ఇంటర్వ్యూ : వరుణ్ తేజ్ – ఇకపై నా వయసుకు తగిన సినిమాలనే చేస్తాను !
Published on Jul 19, 2017 1:07 pm IST


వరుసగా రెండు పరాజయాలతో వెనుకబడిన మెగా హీరో వరుణ్ తేజ్ ఈసారి ‘ఫిదా’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ శుక్రవారమే రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా వరుణ్ తేజ్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ఈ సినిమా మీ కెరీర్ కు ఎంత ముఖ్యమని మీరనుకుంటున్నారు ?
జ) ఈ సినిమా నా కెరీర్ కు చాలా అవసరం. ఇంతకు ముందు చేసిన ‘మిస్టర్’ సినిమాతో నేను, మెగా ఫ్యాన్స్ చాలా నిరుత్సాహపడ్డాం. ఈసారి అన్నీ బాగా కుదిరాయి. సినిమా కూడా బాగా వచ్చింది.

ప్ర) ‘మిస్టర్’ పరాజయానికి కారణం ?
జ) ఆ సినిమాని ఒక్కరోజులో ఒప్పుకోలేదు. ఒక టీమ్ గా సినిమా విషయంలో చాలా చోట్ల విఫలమయ్యాం. మా అభిమానులు చాలా హార్ట్ అయ్యారు. అందుకే ఇకపై నాకు తగిన సినిమాలే చేస్తానని చెప్పాను.

ప్ర) ‘ఫిదా’ ను సెలెక్ట్ చేసుకోవడానికి కారణం అదేనా ?
జ) అది కూడా ఒక కారణమే. శేఖర్ కమ్ములగారు కథ చెప్పగానే కనెక్టైపోయాను. తెలంగాణా అమ్మాయిని ప్రేమించే ఒక ఎన్నారై అబ్బాయిగా నటించాను. ఇందులో మంచి సందర్బాలని చాలా ఆసక్తికరంగా వివరించారు.

ప్ర) శేఖర్ కమ్ములగారితో పని చేయడం ఎలా ఉంది ?
జ) దర్శకుడిగా కన్నా ఒక వ్యక్తిగా ఆయన్ను ఎక్కువగా ఇష్టపడతాను. సామాజిక అంశాల పట్ల ఆయనకున్న పట్టు, అనేక విషయాలను నాకు వివరించడం వంటివి నన్ను మోటివేట్ చేశాయి. వర్క్ పరంగా ఆయన చాలా భిన్నమైన వ్యక్తి.

ప్ర) చూస్తుంటే సాయి పల్లవి మిమ్మల్ని డామినేట్ చేసినట్టుంది ?
జ) అవును. స్క్రిప్ట్ వినగానే సాయి పల్లవి పాత్ర నాకన్నా హైలెట్ అవుతుందని ఊహించా. కానీ శేఖర్ కమ్ములగారు సెకండాఫ్లో నా పాత్రకు కూడా చాలా ప్రాముఖ్యత, సందర్భాలు ఉంటాయని వివరించారు.

ప్ర) మీ కుటుంబం స్పందన ఎలా ఉంది ?
జ) మామూలుగా నాన్న నా సినిమా కథలన్నీ వినేవారు. కానీ ఈ సినిమా దిల్ రాజుగారిది కాబట్టి వినలేదు. నాన్న నిన్నరాత్రి సినిమా చూసి చాలా బాగా వచ్చిందని అన్నారు. చిరంజీవిగారు ఈరోజు రాత్రి చూస్తారు.

ప్ర) భవిష్యత్తులో ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు ?
జ) వ్యక్తిగతంగా యాక్షన్ సినిమాలు చేయాలనుంది. ‘లోఫర్’ తో ట్రై చేశాను కూడ. అందుకే పరిస్థితులకు తగ్గట్టు, నా ఇమేజ్ కు తగ్గట్టు సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాను.

ప్ర) టాలీవుడ్ డ్రగ్స్ మాఫియాపై మీ అభిప్రాయం ?
జ) పోలీసులు చెప్పేదాంట్లో, ఆరోపణలు ఎదుర్కుంటున్న నటీనటులు చెప్పేదాంట్లో రెండింటిలోనూ నిజముంది. ఇలాంటి పరిసితులు ప్రతి ఇండస్ట్రీలోనూ ఉన్నాయి. కానీ సినిమా వాళ్ళు పాపులర్ కాబట్టి కొంచెం ఎక్కువగా చూపిస్తున్నారు.

 
Like us on Facebook