ఇంటర్వ్యూ: మురుగదాస్- మహేష్ లో ఉన్న బెస్ట్ క్వాలిటీ అదే..!

Published on Jan 4, 2020 4:16 pm IST

సూపర్ స్టార్ రజిని నటించిన లేటెస్ట్ మూవీ దర్బార్. దర్శకుడు మురుగదాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రజిని పోలీస్ అధికారి రోల్ చేస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా నయనతార నటించారు. ఈనెల 9న చిత్ర విడుదల నేపథ్యంలో దర్శకుడు మురుగదాస్ మీడియా సమావేశంలో పాల్గొని చిత్ర విశేషాలు పంచుకున్నారు..

రజిని కాంత్ గారితో మూవీ చేసే అవకాశం ఎలా వచ్చింది?

గజినీ సక్సెస్ తరువాత రజిని గారు ఇంటికి పిలిచారు. అప్పుడు నేను వెళ్లి ఆయనను కలిసి మాట్లాడటం జరిగింది. ఆయన శివాజీ సినిమా చేస్తున్న సమయంలో సినిమా చేద్దాం అనుకున్నాం. అదే టైం లో నేను హిందీ గజినీ చేయాల్సివచ్చింది. అలాగే ఆయన కొన్ని సినిమాలతో బిజీ అయ్యారు. ఇలా మా ఇద్దరి కాంబినేషన్లో సినిమా రావడానికి 15ఏళ్ళు సమయం తీసుకుంది.

 

సాధారణంగా మీ ప్రతి సినిమాలో ఒక మెస్సేజ్ ఉంటుంది..మరి దర్బార్ లో?

ఈ చిత్రంలో కూడా మెసేజ్ ఉంటుంది. అసలు పోలీస్ అంటేనే సమాజానికి ఉపయోగపడే వాడు. సొసైటీ లో జరిగే అన్యాయాలకు తనదైన శైలిలో స్పందిచే ఒక పోలీస్ కథగా ఈ చిత్రం ఉంటుంది. పోలీస్ లు రెండు రకాలుగా ఉంటారు . కొందరు ప్రజలకు కనెక్ట్ అయ్యేవారు. కొందరు ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు కాపలా కాసేవారిగా ఉంటారు. మా పోలీస్ మొదటి రకం.

రజిని లాంటి సీనియర్ హీరో నుండి మీరు ఏమి నేర్చుకున్నారు?

మనల్ని మనం నమ్మాలి, మన పోటీదారుల నుండి నేర్చుకోవాలి అంటారు. ఎవరో ఎదో చేసి సక్సెస్ అయ్యారని మనం కూడా అదే చేయకూడదు అని చెప్పేవారు. దేవుడు గురించి అనేక విషయాలు చెప్పేవారు. నాకు ఆయన ఓ బుక్ కూడా ఇచ్చారు. ప్రతి ప్రశ్నకు ఆయన దగ్గర సమాధానం ఉంటుంది.

అనిరుధ్ గురించి చెప్పండి?

అనిరుధ్ మా చిత్రానికి మంచి సాంగ్స్ ఇచ్చారు. అలాగే బీజీఎమ్ కూడా చక్కగా కుదిరింది. ఈ యంగ్ జనరేషన్ లో అనిరుధ్ కి మంచి టాలెంట్ ఉంది.

తెలుగులో డైరెక్ట్ మూవీ ఎప్పుడు చేస్తున్నారు?

తెలుగు నేటివిటీ తగ్గట్టుగా ఒక హీరో రోల్ ఎలా డిజైన్ చేయాలో నాకు అంతు చిక్కడం లేదు. అందుకే ఇక్కడి ప్రజల నాడి పట్టుకోవడం కష్టంగా ఉంది. తెలుగులో హీరో పాత్ర డిజైన్ ఎలా చేయాలో నాకు ఇంకా అర్థం కావడం లేదు

స్పైడర్ మూవీ ఫలితం తరువాత మహేష్ ఎలా స్పందించారు?

స్పైడర్ మూవీ ఫలితం నన్ను బాగా నిరాశపరిచింది. ఐనప్పటికీ మహేష్ రోజు ఫోన్, మెసేజ్ చేసేవారు. సినిమా అంతే మనం కష్టపడినా ఒక్కొక్కసారి మంచి ఫలితం రాదు అనేవారు. మహేష్ మనసు ఆయన శరీరం కంటే తెలుపు. అలాంటి హీరోకి ప్లాప్ ఇచ్చినందుకు చాలా బాధగా ఉంది.

మహేష్ లో మీరు గమనించిన విషయం?

ఎవరైనా సక్సెస్ ఇచ్చిన దర్శకుడిని మాత్రమే పలకరిస్తారు. కానీ మహేష్ ప్లాప్ ఇచ్చిన నాలాంటి దర్శకుడిని కూడా ఆయన ఆప్యాయంగా పలకరిస్తారు. అదే ఆయనలో ఉన్న బెస్ట్ క్వాలీటి.

సంబంధిత సమాచారం :

X
More