవరూ చేయలేదు అనిపించింది. ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమా చూసాక ఆడియెన్స్ థియేటర్స్ నుంచి హ్యాపీగా బయటకు వస్తారు.
శ్రీలీలతో వర్క్ కోసం చెప్పండి ఆమెతో డాన్స్ చేయడం ఎలా అనిపించింది?
మా ఇద్దరి మధ్య సీన్స్ చాలా క్యూట్ గా ఉంటాయి. షూట్ టైం లో ఇద్దరూ బాగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసాం. తనపై మంచి హ్యూమర్ ని డైరెక్టర్ చూపిస్తారు. ఇక డాన్స్ లో నేనసలు డాన్సర్ ని కాదు కానీ డాన్స్ మాస్టర్ కి ఒకటే చెప్పాను ఎంత కష్టమైనా ఓకే అనే వరకు చేస్తాను అన్నాను. అందుకోసం చాలా కష్టపడ్డాను మాస్టర్ ఇంకా శ్రీలీల ఇద్దరి సపోర్ట్ డాన్స్ కి కూడా న్యాయం చెయ్యగలిగాను.
మీ డైరెక్టర్ కోసం చెప్పండి?
శ్రీకాంత్ లో మంచి హ్యూమర్ రైటింగ్ ఉంది నాకు కథ చెప్పినపుడు ఎంత బాగా అనిపించిందో సినిమాని కూడా అంతే అద్భుతంగా తెరకెక్కించాడు.
నటుడు జోజు జార్జ్ తో వర్క్ కోసం చెప్పండి?
ఆయన చాలా స్వీట్ పర్శన్. సెట్స్ లో ఉన్న టైం లో అంతా విజయ్ సేతుపతి గారితోనే వర్క్ చేస్తున్నట్టు అనిపించింది. ఆయన మంచి ఫుడీ కూడా.. ఆయన నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటుడు అయినా కూడా చాలా డౌన్ టు ఎర్త్ గా ఉంటారు.
మ్యూజిక్ డైరెక్టర్ కోసం చెప్పండి?
జివి ప్రకాష్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మెలోడి, మాస్ ఏదైనా మంచి వర్క్ ఇస్తారు. తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంటుంది. ఎప్పుడు వర్క్ కోసమే మాట్లాడుతూ ఉంటారు.
రాధిక గారి గురించి?
అంత సీనియర్ ఆర్టిస్ట్ సెట్స్ లో ఎలా ఉంటారో అనుకున్నాను. కానీ ఆమె అందరితో బాగా కలిసిపోయి సరదాగా మాట్లాడతారు. ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటారు. అంతటి సీనియర్ ఆర్టిస్ట్ కలిసి పని చేయడం సంతోషంగా అనిపించింది.
సీనియర్ నటి రాధిక గారితో వర్క్ ఎలా అనిపించింది?
మొదట అంత సీనియర్ నటి సెట్స్ లో ఎలా ఉంటారో ఏంటో అనుకునేవాణ్ణి కానీ ఆమె అందరితో కలిసి సరదాగా మాట్లాడుతూ ఉంటారు. చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు. ఆవిడతో కలిసి వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది.
మీరు నటించిన ఉప్పెనకి, అలాగే అల్లు అర్జున్ కి జాతీయ అవార్డులు రావడం ఎలా అనిపించింది.
బన్నీకి అవార్డ్ రావడం గర్వంగా అనిపించింది. అలాగే ఉప్పెన విషయంలో చాలా సంతోషం కలిగింది. అందరి కష్టానికి తగిన ఫలితం వచ్చింది అనిపించింది.
మీ సినిమా “ఉప్పెన” కి అలాగే బన్నీ గారికి నేషనల్ అవార్డ్ రావడం ఎలా అనిపించింది?
రెండు విషయాల్లో కూడా చాలా ఆనందం అనిపించింది. బన్నీకి అవార్డ్ రావడం ఎంతో గర్వంగా, అందరి కష్టానికి తగ్గ ఫలితాన్ని అందుకున్నాము అనిపించింది.