ఇంటర్వ్యూ : విజయ్ అంథోని – ఇప్పట్లో ఆ ఆలోచన లేదు !

28th, November 2017 - 02:21:41 PM

బిచ్చగాడు సినిమాతో తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకున్న విజయ్ అంథోని ఇంద్రసేనా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ నెల 30 న విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి విజయ్ అంథోని తో ఇంటర్వ్యూ…

ప్ర) ఇంద్రసేన గురించి ?

జ) ఇద్దరు అన్న తమ్ముళ్ల గురించి ఈ సినిమా. వారిమధ్య ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అన్నది ప్రధానంగా ఉండబోతుంది. సినిమాకు ప్రధాన బలం కూడా అదే. నిజజీవితంలో జరిగిన సంఘటనలు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించడం జరిగింది.

ప్ర) ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయబోతున్నారు దాని గురించి ?

జ) నా కెరీర్ లో మొదటిసారి డబల్ రోల్స్ చెయ్యబోతున్నాను. సినిమా అంతా బాగా వచ్చింది. తప్పకుండా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను.

ప్ర) మీరు కమర్షియల్ సినిమాలు చెయ్యడం లేదు ఎందుకు ?

జ) నా అభిప్రాయం ప్రకారం ఒక సినిమా జనాలందరికి నచ్చి పెద్ద హిట్ అయితే అదే కమర్షియల్ సినిమా. నా సినిమాలు అన్ని కమర్షియల్ గా బాగా ఆడాయి. కమర్షియల్ సినిమా అని సపారేట్ గా పేరు లేదు.

ప్ర) మీ సంస్థలో మీ సినిమాలు నిర్మించడానికి కారణం ఏంటి ?

జ) నేను నా సంస్థలో సినిమా నిర్మిచడానికి కంఫోర్ట్ గా ఫీల్ అవుతాను. బయటి నిర్మాతలు అయతే వత్తిడి ఉంటుందని నా ఆలోచన.

ప్ర) విడుదలకు ముందే సినిమా పది నిమిషాలు విడుదల చెయ్యడానికి కారణం ?

జ) అది ఒకరకమైన ప్రమోషన్ అనుకుంటాను. సినిమా కథ అంతా 10 నిమిషాల్లో రివీల్ అవ్వదు కనుక నెక్స్ట్ ఏం జరగబోతుందో అన్న కుతూహలం ప్రేక్షకుడిలో కలుగుతోంది. సినిమా చూడ్డానికి ఆసక్తి కలుగుతుంది.

ప్ర) దర్శకత్వం చేసే ఆలోచన ఉందా ?

జ) యాక్టర్ గానే కొనసాగుతా.  దర్శకులు మంచి స్క్రిప్ట్స్ తో వస్తున్నారు. యాక్టింగ్ అంటేనే ఇష్టం. నిర్మాణం పైన శ్రద్ధ వహిస్తున్నాను. మ్యూజిక్ కూడా చేస్తున్నాను. డైరెక్టర్ అవ్వాలనే ఆలోచన ఇప్పట్లో లేదు.

ప్ర) తెలుగులో సినిమా ఎప్పుడు చేస్తున్నారు ?

జ) కథలు వింటున్నాను. త్వరలో చెయ్యబోతున్నాను. కొంత సమయంలో నిర్ణయం తీసుకొని వెల్లడిస్తాను.

ప్ర) మీ తదుపరి చిత్రాలు ?

జ) ప్రస్తుతం తమిళ్ లో రెండు సినిమాలు చేస్తున్నాను. వాటి వివరాలు త్వరలో ప్రకటిస్తాను.